Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మోడీ బ్యాన్ చేయాల్సింది చైనా యాప్స్ మాత్రమే కాదు… ఇవిగో ఇవీ…

February 25, 2025 by M S R

.

Ashok Kumar Vemulapalli …….. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారనే కారణంతో వైజాగ్‌కు చెందిన యూట్యూబర్ లోకల్ బాయ్ నానీని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాగానే ఉంది.. మరి మిగిలిన ఇన్‌ఫ్లుయెన్సర్ల సంగతేంటి.. డబ్బులకు కక్కుర్తి పడి.. జనాల ప్రాణాలు తీస్తున్న ఈ బెట్టింగ్ యాప్‌లను విచ్చలవిడిగా ప్రమోట్ చేస్తున్నారు…

ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లు చెప్పిన మాటలు నిజమనుకుని నమ్మి.. అప్పులు చేసి మరీ బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు బెట్టింగ్ కాసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు… ఎందుకంటే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రభావం అంతలా ఉంటుంది…

Ads

ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్… ఇలా సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్‌పై అత్యధిక సబ్‌స్క్రయిబర్లు, ఫాలోవర్స్‌ని కలిగి ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్లను ఈ బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు సెలెక్ట్ చేసుకుని, వారికి అత్యధిక మొత్తంలో డబ్బులు చెల్లించి వారి చేత ఈ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు.

వారికి తెలుసు, ఎవరి ద్వారా ప్రమోట్ చేస్తే జనాలు నమ్ముతారో.. అందుకే రీసెంట్‌గా వైరల్ కంటెంట్ చేస్తున్న వారందరి చేతా ఈ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయిస్తున్నారు…

మొబైల్ ఓపెన్‌ చేస్తే చాలు… ‘వన్‌ ఎక్స్‌బెట్‌, మెగాపరి, మోస్ట్‌బెట్‌, పరిపేస, పరిమ్యాచ్‌, 10సీఆర్‌ఐసీ, మెల్‌బెట్‌, మేట్‌బెట్‌, 1ఎక్స్‌బెట్‌, బీసీ డాట్‌గేమ్‌, 22 బెట్స్‌, రాజా బెట్స్‌, స్టేక్‌ డాట్‌.కామ్‌, డఫ్ఫా బెట్‌’ వంటి ఎన్నో అఫిషియల్‌, అన్‌అఫీషియల్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. కనిపిస్తున్నాయి…

యూట్యూబ్‌, సోషల్‌ మీడియా, పలు వెబ్‌సైట్లలో రూ.100 పెడితే రూ.1000 ఇస్తామంటూ బెట్టింగ్‌ యాప్స్‌ యాడ్స్‌‌తో మోసం చేస్తున్నారు. చేపకు గాలం వేసినట్లు కొత్త కస్టమర్లకు మొదట్లో రూ.100 రూ.200, రూ.1000కు రూ.2000, రూ.3000 ఇస్తూ మెల్లగా యువతను ఊబిలోకి లాగుతున్నారు.మొదట చిన్న ఎమౌంటే కదా అని .. ఆ ఊబిలోకి దిగుతారు.

రీసెంట్‌గా ఖమ్మంకు చెందిన యువకుడు ఇలాగే బెట్టింగ్ యాప్‌లలో 25 లక్షలకు పైగా డబ్బులు పోగొట్టుకున్నాడు. అప్పటికీ తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి 25 లక్షల వరకూ అప్పులు తీర్చారు.. కానీ మళ్లీ బెట్టింగ్ ఆడి, మళ్లీ అప్పులు చేశాడు ఆ కుర్రాడు..

చివరికి అప్పుల వాళ్ల ఒత్తిడి పెరిగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు.. చనిపోయేముందు సెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేశాడు.. ఇలా ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్‌ల వల్ల ఆత్మహత్య చేసుకున్నవారు చాలామందే ఉన్నారు.. అందరూ మధ్యతరగతి కుటుంబాలకు చెందివారే…

మధ్యతరగతి వారే కాకుండా ఈ మధ్యకాలంలో ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, బ్యాంకర్లు.. ఇలా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బెట్టింగులు ఆడుతున్నారు. ఇలా బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పెట్టుబడి పెట్టిన వారిలో ఏ ఒక్కరూ కూడా నేను డబ్బులు గెల్చుకున్నాను అని చెప్పిన వాళ్లు లేనేలేరు.. వందకి వంద శాతం బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పోగొట్టుకున్నవారే..

కానీ ఇన్ని లక్షలు, కోట్లు ఈజీగా సంపాదించుకోవచ్చని ఇన్‌ఫ్లుయెన్సర్లు చెబుతుంటారు… ఎంతమంది ప్రాణాలు పోతున్నా సరే ఈ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లు మాత్రం ఆపడం లేదు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లు… డబ్బు కోసం యాడ్స్ చేస్తూనే ఉన్నారు…

ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే వారిని పట్టుకుని ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారు… సన్నీయాదవ్ అనే ఇన్‌ఫ్లుయెన్సర్ బెట్టింగ్ యాప్‌లని ప్రమోట్ చేస్తుంటే.. ఇదేంటని ప్రశ్నించిన వరల్డ్ ట్రావెలర్ నా అన్వేషణ అన్వేష్‌ని ఇష్టమొచ్చినట్టు తిట్టి పోశాడు సన్నీయాదవ్..

ఆఖరికి వీసీ సజ్జనార్ ఈ సన్నీయాదవ్ గురించి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు కూడా.. అతని మీద కేసు మాత్రం ఫైల్ కాలేదు.. కానీ వైజాగ్‌లో లోకల్ బాయ్ నానీని మాత్రం అరెస్ట్ చేశారు.. తాను చేసింది తప్పేనని.. ఇకపై బెట్టింగ్ యాప్‌లను ఏమా త్రం ప్రమోట్ చేయబోనంటూ లోకల్ బాయ్ నానీ వీడియో కూడా రిలీజ్ చేశాడు..

తాను పెద్దగా చదువుకోలేదని అందుకే ఈ తప్పు చేశానని ఒప్పుకున్నాడు కూడా.. కానీ ఈ బడా ఇన్‌ఫ్లుయెన్సర్లు మాత్రం ఎక్కడా ఇలా తప్పు ఒప్పుకోలేదు..పైగా చట్టాలను ధిక్కరిస్తూ ఇష్టారాజ్యంగా ప్రమోట్ చేస్తూ జనాల ప్రాణాలు తీస్తున్నారు

అసలు ఇలాంటి బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసేందుకు ఎందుకు అవకాశం ఇవ్వాలి.. అసలు ఈ బెట్టింగ్ యాప్‌లు ఏవైనా సరే.. ఆన్ లైన్ లోనే కదా.. ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంపై ఈ యాప్‌లను కచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి కదా.. అప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఈ యాప్‌లను నిషేధించవచ్చు కదా..

వీటిని ఎక్కడి నుంచి డౌన్ లోడ్ చేసుకుంటున్నారో ఆ ప్లాట్ ఫాంలకు ఆదేశాలు ఇస్తే సరిపోతుంది కదా.. ఇంకా ఎన్ని ప్రాణాలు పోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తాయి.. గతంలో టిక్ టాక్ సహా ఎన్నో చైనా యాప్‌లను కేంద్రం నిషేధించింది.. అలాగే ఈ బెట్టింగ్ యాప్‌లను పూర్తిగా నిషేధించాలి.. అప్పుడే జనాల ప్రాణాలు పోకుండా ఆపగలుగుతారు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions