Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాల్కనైజేషన్ ఆఫ్ సిరియా… ప్రపంచగతి మారుతోంది వేగంగా…

December 27, 2024 by M S R

.

బాల్కనైజేష్ అఫ్ సిరియా – Balkanization of Siriya! … Part 4

సిరియా బాల్కనైజేషన్ గురుంచి చెప్పుకునే ముందు లిబియా అధ్యక్షుడు మొహమ్మద్ గడాఫీ అన్న మాటలని గుర్తు చేసుకొని ముందుకి వెళితే పరిస్థితి అర్ధం అవుతుంది!

Ads

2011 లో లిబియా అధ్యక్షుడు మొహమ్మద్ గడాఫీని ప్రజలు కొట్టి చంపివేయడానికి రెండు రోజుల ముందు అన్న మాటలు ఇవి..

“ అమెరికన్ల ప్లాన్ ఏమిటంటే లెబనాన్, సిరియా దేశాలని ప్రపంచ పటం నుండి తీసివేయాలని…

syria

ఇప్పుడు మనం చూస్తున్న ఇజ్రాయేల్ సరిహద్దు లెబనాన్, సిరియా, జోర్దాన్, ఈజీప్ట్ దేశాలు ముందు ముందు ఉండవు.

సిరియాని నాలుగు భాగాలుగా విభజిస్తారు. ఇజ్రాయేల్ సిరియా రాజధాని డమాస్కస్ వరకూ ఆక్రమిస్తుంది. టర్కీ కొంత భాగం తీసుకుంటుంది. కొంత భాగం ముస్లిమ్స్ కి వదిలేస్తారు. కుర్థులకి మిగిలిన భాగం ఇస్తారు. సిరియా అనే దేశం ఉండదు.

లెబనాన్ అనే దేశం ఉండదు. ఇజ్రాయేల్ సరిహద్దు లెబనాన్ తో ఉండదు టర్కీతో ఉంటుంది. లెబనాన్ ని నాలుగు ముక్కలు చేసి ఎక్కువ భాగం ఇజ్రాయేల్ తీసుకుంటుంది.

ఈజీప్ట్ మూడు భాగాలుగా విభజించబడుతుంది. వీటి మ్యాపులు చాలా కాలం కిందటే రెడీ చేసి పెట్టుకున్నారు. నేను, మీరు చూడక పోవచ్చు కానీ మన పిల్లలు చూస్తారు ఇదంతా ”

మొహమ్మద్ గడాఫీ 2011 లో అన్న మాటలు ఇప్పుడు నిజమవుతూ మనం చూస్తున్నాము…

********
అఫ్కోర్స్! 2 వేల ఏళ్ళ క్రితం లెబనాన్, సిరియా, జోర్దాన్, ఈజీప్ట్ దేశాలు ఇజ్రాయేల్ దేశంలో భాగంగా ఉండేది అన్నది నిజం!

యూదుల ఆశయం అఖండ ఇజ్రాయేల్ లేదా గ్రేటర్ ఇజ్రాయేల్! ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అన్యాయం అనిపిస్తుంది కానీ గత రెండు వేల ఏళ్లుగా యూదులు అణిచివేయబడుతూ వచ్చారు అన్నది నిజం!

యూదులు అణిచివేయబడకుండా ఆదరించబడ్డది ఒక్క భారతదేశంలోనే అన్నదీ నిజం!

israel

*******
So! బాల్కనైజేషన్ అఫ్ సిరియా అనేది తప్పనిసరి చర్య అనే చెప్పాల్సిన అవసరం ఉంది.

మౌంట్ హెర్మాన్ – Mount Hermon!

మౌంట్ హెర్మాన్ అనేది సిరియా, ఇజ్రాయల్ ని వేరు చేస్తూ సిరియా భూభాగంలో ఉంది. సిరియాలో ఉన్న ఎత్తయిన పర్వతం మౌంట్ హెర్మోన్! సముద్ర మట్టానికి 9,232 అడుగుల ఎత్తులో ఉంటుంది.

మౌంట్ హెర్మోన్ సిరియా భూభాగంలోనే ఉన్నా అది బఫర్ జోన్ లో ఉంది, అంటే సిరియా ఇజ్రాయేల్ సరిహద్దులని వేరు చేస్తూ అటు సిరియా సైన్యం కానీ ఇటు ఇజ్రాయేల్ సైన్యం కానీ ఉండని ‘ నో మాన్ జోన్ ‘ గా ఉండాలని 50 ఏళ్ళ క్రితం ఒప్పందం జరిగింది! గత 50 ఏళ్లుగా నిర్మానుష్యంగా ఉంది.

1974 లో ఇజ్రాయేల్ సిరియాల మధ్య సరిహద్దు పొడవునా 1 నుండి 5 km వెడల్పుతో బఫర్ జోన్ ఏర్పాటు అయ్యింది!

రెండు వారాల క్రితం ఇజ్రాయేల్ సైన్యం మౌంట్ హెర్మాన్ ని స్వాధీనం చేసుకుంది! ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు ఇజ్రాయేల్ చీఫ్ అఫ్ స్టాఫ్, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ చీఫ్ లతో పాటు మౌంట్ హెర్మాన్ మీదకి వెళ్లి అక్కడ సెల్ఫీ తీసుకొని మీడియాకి ఇచ్చారు!

మౌంట్ హెర్మాన్ బాగా ఎత్తులో ఉండడం వలన తరుచూ సిరియా సైన్యం, హమాస్, హెఙబొల్లా ఉగ్రవాదులు అక్కడ నుండి ఇజ్రాయేల్ పొలాలలో పనిచేసే రైతుల మీద కాల్పులు జరిపే వారు, దాంతో రైతులు వ్యవసాయ పనులు ఆపి పారిపోయే వాళ్ళు. మౌంట్ హెర్మోన్ ఎత్తులో ఉండడం వలన ఇజ్రాయేల్ సైన్యానికి కష్టంగా ఉండేది!

iran

అస్సద్ రష్యా పారిపోవడంతో ఇజ్రాయేల్ వెంటనే మౌంట్ హెర్మోన్ ని స్వాధీనం చేసుకుంది! ఇక సిరియాలోని రెబెల్స్ అధికారం ఎలా పంచుకోవాలో అనే దాని మీద దృష్టి పెట్టారు తప్పితే మౌంట్ హెర్మోన్ మీద ఆసక్తి లేదు వాళ్లకి.

రెబెల్స్ కి ముందు చూపు గనుక ఉంటే రష్యన్ యుద్ధ టాంక్స్ ని నాశనం చేయకుండా ఉండేవారు. షియా జెనరల్స్ తో పాటు కమాండర్స్ ని కూడా చంపేశారు! సిరియా ఆర్మీ దగ్గర ఉన్న పాతకాలం యుద్ధ టాంకులు ఇజ్రాయేల్ మెర్కోవా యుద్ధ టాంకుల ముందు నిలబడవు! యుద్ధ టాంకులు, హెలికాప్టర్ గన్ షిప్స్ లేకుండా పర్వతం మీదకి వెళ్లి ఇజ్రాయేల్ సైన్యంతో తలపడలేరు రెబెల్స్!

So! గ్రేటర్ ఇజ్రాయేల్ లేదా అఖండ ఇజ్రాయేల్ కి శంఖు స్థాపన జరిగింది మౌంట్ హెర్మోన్ ని స్వాధీనం చేసుకోవడంతో!

ఇక పిల్లర్లు వేసి స్లాబు వేసే రోజు ఎంతో దూరంలో లేదు! మౌంట్ హెర్మోన్ నుండి సిరియా రాజధాని డమాస్కస్ 40 km దూరంలో ఉంది!

israel

చాలా ప్లాన్డ్ గా ఉంది ఇజ్రాయేల్!

మౌంట్ హెర్మోన్ ని స్వాధీనం చేసుకునే ముందు ఇజ్రాయేల్ ఎయిర్ ఫోర్స్ సిరియాలోకి వెళ్లి స్వేచ్ఛగా బాంబింగ్ చేసింది. సిరియన్ ఆర్మీకి చెందిన ఆయుధ నిల్వలున్న డిపోల మీద బాంబుల వర్షం కురిపించి నాశనం చేసింది! ఇది రెండు విధాలగా ఉపయోగపడుతుంది. హెఙబొల్లా, హమాస్ లకి ఆయుధాల సరఫరా ఉండదు. ఒకవేళ రెబెల్స్ కి కావాలన్నా ఏమీ ఉండవు.

సిరియా నుండి లెబనాన్ లోకి తవ్విన సొరంగాలని బాంబులు వేసి వాటిని మూసేసింది! ఈ సొరంగాల నుండే సిరియా నుండి లెబనాన్ లోకి ఆయుధ సరఫరా జరుగుతూ వచ్చింది! సీరియలోకి ఇరాన్ నుండి సముద్ర, ఆకాశ మార్గాన ఆయుధ రవాణా జరిగేది!

మౌంట్ హెర్మోన్ ఇజ్రాయేల్ అధీనంలోకి వచ్చింది కాబట్టి డమాస్కస్ ఎయిర్ పోర్ట్ లోకి ఏ విమానం దిగినా ఇజ్రాయేల్ కి తెలిసిపోతుంది!

సిరియాలో ఉన్న హెఙబొల్లా, హమాస్ ఉగ్రవాదులు చనిపోయిన వారు చనిపోగా కొద్ది మంది మాత్రమే లెబనాన్ లోకి వెళ్ళగలిగారు! అఫ్కోర్స్! కాలి నడకతోనే వెళ్లారు ak 47 లు లేకుండా!

putin

రష్యా కి మరో దెబ్బ!
సిరియాలో ఇప్పటికీ రెండు వేలమంది రష్యన్ సైనికులు ఉన్నారు కానీ వాళ్ళని కూడా వెంటాడి చంపేస్తున్నారు రెబెల్స్. ఇదివరకటిలాగా వాళ్ళతో సిరియా సైనికులు లేరు కాబట్టి వాళ్ళని రెబెల్స్ వదలరు. పుతిన్ కూడా వాళ్ళని రక్షించలేని స్థితిలో ఉన్నాడు.

బహుశా అమెరికా, ఇజ్రాయేల్ లు రెబెల్స్ కి చెప్పుండవచ్చు మిగిలిన రష్యన్ సైనికులని చంపితేనే కానీ మీరు ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి మా మద్దతు, గుర్తింపు ఉంటుందని!

ఇజ్రాయేల్ మధ్యధరా సముద్ర తీరంలో ఉన్న రష్యన్ ఎయిర్ బేస్, పోర్టుల మీద బాంబులు వేసి పనికిరాకుండా చేసింది!

ఇరాన్ నుండి అటు లెబనాన్ కి కానీ ఇటు సిరియాకి కానీ ఆయుధ, ఆహార, మందుల సరఫరా కానీ ఉండదు ఇక మీదట!

putin

ఇజ్రాయేల్ టెక్నీకల్ ఎక్స్లన్స్!

ఇది నెల రోజుల క్రితం జరిగిన సంఘటన!

చివరి ప్రయత్నంగా ఇరాన్ ఒక రవాణా విమానం పంపించింది లెబనాన్ రాజధాని బీరూట్ కి! ఆ విమానంలో ఇరాన్ కి చెందిన యుద్ధ నిపుణులు, ఇంజినీర్లు, గుర్తు తెలియని ఆయుధాలు ఉన్నాయని అనుమానించిన మోస్సాద్ ఆ విమానం బీరుట్ ఎయిర్ పోర్టులో దిగకుండా చేసింది!
ఎలా?
జస్ట్ బీరూట్ ఎయిర్ పోర్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC ) ని హ్యాక్ చేసింది!

ఇరాన్ రవాణా విమానం బీరూట్ ATC పరిధిలోకి రాగానే పైలట్ ATC ని లాండింగ్ కోసం అనుమతి కోరాడు. మామూలుగా అయితే ATC తగిన సూచనలు చేసి ఆ విమానం ఎన్నో నంబర్ రన్ వే మీద లాండ్ అవ్వాలి, ఎంత ఎత్తు (Latitude ) మెంటైన్ చేయాలి లాంటి సూచనలు ఇస్తాడు ATC లోని ఆపరేటర్!

కానీ ఆ రోజు ATC ఆపరేటర్ ఇరాన్ విమానానికి ల్యాండ్ అవడానికి అనుమతి ఇవ్వకపోగా వెనక్కి తిరిగి వెళ్లిపొమ్మని సలహా ఇచ్చాడు.

బహుశా బీరూట్ ఎయిర్ పోర్ట్ ఇజ్రాయేల్ అధీనంలోకి వెళ్ళిపోయి ఉంటుంది అని భావించిన ఇరాన్ పైలట్ విమానాన్ని వెనక్కి తిప్పి టెహ్రాన్ కి తీసుకెళ్లాడు!

israel

అసలు జరిగింది ఏమిటీ?

సాధారణంగా ప్రయాణీకుల ఎయిర్ పోర్ట్ లలో ఉండే ATC సిగ్నల్ పరిధి 100 KM దాకా ఉంటుంది. ఇరాన్ విమానం బీరూట్ ATC పరిధిలోకి రాగానే విమానం కాల్ సైన్ ( Call Sign ) చెప్పి పైలట్ పరిచయం చేసుకొని తాను ఎంత ఎత్తులో ఎగురుతున్నది, ఎంత వేగంతో ఉన్నది, ఏ దిశలో ఉన్నది ATC కి చెప్తాడు. ATC ఎత్తు ఎంత ఉండాలి, వేగం ఎంత ఉండాలి, ఏ దిశలో రావాలో పైలట్ కి చెప్తాడు దాని ప్రకారమే పైలట్ నడుచుకోవాలి.

సరిగ్గా బీరూట్ కి దగ్గరికి రాగానే మోస్సాద్ కి అనుమానం వచ్చి బీరూట్ ATC ని హ్యాక్ చేసి ఇరాన్ పైలట్ కి లాండింగ్ పర్మిషన్ ఇవ్వకుండా వెనక్కి వెళ్లిపోవాలని చెప్పింది!

ఇరాన్ విమానం టెహ్రాన్ కి తిరిగి చేరుకున్నాక మాత్రమే అసలు విషయం తెలిసింది!

గతంలోనే ఇజ్రాయేల్ స్పష్టంగా చెప్పింది పేజర్ బాంబులు అనేవి మాకు చిన్న విషయం మేము ప్రయోగించాల్సిన టెక్నాలజీ ఎవరి ఊహకి అందనంతగా ఉంటుంది అని!

బీరూట్ ఎయిర్ పోర్ట్ ATC హ్యాక్ చేయడం జస్ట్ ఇంకో టెక్నలాజికల్ ఎక్స్లెన్స్ అన్నమాట!

బహుశా ఆ రోజు ఇరాన్ రవాణా విమానం ని బీరూట్ లో దిగకుండా ఆపకుండా ఉంటే ఇజ్రాయేల్ కి మౌంట్ హెర్మోన్ దొరకడం అనేది ఆలస్యం అయి ఉండేది!

ఇంకా ఉంది…. పార్ట్ 5 లో తెలుసుకుందాం!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ సైకో రేపిస్ట్ ఎన్ని హత్యాచారాలు చేస్తేనేం… ఇంకా బతికే ఉన్నాడు…
  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!
  • అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
  • అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…
  • అత్యంత అసాధారణ కరెంటు బిల్లు… నమ్మడమే కష్టం సుమీ….
  • సొంత ‘బతుకమ్మ’ పేర్చుకుని… తన ఆట తాను ఆడుకోవడమేనా..?
  • ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!
  • ఆ సిరివెన్నెల పాటలు… రాసిన అర్థాలు వేరు- వాడుకున్న తీరు వేరు…
  • శరణార్థుల ఆశాసూచిక – భారత రాజ్యాంగంలోని కుబేరుని కళాచిత్రం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions