ఓ చిన్న వీడియో బిట్ చూస్తే నిజంగా బాధేసింది… కోట శ్రీనివాసరావు ఇన్నాళ్లూ దాచుకుని, దాచుకుని ఇప్పుడెందుకు బయటపడి తను ఎదుర్కొన్న అవమానాల్ని చెబుతున్నాడో తెలియదు… బహుశా, ఎప్పుడో ఓసారి ప్రజలకు చెప్పాలి, ఇప్పుడిక నన్ను చేసేదేముంది వీళ్లు అనే మొండి ధైర్యమేమో… విషయం ఏమిటంటే..? అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణకూ, ఎన్టీయార్‌కూ పడేది కాదు… అది అందరికీ తెలుసు… ఎన్టీయార్ నిర్మించుకున్న ఓ బలమైన గ్రూపును ఢీకొన్నది కృష్ణే… అప్పట్లో ఎన్టీయార్ భజనబృందం చాలా పవర్ఫుల్… సీఎం అయ్యాడు… ఇంకేముంది..? ఆ స్థితిలో కృష్ణ మండలాధీశుడు అనే ఓ పొలిటికల్ సినిమా తీశాడు… ఎన్టీయారే టార్గెట్… ఇప్పుడు అలాంటి సినిమాలు తీసే ధైర్యం ఎవరికీ లేదు… అది వేరే సంగతి… ఎన్టీయార్ పాత్రను కోట పోషించాడు… దాంతో టోటల్ ఎన్టీయార్ గ్యాంగుకు గంగవెర్రులెత్తింది… అసహనంతో ఊగిపోయారు…
కృష్ణ కూడా సేమ్ ఎన్టీయార్ సామాజికవర్గమే… నువ్వెంత అంటే నువ్వెంత అనే కేరక్టర్… తనకూ బలమైన గ్రూపు ఉంది టాలీవుడ్లో… వెండికత్తెర్లు, షూటింగు బట్టల్ని కూడా ఇంటికి తీసుకుపోయే ఎన్టీయార్ ఒకవైపు… నిర్మాతల కోసం ఎంతకంటే అంతకు ఔదార్యం చూపే కృష్ణ… సో, కృష్ణ జోలికి రాలేదు, మధ్యలో కోట దొరికాడు… ఓసారి విజయవాడలో కొట్టారు… బీభత్సంగా… తప్పించుకుని పారిపోయాడు… ఓచోట బాలకృష్ణ కనిపిస్తే కోట నమస్కారం బాబూ అన్నాడుట… టాలీవుడ్ అంటేనే బాబుల రాజ్యం కదా… ఎంత చిన్నవాడైౌనా బాబూ అని కాళ్లు మొక్కేయాలి, లేకపోతే ఆ బ్లడ్డు ఆ బ్రీడ్ ఊరుకోవు… కారణజన్ములు, దైవాంశసంభూతులు, భూతాలు కదా… పైగా నాన్నగారి వేషం వేసి, నెెగెటివ్ సినిమాలో నటించాడు, బాలయ్య అంటేనే ఆవేశం కదా… కోట మొహం మీద కాండ్రించి ఉమ్మేశాడట… సరే, అప్పట్లో దిక్కులేక తుడిచేసుకుని, మొహం దాచుకుని పోయి ఉంటాడు కోట… తరువాత ఎమ్మెల్యే కూడా అయ్యాడు… కానీ ఎన్టీయార్ గ్యాంగును ధిక్కరించే సాహసానికి కూడా పోలేదు ఆయన…
Ads
అవమానాలన్నీ దాచుకున్నాడు… ఇప్పుడు కూడా తనకు ఎన్టీయార్ గ్యాంగు చేసిన పరాభవాల్ని చెబుతూనే… ఏం చేస్తాం మరి, కోపం సహజమే కదా అని మర్మగర్భంగా తన బాధను, కోపాన్ని వ్యక్తీకరిస్తున్నాడు… కానీ టాలీవుడ్ ఎంత ఘోరంగా ఉంటుందో, అక్కడ కులం, అహం, బలుపు గట్రా మనుషుల్ని ఎలా ట్రీట్ చేస్తాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ… ఒక నటుడు, పొట్టకూటి కోసం తనకు వచ్చిన ఓ పాత్రను పోషించాడు, పాత్రకు తగినట్టు నటించడమే తన వృత్తి… అంతే… అది తప్పా..? దమ్ముంటే కృష్ణ జోలికి పోవాల్సింది… వెళ్లరు… మళ్లీ వేరే ఈక్వేషన్స్ ఉంటయ్… మధ్యలో ఇలాంటి బకరాల మీద ప్రతాపం… చిరంజీవి వచ్చాక తన చుట్టూ మరో బలమైన గ్రూపు ఏర్పడింది… ఢీఅంటేఢీ అనే గ్రూపు… చివరకు ఇప్పుడు కూడా కేసీయార్, జగన్‌ల వద్దకు వెళ్లే సినిమా పెద్దల టీం బాలయ్యను మాత్రం పిలవదు… అసహనంతో ఊగిపోవడం తప్ప బాలయ్య చేసేదేమీ లేదు… ఎల్లప్పుడూ రోజులు ఒకలా ఉండవు… ఓ రోజు వస్తుంది… బ్లడ్డు బ్రీడు పూచికపుల్లకూ కొరగావు… బూతులు, కోపాలు, తన్నులు… ఎల్లకాలమూ సాగవు… ఐనా, అంత అదే ఉంటే… చంద్రబాబుకు, మరీ ఘోరంగా ఇప్పుడు లోకేష్‌కు ఎందుకు అప్పగిస్తారు తమ NTR వారసత్వాన్ని…!!
Share this Article