Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బర్మా, బంగ్లాదేశ్… రెండూ బాల్కనైజేషన్ ప్రమాదంలో… ఇదుగో ఇలా…

December 25, 2024 by M S R

.

. ( పొట్లూరి పార్థసారథి )..           .. బాల్కనైజేషన్ అఫ్ బర్మా – part 3

బర్మాలో ఏదో జరగబోతున్నది అని గ్రహించి భారత విదేశాంగ శాఖ గత సెప్టెంబర్ 22 న ఒక ఆహ్వానం పంపించింది.

Ads

నవంబర్, 2024 లో జరగబోయే Indian Council of World Affairs ( ICWA ) సమావేశానికి రావాలని కోరుతూ బర్మాలో సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రాజకీయ పార్టీలకి, ఆయుధాలతో పోరాడుతున్న రెబెల్ గ్రూపులు అయిన అరకాన్ ఆర్మీ, చిన్ నేషనల్ ఫ్రంట్, కచిన్ ఇండిపెండన్స్ ఆర్మీ లకి ఆహ్వానం పంపించింది! బర్మా సైనిక ప్రభుత్వానికి ఆహ్వానం పంపించలేదు కాబట్టి భారత ప్రభుత్వం బర్మా సైనిక ప్రభుత్వం పట్ల సుముఖంగా లేనట్లే అని భావించాలి!

గత నెలలో జరిగిన ఈ సెమినార్ కు బర్మా రెబెల్ గ్రూపుల ప్రతినిధులు హాజరయ్యారు. ICWA సెమినార్ ఉద్దేశ్యం ఏమిటంటే ‘ రాజ్యాంగం మరియు ఫెడరల్ వ్యవస్థ ‘ అనే అంశం మీద చర్చలు, సలహాలు, సూచనలు పంచుకోవడం!

భారత ప్రభుత్వం ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది!

బాంగ్లాదేశ్, బర్మాలలో రాజకీయ అనిస్శ్చితి, సివిల్ వార్ లు మన దేశానికి మంచిది కాదు కాబట్టి అమెరికా జోక్యం చేసుకునే అవకాశం ఇవ్వకుండా మనమే చొరవ తీసుకుని బర్మా మరో యుగొస్లావయ కాకుండా చూడడం!

*********
డిసెంబర్ 16 న అరకాన్ ఆర్మీ రఖైన్ ప్రావిన్స్ ని తన ఆధీనంలోకి తీసుకుని రఖైన్ ప్రావిన్స్ కి సరిహద్దు లో ఉన్న మౌంగ్డవ ( Maungdaw )సైనిక చెక్ పోస్ట్ కూడా స్వాధీనం చేసుకుంది. ఈ చెక్ పోస్ట్ బాంగ్లాదేశ్ లో ఉన్న నాఫ్ నదికి దగ్గరలో ఉంది.

Well! అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది!
బర్మా సైనిక చెక్ పోస్ట్ ని స్వాధీనం చేసుకున్నాక అరకాన్ ఆర్మీ తరువాత యాక్షన్ ప్లాన్ కోసం ఎదురు చూసింది!

అంటే ఎవరి ఆదేశాల కోసమో వేచి చూడడం అన్నమాట! ఎవరు ఇస్తారు తదుపరి ఆదేశాలు?

రఖైన్ ప్రావిన్స్ కి బాంగ్లాదేశ్ తో 271 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. రఖైన్ ప్రావిన్స్ లో ఉన్న బర్మా ఆర్మీ రీజనల్ హెడ్ క్వార్టర్స్ ని కూడా అరకాన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది కాబట్టి ఏ నిర్ణయం అయినా అరకాన్ ఆర్మీ తీసుకోగలదు.

అయితే ధ్రువీకరించని వార్త ఏమిటంటే అరకాన్ ఆర్మీ నాఫ్ నది దాటి బాంగ్లాదేశ్ లోకి ప్రవేశించి టేక్ నాఫ్ (Teknaf ) పట్టణo లోకి ప్రవేశించారు అని.

ఇప్పటి వరకూ బాంగ్లాదేశ్ ఈ విషయం మీద ఎలాంటి ప్రకటన చేయకుండా మౌనంగా ఉంది! దీనికి బలమైన కారణం ఉంది.

*******
భారత్ బాంగ్లాదేశ్ ల మధ్య సంబంధాలు చెడిపోయి చాలా కాలం అయింది!

భారత్ సైనిక చర్య తీసుకోవాలి అనే డిమాండ్ బలంగా ఉంది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితిలో ఎవరో ఒకరు ముందుగా బుల్లెట్ పేల్చాలి!

ఆ అవసరం వస్తుంది అని అనుకోను!

రెండు ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయి బాంగ్లాదేశ్ కి.

1.బాంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్ ( Cox’s Bazar ) జిల్లాలోని దక్షిణ భాగంలో నాఫ్ నదికి దగ్గరలో రోహింగ్యా శరణార్థుల శిబిరాలు ఉన్నాయి. ఇవి వెదురుతో అల్లిన చిన్న చిన్న గుడిసెలు. వీటిని రోహింగ్యాలే వెదురుతో ఆల్లి కట్టుకున్నారు!
మొత్తం 10 లక్షల రోహింగ్యాలు ఉన్నారు అక్కడ.

ఎప్పుడైతే బాంగ్లాదేశ్ సరిహద్దులో బర్మా చెక్ పోస్ట్ అరకాన్ ఆర్మీ అధీనంలొకి వెళ్ళిపోయింది అనే వార్త వచ్చిందో శరణార్ది శిబిరాలలో ఉన్న రోహింగ్యాలు వణికిపోయారు! ఎంతలా అంటే తాము ఉన్న చోటు నుండి పారిపోయి బాంగ్లాదేశ్ లోని ఇతర జన సమూహం ఉన్న చోటికి వెళ్లి తల దాచుకోవాలి అనేంతగా! దాంతో కాక్స్ బజార్ జిల్లా పోలీసులు అప్రమత్తం అయిపోయి విషయం సైన్యానికి తెలిపారు కానీ సైన్యం అక్కడికి రావడానికి సిద్ధంగా లేము మీరే (పోలీసులు ) కంట్రోల్ చేసుకోండి అంటూ సలహా ఇచ్చింది.

పోలీసులు 10 లక్షల మందిని అదుపు చేయలేరు. పైగా రోహింగ్యాలు ఉన్న శిబిరాలలో శుభ్రత లేకపోవడం వలన అంటు వ్యాదులు ప్రబలి ఘోరంగా ఉంది. వీళ్ళు కనుక జనావాసాలలోకి వస్తే బాంగ్లాదేశ్ అంటు వ్యాధులతో అతలా కుతలం అవుతుంది అందుకే కీలకమైన సమయంలో డయేరియా లాంటి వ్యాధుల బారిన పడకుండా సైన్యం రాను అంది!

2.నాఫ్ నది ఉన్న ప్రాంతంలో చిన్న ద్వీపం ఉంది అది తమదే అని అరకాన్ ప్రజలు చాలా కాలం నుండి తిరిగి ఇచ్చేయమని డిమాండ్ చేస్తున్నారు. అందువల్ల సైన్యం దృష్టి నాఫ్ నది మీద ఉంది. తమ దేశ స్వంత సైన్యం మీద ఆధిపత్యం వహించిన అరకాన్ ఆర్మీని ఎదుర్కోవడం బంగ్లాదేశ్ సైన్యానికి పెద్ద సవాలు.

మరో వైపు చికెన్ నెక్ ప్రాంతాన్ని బంగ్లాదేశ్ సైన్యం కాపాడుకోవాలి ఎందుకంటే 1971 బాంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సమయంలో చికెన్ నెక్ నుండి భారత సైన్యం బాంగ్లాదేశ్ లోకి వెళ్లి ఆ ప్రాంతాన్ని మూడుగంటలలోపు స్వాధీనం చేసుకోగలిగింది. అప్పట్లో అక్కడ పాకిస్థాన్ సైన్యం ఉండేది.

అలాంటిది ఇప్పటి రోజున ఒక గంట చాలు చికెన్ నెక్ ని ఎలిఫెంట్ నెక్ గా మార్చడానికి.

కాబట్టి బర్మా సరిహద్దుల వద్ద భారీగా సైన్యాన్ని మొహరించలేదు. అలా అని అరకాన్ ఆర్మీని ఉపేక్షించలేదు!  అటు మొహరిస్తే చికెన్ నెక్ పోతుంది.

కాబట్టి అరకాన్ ఆర్మీ ఇప్పుడు ఉన్న చోటునే ఉండాలి. మొదటి బుల్లెట్ బాంగ్లాదేశ్ పేల్చే వరకూ ఓపికగా ఉండాలి!

అసలు ఇవేవి కాకుండా అరకాన్ ఆర్మీ కాక్స్ బజార్ లొకి వచ్చేసింది అనే పుకారు చాలు 10 లక్షల మంది రోహింగ్యాలు భయంతో బాంగ్లాదేశ్ పట్టణాలలోకి పారిపోయి విధ్వంసం సృష్టిస్తారు!

*********
ఎప్పుడైతే అరకాన్ ఆర్మీ తమ సరిహద్దులలోకి వచ్చింది అనే వార్త వినగానే ముందు బర్మా, థాయిలాండ్, లావోస్ దేశాల విదేశాంగ శాఖ అధికారులతో బాంగ్లాదేశ్ విదేశాంగ ప్రతినిధి సమావేశం అయ్యి రోహింగ్యాలని తిరిగి బర్మా పంపించే అంశంలో తమకి సహాయ పడవలసిందిగా అభ్యర్థిస్తున్నాడు. ప్రస్తుతం బర్మా ఆర్మీకి రోహింగ్యా అరకాన్ సాల్వేషన్ ఆర్మీ అవసరం ఉంది, ఎందుకంటే అరకాన్ ఆర్మీని ఎదుర్కోవాలి.

కానీ రఖైన్ ప్రావిన్స్ లో ఇప్పుడు సైన్యానికి ఎలాంటి అధికారం లేదు కాబట్టి రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీకి చెందిన 60 వేల మందిని బౌద్ధ ఆర్మీ త్వరలో బాంగ్లాదేశ్ కి తరిమేస్తుంది! ఇది జరిగిన తరువాతే అజిత్ దోవల్  తదుపరి ఆదేశాలు ఇస్తారు!

బాల్కనైజేషన్ అఫ్ బర్మా మరియు బాంగ్లాదేశ్ లు జరుగుతాయి. అది వచ్చే 2025 జనవరి లో జరగవచ్చు!

50 వేల టన్నుల బియ్యం సబ్సిడీ ధరలో ఇవ్వాలని బాంగ్లాదేశ్ భారత్ ని అభ్యర్థించింది.

గత ఆరు నెలలుగా బాంగ్లాదేశ్ లో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రధాన విదేశీ మారక ద్రవ్యం ఆర్జించిపెట్టే రేడిమెడ్ దుస్తులు పరిశ్రమ 80% మూత పడిపోయింది విద్యుత్ సరఫరా లేకపోవడం వలన…

Contd… part 4

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!
  • అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
  • అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…
  • అత్యంత అసాధారణ కరెంటు బిల్లు… నమ్మడమే కష్టం సుమీ….
  • సొంత ‘బతుకమ్మ’ పేర్చుకుని… తన ఆట తాను ఆడుకోవడమేనా..?
  • ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!
  • ఆ సిరివెన్నెల పాటలు… రాసిన అర్థాలు వేరు- వాడుకున్న తీరు వేరు…
  • శరణార్థుల ఆశాసూచిక – భారత రాజ్యాంగంలోని కుబేరుని కళాచిత్రం…
  • కశ్మీర్‌లో యూఎన్ ధర్మసత్రం షట్‌డౌన్… శెభాష్ జైశంకర్… ఇదీ టెంపర్‌మెంట్..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions