.
1. సీరియస్, సెన్సిటివ్ విషయాలను కామెడీగా చెప్పాలనుకోవడమే తప్పు… తప్పున్నర… ఇన్‌సెన్సిటివ్, ఇన్‌సెన్సిబుల్…
2. ఒకవేళ అది సరిగ్గా చెప్పగలిగితే జనంలోకి బలంగా వెళ్లగలదు అనుకుంటే… దానికి సరైన, పద్దతైన స్క్రీన్ ప్లే, ప్రజెంటేషన్ అవసరం… తెలుగు సినిమాజనానికి అది ఎప్పుడూ చేతకాలేదు, కాదు కూడా…
Ads
3. బలగం సినిమా వేరు… అది బంధాలకు సంబంధించిన సినిమా… పైగా దాని ప్రజెంటేషన్ జనానికి వెంటనే ఎక్కేలా ఉంటుంది… దాంతో బాపు అనే తాజా సినిమాను పోల్చడం మరో తప్పు…
4. నిజానికి ఇండస్ట్రీలో బ్రహ్మాజీ కాస్త బెటర్ అనిపిస్తాడు… అలాంటి నటుడు కూడా ఇలాంటి బేకార్ కథకు తలూపి నటించడం ఓ విషాదం… అన్నింటికీ మించి ఒరేయ్, కాస్త చేతకాకపోెయినా ఈ తెలంగాణ డిక్షన్ ఆపేయండర్రా బాబూ… కఠోరంగా వినిపిస్తున్నాయి డైలాగ్స్…
5. బలగంతో పోలిస్తే కన్నీళ్లు పెట్టించే, కదిలించే ఒక్క సీన్ కూడా లేదు, సరికదా సంగీతం గట్రా వెరీ పూర్… వెరసి..?
అవును, బాపు అనే సినిమా గురించే… రైతులే కాదు, ఏ ఆత్మహత్యలనైనా సరే గ్లోరిఫై చేయడం ఎంత దారుణమో, పిచ్చి కామెడీని పండించాలని, పిండాలని భావించడమూ అంతే దుర్మార్గం… రైతులు ప్రస్తుతం దేశంలో అత్యంత బలహీనమైన జాతి… ప్రాణాలకు పణంగా పెట్టి సాగు చేస్తున్నారు… ఆత్మహత్యలు తెలంగాణలోనే కాదు, అన్నిచోట్లా ఉన్నాయి… అదొక ఎడతెగని విషాదం, మన ప్రభుత్వాల దిక్కుమాలిన పథకాల దుష్ఫలితం…
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కొద్దోగొప్పో ఆసరా అయ్యేందుకు ప్రభుత్వాలు ఏదో ముష్టి వేసినట్టు పరిహారాలు కూడా ఇస్తాయి… అయితే ఆ పరిహారం కోసం పేద రైతు కుటుంబాలు ఫేక్ ఆత్మహత్యలకు దిగుతాయి లేదా హత్యలకూ వెెనుకాడవు అనే అర్థమొచ్చే ఈ బాపు అనే సినిమా టోటల్లీ రాంగ్ స్టోరీ… సొసైటీ ఏమాత్రం ఆమోదించకూడని స్టోరీ లైన్… ఈ సినిమాను తిరస్కరించడం సొసైటీ బాధ్యతే…
బ్రహ్మాజీ, బలగం సుధాకర్‌రెడ్డి, ఆమని, అవసరాల శ్రీనివాస్ వంటి నటులున్నప్పుడు… ఎంత జాగ్రత్తగా కథ ఉండాలి..? ప్చ్, అదేమీ కనిపించదు… ఈ దిక్కుమాలిన ఇన్‌సెన్సిటివ్ ధోరణికి తోెడు రక్తికట్టని ప్రేమకథలు కూడా సినిమాలో… ఒకవేళ ఇదే కామెడీ అని దర్శకనిర్మాతలు నమ్మితే వాళ్లకు సానుభూతి… బ్రహ్మాజీ, సారీ బ్రదర్… యువర్ ఛాయిస్ ఈజ్ నాట్ కరెక్ట్, ఏ బ్లండర్…!! ఇంతకుమించిన రివ్యూ కూడా ఈ సినిమాకు అక్కర్లేదు… సరికాదు కూడా…
Share this Article