Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

1 + 2 సినిమాలన్నీ హిట్ కాలేవు అక్కినేనీ… పదే పదే అవే ఏం చూస్తాం..?!

February 18, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……… 1967 లో తమిళంలో వచ్చిన ఇరు మళర్గల్ సూపర్ హిట్ సినిమాకు రీమేక్ 1982లో వచ్చిన మన బంగారు కానుక సినిమా . తమిళంలో శివాజీ గణేశన్ , పద్మిని , కె ఆర్ విజయ , బేబీ రోజారమణి నటించారు .

పాటలు , నృత్యాలు బాగున్నా మరెందుకనో మన తెలుగులో ఆడలేదు . అక్కినేని , శ్రీదేవి , సుజాత , గుమ్మడి ప్రధాన పాత్రల్లో నటించారు . వి మధుసూదనరావు అంతటి సీనియర్ డైరెక్టర్ దర్శకత్వం వహించారు .

Ads

1+2 సినిమా . కాలేజి పూర్వ విద్యార్ధుల సమావేశంలో అక్కినేని శ్రీదేవిల చాలెంజితో ప్రేమ ప్రారంభం అవుతుంది . పెళ్లి చేసుకుందామని అనుకుంటారు . ఇంటికి వెళ్లిన శ్రీదేవి అన్నావదినల అంగీకారాన్ని కూడా పొందుతుంది .

ఈలోపు కారు ప్రమాదంలో అన్నావదినలు చనిపోతారు . వాళ్ళ ముగ్గురు పిల్లలకు తనే తల్లిగా మారి, అబధ్ధం చెప్పి పెళ్ళిని ఆపుకుంటుంది .

హీరో గారు మరదలు సుజాతను పెళ్ళి చేసుకుని గొప్ప ధనవంతుడు అవుతాడు . వారి కూతురు చదువుకునే స్కూల్లోనే టీచరుగా చేరిన శ్రీదేవి మరలా హీరో జీవితంలోకి రావడం , వాళ్ళ కుటుంబం గొడవల్లో పడటం , శ్రీదేవి అక్కడ నుండి నిష్క్రమించడంతో సినిమా ముగుస్తుంది .

సినిమా మొత్తంలో చాలా చాలా బాగుండేది శ్రీదేవి- అక్కినేని పోటీ సంగీత నృత్య ప్రదర్శన . వేటూరి వ్రాసిన నడకా హంసధ్వని రాగమా పాటతో సాగే శ్రీదేవి శాస్త్రీయ నృత్యం హైలైట్ . నృత్య దర్శకులు హీరాలాల్ , సలీంలను అభినందించాలి . శ్రీదేవి చాలా బాగా నృత్యిస్తుంది .

ఏదోగా ఉంది ఏదో అడగాలని ఉంది , కసురుకున్న కళ్ళది , మందారాలే మురిపించే మధు మకరందాలే కురిపించే , ప్రేమ బృందావనం పలికేలే స్వాగతం డ్యూయెట్లు అక్కినేని- శ్రీదేవిల మధ్య , అక్కినేని-సుజాతల మధ్య ఉంటాయి . బాగుంటాయి .

ఇంకో పాట అక్కినేని , సుజాత వాళ్ళ కూతురు మధ్య ఉంటుంది . తామరపువ్వంటి తమ్ముడు కావాలా చేమంతి పువ్వంటి చెల్లెలు కావాలా అంటూ సాగే పాట కూడా శ్రావ్యంగా ఉంటుంది . ఆత్రేయ వ్రాసిన నోచిన నోముకు ఫలము చేసిన పూజకు వరము అనే 1+2 పాట మహిళా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది . బాగుంటుంది కూడా . డైలాగులను కూడా ఆత్రేయే వ్రాసారు . ప్రేమనగర్లో డైలాగుల్లాగా పెటపెటలాడుతూ లేవు .

శ్రీదేవి గ్లామర్ , సుజాత నటన , అక్కినేని స్టెప్పులు , హుషారయిన నటన బాగుంటాయి . ఇతర పాత్రల్లో గుమ్మడి , అల్లు రామలింగయ్య , కృష్ణవేణి , రంగనాధ్ , అన్నపూర్ణ , బేబీ వరలక్ష్మి ప్రభృతులు నటించారు . తమిళ సినిమాను మక్కీకి మక్కీగా తీసినట్లున్నారు . కొన్ని మసాలాలు కలిపి ఉంటే సినిమా జనానికి నచ్చి ఉండేదేమో ! కమర్షియల్ గా సక్సెస్ అయిఉండేదేమో !

రావుల అంకయ్య గౌడ్ నిర్మించిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూసి ఉండకపోతే ట్రై చేయవచ్చు . అక్కినేని , శ్రీదేవి , సుజాతల అభిమానులు తప్పక చూడవచ్చు . నచ్చుతుంది . నడకా హంసధ్వని రాగమా వీడియో మాత్రం మిస్ కాకండి . It’s a visual feast . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమా_కబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నేపాల్ జనాగ్రహం వెనుక ఇది మరో కోణం… మనకూ డేంజరే…
  • అమృతాంటీ… మరీ అనసూయాంటీ ఆవహించిందా ఏమిటి..?!
  • డాక్టర్ సాబ్… 20 ఏళ్ల క్రితం నా ప్రాణాలు కాపాడారు గుర్తుందా..?
  • నవలా రాక్షసుడు + సినిమా రాక్షసుడు + నట రాక్షసుడు…!!
  • ఐఫోన్-17 సీరీస్… ఈ కొత్త మోడళ్ల అదిరిపోయే కీలక ఫీచర్స్ ఇవే…
  • ‘‘నీ పేరే పెట్టుకున్నాం, మా డ్రగ్ రాకెట్‌ను ఆశీర్వదించు మాతా…’’
  • లిటిల్ హార్ట్స్ సక్సెస్ సినిమా ఇండస్ట్రీకి చెబుతున్న పాఠమేమిటంటే..!
  • ఏమో, రమ్యకృష్ణే కావాలని ఆ బాహుబలి నిర్మాతే కోరుకున్నాడేమో…!
  • కాదు… ఆమె మరో షర్మిల కాదు… రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం ఉంటుంది…
  • మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్… జనాగ్రహం బద్దలు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions