.
తెగేదాకా లాగుతున్నారు! మోడీ వదిలేస్తారా? గట్టిగా పట్టుకుంటారా? గట్టిగా పట్టుకుంటే తెగుతుంది! వదిలేస్తే తెగదు!
బాంగ్లాదేశ్ బెరాక్టర్ డ్రోన్ ని భారత్ లోకి పంపించింది! ఈశాన్య రాష్ట్రం అయిన మేఘాలయ మీద బెరాక్టర్ డ్రోన్ ఎగరడం గమనించిన స్థానికులు పోలీసులకి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తున్నది!
Ads
అఫ్కోర్స్! భారత సైన్యం ప్రజల కంటే ముందే గుర్తించింది బెరాక్టర్ ని.
బెరాక్టర్ TB2 ( Bayraktar TB2 ) టర్కీ తయారీ UAV. బెరాక్టర్ TB2 ని మొదటిసారిగా ఉక్రెయిన్ రష్యా నావీ మీద ప్రయోగించి సక్సెస్ అయ్యింది.
1.బెరాక్టర్ TB2 డ్రోన్ మేఘాలయలోని చిరపుంజి, షెల్లా (Cherrapunji, Shella ) ప్రాంతాల మీదుగా ఎగిరినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రాడార్ గుర్తించింది.
2.బెరాక్టర్ TB2 ట్రాన్సపాండర్ కోడ్ TB2R1071 గా IAF రాడార్ గుర్తించింది!
3.వారం క్రితం వెస్ట్ బెంగాల్, దక్షిణ త్రిపుర, పశ్చిమ మీజోరంలలో కూడా ఇదే రకం డ్రోన్ కనపడినట్లు ఐఏఎఫ్ రాడార్ గుర్తించింది!
4.బాంగ్లాదేశ్ లోని తేజ్ గావ్ ఎయిర్ బేస్ నుండి వీటిని ఆపరేట్ చేస్తున్నట్లు ఐఏఎఫ్ గుర్తించింది!
5.బెరాక్టర్ TB2 UAV మరీ ఎత్తులో కాకుండా మధ్యస్థంగా ఉండే ఎత్తులో 18 గంటల పాటు ఏకధాటిగా ఎగురుతూ హై డెఫినిషన్ వీడియో తీయగలదు. అలాగే రాత్రిపూట థెర్మల్ ఇమేజింగ్ కెమెరాని ఉపయోగించి వీడియో, ఫోటోలు తీయగలదు. అవసరం అయితే టార్గెట్ మీదకి PGM (Precision Guided Munition ) బాంబులని ప్రయోగించగలదు!
6.భారత్ బాంగ్లాదేశ్ సరిహద్దు 4,096 km పొడవునా బేరాక్టర్ UAV లని ఆపరేట్ చేస్తున్నట్లుగా IAF గుర్తించింది!
******
గత నెలలో భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ బాంగ్లాదేశ్ పర్యటన ముగించుకొని భారత్ రాగానే బాంగ్లాదేశ్ బెరాక్టర్ TB2 లని సరిహద్దుల దగ్గర మొహరించినట్లుగా తెలుస్తున్నది.
అప్పటి భారత ప్రధాని అటల్ బీహారి వాజాపేయి లాహోర్ బస్సు యాత్ర చేసి రాగానే కార్గిల్ యుద్ధం మొదలయ్యింది. ఇప్పుడు మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు బాంగ్లాదేశ్ వెళ్లి రాగానే UAV లతో రెచ్చగొడుతున్నది ISI.
ఇది బోనస్!
నేపాల్ లో ఉన్నది 4% ముస్లిం జనాభా!
బ్రహ్మస్థాన్ అనే పేరుని తీసివేసి మదరాసానగర్ అనే పేరుపెట్టారు దౌర్జన్యంగా!
2020 లో నేపాల్ లోని గోపాల్ గంజ్ ప్రాంతంలో అనూహ్యంగా ముస్లిం జనాభా పెరుగుతున్న విషయం మీద నేను పోస్ట్ పెట్టాను.
అందుకే ఏ దేశంలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలి అనేది! స్థానిక వార్తలు ఎటూ మన మీడియా పక్షపాతం లేకుండా చూపించదు! కానీ మన దృష్టి ఎప్పుడూ పనికిరాని వాటి మీదనే ఉంటుంది!
******
బాంగ్లాదేశ్ మీద సర్జికల్ స్ట్రైక్ తప్పేట్లుగా లేదు!
కానీ ఏ విషయం బయటికి చెప్పరు! నిశ్శబ్దంగా చేస్తారు, తరువాత తెలుస్తుంది.
అయితే ముందు బెరాక్టర్ తో బాంగ్లాదేశ్ దాడి చేయాల్సి ఉంటుంది!
అలా చేయడమే మంచిది!
ఎందుకంటే ఒకసారి దెబ్బ తింటేనే కదా నొప్పి తెలిసేది?……. ( పార్థసారథి పొట్లూరి )
Share this Article