Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రంగనాయకమ్మ పాపులర్ నవలకు దాసరి మార్క్ స్క్రీన్ ప్లే..!!

July 28, 2024 by M S R

శోభన్ బాబు- శారద జోడీలో వచ్చిన మరో గొప్ప సినిమా 1975 లో వచ్చిన ఈ బలిపీఠం సినిమా . 1962-63 లో ఆంధ్రప్రభ వారపత్రికలో ఈ బలిపీఠం నవల సీరియల్ గా వచ్చింది . నవల , సినిమా రెండూ తెలుగు మహిళలకు బాగా నచ్చాయి .

ప్రేమ వివాహాలలో ఆర్ధిక అంతరాల వలన , భేషజాల వంటి ఇష్యూలతో భార్యాభర్తలు విడిపోవటం అనే కధాంశంతో చాలా సినిమాలు వచ్చాయి . ఈ కధలో జంట ప్రేమించుకుని పెళ్లి చేసుకోరు . చావుకు సిధ్ధంగా ఉన్న ఒక స్త్రీ సుమంగళిగా చనిపోవాలనే కోరిక కలిగి ఉండటం , అందుకు ఓ సంస్కరణవాది ముందుకు వచ్చి పెళ్లి చేసుకోవటం , ఆ తర్వాత అనూహ్యంగా ఆమె ఆరోగ్యవంతురాలు కావటం , మనుషుల్లో నరనరాల్లో జీర్ణించుకుపోయిన కులాల హెచ్చుతగ్గుల వలన భర్తను , భర్త వైపు వారిని అసహ్యించుకోవటం , చివరకు తప్పు తెలుసుకుని భర్త చేతుల్లో చనిపోవటం కధాంశం .

రంగనాయకమ్మ పాత్రలను అన్నింటినీ అద్భుతంగా మలిచింది . అందుకు ధీటుగా దర్శకుడు దాసరి నారాయణరావు బిర్రయిన స్క్రీన్ ప్లేని తయారు చేసుకున్నారు . రెండు జంటలు ఉంటాయి సినిమాలో . ఒకటి శోభన్ బాబు- శారద . మరొకటి రాజబాబు- రోజారమణి . రెండూ వర్ణాంతర , మతాంతర వివాహాలే . ఒకటి విఫలమయితే మరొకటి సఫలమవుతుంది . ఆ కాంట్రాస్ట్ చాలా బాగా చూపించారు .

Ads

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి . శ్రీశ్రీ వ్రాసిన కలిసి పాడుదాం తెలుగు పాట . కందుకూరి , గురజాడల ఔన్నత్యాన్ని గురించి శ్లాఘించే పాట అద్భుతంగా ఉంటుంది . సి నారాయణరెడ్డి వ్రాసిన మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి పాట ఈరోజుకీ వర్తిస్తుంది . సాంప్రదాయవాదం vs అభ్యుదయవాదం .

దేవులపల్లి వారి కుశలమా నీవు కుశలమేనా పాటలో దేవులపల్లి వారే కనిపిస్తారు . చాలా చక్కటి సాహిత్యం . చాలా శ్రావ్యంగా ఉంటుంది . అలాగే దాశరధి వ్రాసిన చందమామ రావే జాబిల్లి రావే పాట కూడా చాలా శ్రావ్యంగా ఉంటుంది .

హేమలత , అల్లు రామలింగయ్య , సత్యనారాయణ , నిర్మలమ్మ , ముక్కామల , గిరిజ , జానకి , ప్రభాకరరెడ్డి , శ్రీవిద్య , ప్రసన్నరాణి , పుష్పకుమారి ప్రభృతులు నటించారు . మా గుంటూరు జిల్లా బాపట్ల వారయిన ముప్పలనేని శేషగిరిరావు గారు నిర్మాత . బాపట్లలోని పలు విద్యాసంస్ధల స్థాపనలో ప్రధాన పాత్రధారి , రాజకీయ నాయకులు .

నాలుగు కేంద్రాలలో వంద రోజులు ఆడింది . కేవలం మంచి సినిమా మాత్రమే కాదు ; గొప్ప సందేశాత్మక సినిమా కూడా . అప్పుడప్పుడు టివిలో కూడా వస్తుంటుంది . యూట్యూబులో ఉంది . చూసి ఉండకపోతే తప్పక చూడండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు …….. [ By దోగిపర్తి సుబ్రహ్మణ్యం ]

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం మల్లోజుల… లొంగిపోయిన తుపాకీ అంటే అందరికీ అలుసే…
  • కన్నడ- తెలుగు సంకర భాష… తెలుగుకు ఇదోరకం చేతబడి…
  • ఊదు కాలదు, పీరు లేవదు… ఆ ఎల్లమ్మ కథ ఎటూ తేలదు…
  • మిత్రమండలి..! మనకు మనమే చక్కిలిగిలి పెట్టుకుని నవ్వుకోవాల్సిందే..!!
  • ఈ సినిమా ఒకటి చేసినట్టు బహుశా చిరంజీవికీ గుర్తుండి ఉండదు..!!
  • విశాఖలో గూగుల్ డేటా సెంటర్… ప్రపంచం నేర్పిన పాఠాలు…
  • నాకు నువ్వు- నీకు నేను…!! బీజేపీ- బీఆర్ఎస్ రహస్య స్నేహం..?!
  • ఈ పాట పీక పిసికిన హంతకుడెవరు..? ఈమె ఎందుకు మూగబోయింది..!?
  • లొంగుబాటలో తుపాకీ..! మల్లోజుల బాటలోనే ఆశన్న… మరో దెబ్బ..!!
  • ఈ ప్రభుత్వ శాఖ తరఫున ఆంధ్రజ్యోతికి భారీ అభిమాన ప్రకటన…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions