పసివాడు కాదు పాదుషా! బాలగంధర్వుడు … ఎస్, చూడగానే, ఎవరైనా వాడిని పాలబుగ్గల పసిమొగ్గే అనుకుంటారు! కానీ, రిథమిగ్గా రాగం అందుకుంటే., వాడు గండరగండడే, స్వచ్ఛమైన గానగంధర్వుడే! సకల విద్యాప్రదాయిని సరస్వతీ కటాక్షంతో కళకళలాడుతోన్న ఈ బంగారుకొండ, పాటలఖనికి ఏడేళ్లు! పేరు ఆవిర్భావ్, సన్ ఆఫ్ సజైమన్, సంధ్య! స్వస్థలం కేరళ రాష్ట్రం ఇడుక్కీ!
అక్క అనిర్విణ్యనే ఈ యంగ్ సింగర్ కు ఓనమాలు నేర్పిన ఆదిగురువు! ఈ చిచ్చరపిడుగు సంగీతంలో వేసే ప్రతి అడుగూ అక్క జాడల్లోనే! ఇద్దరి నిరంతర సాధనే వాళ్ల సక్సెస్ సీక్రెట్! ఒకరకంగా, ఆవిర్భావ్ సార్థక నామధేయుడు! అత్యద్భుతమైన స్వరతంత్రు [VocalChord] లతో ఈ భూలోకంలో మళ్లీ ఆవిర్భవించిన బాల తుంబురుడు! జీ టెలివిజన్ సరేగమ సంగీత కార్యక్రమంలో ఓ సక్కనోడా అంటూ అత్తిపుత్తి మాటలతో అతిచిన్న వయసులోనే అరంగేట్రం చేసిన బార్న్ లెజెండ్ అండ్ ఇన్నేట్ ఇంటెలిజెంట్!
గమ్మత్తేమిటంటే, వీడికి పొట్ట చీరితే అక్షరం ముక్క హిందీ రాదు! కానీ, గాతారహేమేరాదిల్ అంటూ బాలీవుడ్ ఆల్ టైం హిట్స్, సదాబహార్ [EverGreen] సాంగ్స్ ను మాత్రం అలవోకగా పాడేస్తాడు! అనుకుంటే, ఈ బాల గాయకుడు ఎంత హైపిచ్ రాగన్నైనా ఇట్టే అందుకుంటాడు! ఏ బాణీ ఐనా, మరే భావమైనా, ఆవిర్భావ్ ఒక్కసారి వింటే వందసార్లు విన్నట్లే! పట్టు పడితే పదనిసలనైనా, సరిగమలనైనా, సంగీతంలో ఎంతటి క్లిష్టతర ఆరోహణలనైనా, అవరోహణలనైనా చిటికెలో ఎక్కిదిగేస్తాడు! మ్యూజిక్కు అనుగుణంగా లయబద్దంగా చేతులూపుతూ, వేళ్లను నాట్యం ఆడిస్తూ, వోకల్_కార్డ్స్ పై ఆ స్వరాలను అనర్గళంగా పలికిస్తాడు!
Ads
ఒక్క హిందీ పాటలే కాదండోయ్, ఈ మలయాళ బుల్లోడు, దక్షిణాదిలోని అన్ని భాషల్లో పాటలు పాడగల దిట్ట! మరో అమ్మాయితో శృతి కలిపి జంటగా పాడినా మనోడు బంబాటే! ఆ సుస్వరఝరి మన వీనులను తాకగానే ఎంతటి వేదనైనా చేతితో తీసేసినట్లు మటుమాయం ఔతుంది! నిజం చెప్పాలంటే, లోకకళ్యాణం కోసం ఆనాడు శివుడు హాలాహలాన్ని మింగితే, సంగీతసంద్రంలో ప్రపంచాన్ని ఓలలాడించడానికి, ఈ బుడతడు గానామృతాన్ని తన స్వరపేటిక [Larynx] లో ఇముడ్చాడని పోల్చడం తప్పు కాదేమో!
ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ శతాబ్దపు గాన గంధర్వుడు ఘంటసాల మళ్లీ పుట్టారా అనిపించేంత మధురమైన గాత్రం ఆ చిన్నోడి సొంతం! ఇంకా చెప్పాలంటే, భారతీయ సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలు ఊగించడానికి ఆ దేవగాయకుడే ఆవిర్భావ్ రూపంలో స్వయంగా దివి [గంధర్వలోకం] నుంచి భువికి దిగొచ్చాడా? అన్నంతగా శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేస్తోన్న లివింగ్ లెజెండ్!
రేటింగ్స్, రెవెన్యూల కోసం ఏడ్పులను, ఎమోషన్స్ ను కమర్షియల్ చేశాయనే అపవాదును మినహాయిస్తే, సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్లో ప్రసారమయ్యే సూపర్_స్టార్_సింగర్ లాంటి ప్రోగ్రాంలు, ఇలాంటి సంగీత రత్నాల [MusicalGems] ను వెలికి తీయడంలో మషూర్ అనే చెప్పాలి! ఈ రంగంలో భవిష్యత్ తరాన్ని సిద్ధం చేయడంలో అవి కీలకపాత్రను పోషిస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు! ఇక, అలాంటి వేదికలపై మ్యూజిక్ బ్యాండ్ తో ఐ టు ఐ కాంటాక్టు కోసం మొదటి రోజు కుర్చీ ఎక్కి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆవిర్బావ్ లాంటి ముద్దులొలికే బాల కళాకారులు రాగయుక్తంగా పాట పాడుతుంటే ఎంతటివాళ్లమైనా కచ్చితంగా రోమాలు నిక్కబొడుస్తాయి!
మన ప్రమేయం లేకుండానే ఆటోమాటిగ్గా టపటపా ఆనందభాష్పాలు రాల్తాయి! మత్తెక్కి సంగీతపారవశ్యంలో మన ఒళ్లు పులకరిస్తుంది! చేతులు అప్రయత్నంగా చప్పట్లతో అభినందిస్తాయి! ఆనందాన్ని ఆపుకోలేక ఆ బుడిబుడి నడకల బుచ్చోళ్లను మనం పొగడ్తలు, ప్రశంసలతో ముంచెత్తడం ఖాయం!
అందుకే, క్యూట్ బాయ్ ఆవిర్భావ్ లాంటి అమెచ్యూర్ సింగర్స్ ఇవాళ సోషల్ మీడియాలో మెరుపు తీగలయ్యారు! మీడియా ఇంటర్వ్యూలతో బిజీబిజీ ఐపోయారు! మధురగానంతో ఓవైపు అలరిస్తూనే, మధ్యమధ్యలో తన చిట్టిపొట్టి వేషాలూ, చిలిపి చేష్టలతో ఈ చిన్నారి ఆవిర్భావ్ ప్రేక్షకుల మదిని దోచేస్తుంటాడు! సీజన్ 3 ప్రారంభంలో ఇసుమంతైనా హిందీ రాని ఈ ఏకసంథాగ్రహి, ఎండింగ్ కల్లా ఆడుతూపాడుతూ చాలా ఈజీగా ఆ భాష మాట్లాడటం నేర్చేసుకున్న వైనంపై నేహా కక్కర్ లాంటి ప్రోగ్రాం ఆర్గనైజర్స్ ప్రశంసలఝల్లు కురిపిస్తున్నారు!
ఈ సంగీత బాలసామ్రాట్టుకు ప్రాంతాలకతీతంగా జనం సైతం నీరాజనాలు పలుకుతున్నారు! అతిచిన్న వయసులో సెలబ్రిటీగా మారిన ఆవిర్బావ్ ది గ్రేట్ కు స్కూల్లో కూడా రెడ్ కార్పెట్ పరిచి బ్రహ్మరథం పడుతున్నారు! సూపర్ స్టార్ సింగర్ సీజన్ 3 ట్రోఫీతో పాటు ₹ 10 లక్షల క్యాష్ ప్రైజ్ నూ గెలుచుకున్న ఆవిర్భావ్ ఏది పాడినా అది ఓ సెన్సేషనల్ అండ్ మెమొరెబుల్ మెలొడీయే!
చాహుంగ_మై_తుఝె_సాంజ్_సవేరే అంటూ మహ్మద్ రఫీ పాట ఆలపించినా..
ఆజా_సనం_మధుర_చాందినీ_మే_హం అని మన్నాడేలా గొంతెత్తినా..
ఒ_సాథిరే_తెరె_బినా_భి_క్యా_జీనా అంటూ హుషారుగా కిషోర్ దాలా ట్యూన్ అందుకున్నా..
చిట్టీ_ఆయిహై_వతన్_సే_చిట్టీ_ఆయీహై అని పంకజ్ ఉధాస్ లా హై పీక్ పిచ్ లోకి వెళ్లినా..
దేఖో_మైనే_దేఖా_హై_యె_ఎక్_సప్నా అంటూ అమిత్ కుమార్లా రోమాంచిత రాగం అందుకున్నా..
కోయి_జో_మిలాతో_ముఝె_ఐస_లగ్తాథ_జైసె అని శంకర్ మహదేవన్ లాంటి ఉద్దండుల బ్రీత్ లెస్ సాంగ్ ను తీసుకున్నా..
ఆవిర్భావ్ ది యూనిక్ స్టైల్ ఆఫ్ సింగింగ్ అని చెప్పక తప్పదు! అలాంటి మెలోడియస్ సాంగ్స్ ను ఎన్నిటినో తన స్వీట్ అండ్ సింపుల్ వాయిస్ తో సునాయసంగా పాడేసి, పసివాడు కాదు పాదుషా అనిపించుకుంటున్న మల్టీ టాలెంటెడ్ కిడ్ ఆవిర్భావ్ ఇవాళ టాక్ ఆఫ్ ది నేషన్! హ్యాట్సాఫ్, ఆల్ ది వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ విత్ ఎ వెరీ బ్రైట్ కెరీర్ అహెడ్! మే యు గెట్ ఎ బిగ్ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్! మై బెస్ట్ విషెస్ విల్ ఆల్వేస్ బీ విత్ యూ డియర్ ఆవిర్భావ్! ……. ( SurajVBharadwaj ) మచ్చుకు ఒకటి…
Share this Article