Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టీవీ రేటింగ్స్ ఓ దందా..! 100 కోట్ల కుంభకోణాన్ని పట్టేసిన తెలుగు డీజీపీ..!!

November 30, 2025 by M S R

.

Bhavanarayana Thota ….. రూ.100 కోట్ల టీవీ రేటింగ్స్ కుంభకోణం: నిగ్గు తేల్చిన తెలుగు డీజీపీ

.

Ads

టీవీ చానల్స్ రేటింగ్స్ కోసం దిగజారతాయని, అడ్డమైన కంటెంట్ ప్రసారం చేస్తాయని చెప్పుకుంటూ ఉంటారు. ఇవి విమర్శలా, ఆరోపణలు మాత్రమేనా? ఇలాంటి ఛీత్కారాలు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కి మాత్రమే కాదు, న్యూస్ చానల్స్ కీ తప్పటం లేదు.

అశ్లీలత ఎక్కువైందని ఎంటర్టైన్మెంట్ చానల్స్ మీద, పర్సనల్ లైఫ్ లోకి తొంగిచూస్తున్నాయని న్యూస్ చానల్స్ మీద విమర్శలు కొత్త కాదు. ఇదంతా రేటింగ్స్ కోసమేనని ఎప్పటికప్పుడు జనం తిట్టి పోస్తూనే ఉన్నారు.

కానీ ఇంకో రకమైన కుంభకోణం గురించి చాలామందికి తెలియదు. అదేంటంటే రేటింగ్స్ కొనుక్కోవటం. సవాలక్ష దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు .. ఇది చాలా కాలంగా .. చాలా రూపాలలో జరుగుతున్న మోసమే.

రేటింగ్స్ కోసం ఎంపిక చేసిన ఇళ్ళను గుర్తించి ఆ ఇళ్ళ యాజమానులను ఒప్పించి, ఆశ చూపించి వాళ్ళ చానల్ చూసేట్టు చేసుకోవటం ఒక పద్ధతి. కొంతకాలానికి అలాంటి గుట్టు రట్టయింది. అయినా, మరిన్ని అడ్డ దారులు వెతుక్కున్న చానల్స్ ఉన్నాయి.

ఇలా ఇళ్ళ చుట్టూ తిరగటం ఎందుకని నేరుగా ఆ రేటింగ్ ఏజెన్సీ పెద్ద తలకాయనే పట్టుకోవాలనే ప్రయత్నం జరిగింది. ఒక పేరు మోసిన జాతీయ చానల్ దాదాపు నాలుగేళ్ళ కిందట అందులో విజయం సాధించింది. బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ –బార్క్ సీఈవోను పట్టుకుంది. ఆయనకు యాభై లక్షల లంచమిచ్చింది.

ఆయన ఆ యాభై లక్షలతో భార్యకు నగలు కొన్నట్టు మహారాష్ట్ర పోలీసుల దర్యాప్తులో తేలింది. అలా దొరికిపోయి ఆయన జైలుకెళ్లాల్సి వచ్చింది. అయితే, ఆ చానల్ కేంద్రంలో అధికార పార్టీకి అనుకూలమని, అప్పట్లో మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వ్యతిరేకమని, అందుకే పట్టుకున్నారని రకరకాల విశ్లేషణలు వచ్చాయి. ఏమైనా స్కామ్ నిజం.

  • ఇప్పుడు తాజాగా కేరళలో బైటపడ్డ మరో స్కామ్ టీవీ పరిశ్రమను ఉలిక్కి పడేట్టు చేసింది. బార్క్ లో పనిచేసే ప్రేమ్ నాథ్ అనే సీనియర్ ఉద్యోగి ఖాతాలోకి ఒక చానల్ నుంచి 100 కోట్లు బదలీ అయ్యాయని తేలింది. కేరళ టెలివిజన్ ఫెడరేషన్ స్వయంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ఫిర్యాదు చేయటంతో ఆయన స్వయంగా డీజీపీకి అప్పగించారు.

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రావాడ చంద్రశేఖర్ ఇప్పుడు కేరళ డీజీపీ. స్ట్రిక్ట్ ఆఫీసర్ గా పేరున్న డీజీపీ ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. మొత్తానికి రేటింగ్స్ చోరీకి పాల్పడిన చానల్ లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించిన దర్యాప్తు అధికారులు విస్తుపోయే విషయాలు బైటపెట్టారు.

  • చానల్ యాజమాన్యం నుంచి 100 కోట్లు ఆ బార్క్ ఉద్యోగి ఖాతాలోకి క్రిప్టో కరెన్సీ రూపంలో వెళ్ళినట్టు తేలింది. అతని నుంచి మరికొందరు ఉద్యోగుల ఖాతాల్లోకి వెళ్ళినట్టు కూడా తేల్చారు. ప్రతివారం ముందుగానే రేటింగ్స్ వివరాలు పంపిన వాట్సాప్ చాట్ సమాచారం, దాంతోబాటే అదనపు వివరాల మెసేజ్ లు కూడా దర్యాప్తు అధికారులు గుర్తించారు.

అలా పంపిన సమాచారం, ఆ తరువాత వాస్తవంగా విడుదలైన రేటింగ్స్ తో సరిపోలటంతో ఈ స్కామ్ నిర్థారణ జరిగింది. 85 లక్షల కేబుల్ కనెక్షన్లు ఉన్న కేరళలో 20 వేల చందాదారులు 24 గంటలూ ఆ చానల్ చూసినట్టు లెక్కల్లో చూపటం ద్వారా కృత్రిమంగా రేటింగ్స్ పెంచినట్టు తేల్చారు.

ఆ చానల్ యజమాని మలేసియా, థాయ్ లాండ్ దేశాల్లో కృత్రిమంగా యూట్యూబ్ వ్యూయర్ షిప్ పెంచటానికి కూడా కోట్లు వెచ్చించినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పూర్తి స్థాయి సమాచారం అందిన తరువాత చర్యలుంటాయని డీజీపీ రావాడ చంద్రశేఖర్ చెబుతున్నారు.

50 వేల కోట్ల అడ్వర్టైజ్మెంట్ మార్కెట్ ను కుదిపేసిన ఈ కుంభకోణం మొత్తం రేటింగ్స్ వ్యవస్థ మీద నమ్మకాన్ని షేక్ చేసినట్టయింది. రేటింగ్స్ ను నమ్మి యాడ్స్ ఇచ్చే సంస్థలు ఇంతగా మోసపోయామా అని అవాక్కయ్యే పరిస్థితి ఏర్పడింది.

ఎంతోకాలంగా రేటింగ్స్ లెక్కింపు మీద అనుమానాలూ, ఆరోపణలూ ఉన్నా బార్క్ తప్ప వేరే మార్గం లేకపోవటంతో చానల్ యాజమాన్యాలు తమకు తాము సర్దిచెప్పుకుంటూ వచ్చాయి. చానల్ యాజమాన్యాల చందాలతో నడిచే బార్క్ లోనే ఇలాంటి మోసాలు జరగటం చానల్స్ ను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

  • నిజానికి రేటింగ్స్ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని భావిస్తున్న సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఇప్పుడు ఆ పనిని మరింత వేగవంతం చేయాల్సి ఉంది. ఇప్పటికే పరిశ్రమలోని వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించిన మంత్రిత్వ శాఖ త్వరలోనే సరికొత్త విధానం ప్రకటిస్తుందని టీవీ పరిశ్రమ ఎదురు చూస్తోంది…
  • —————–

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Delhi pollution triggered allergies… Here is an Innovative Treatment
  • కేసీయార్‌పైకే ‘ఉల్టా వాటర్ వార్’… నిజాలన్నీ బయటపడుతున్నయ్….
  • నైనర్ నాగేంద్రన్… సైలెంటుగా తమిళ బీజేపీకి జవజీవాలు…
  • శ్రీరాముడు ముస్లిం అట… ఈ తృణమూల్ నేతలందరూ అదో టైపు…
  • సామాన్ల మగ శివాజీ డర్టీ భాషపై ఓ సైకాలజిస్టు విశ్లేషణ…!
  • శివాజీ గాడు కొత్తేమీ కాదు… ఇదేమీ ఆగదు… శెభాష్ అనసూయ…
  • ఏ కుంపటి రాజేసినా మెచ్చరు… మారిన ఇండియన్ వోటర్ ఆలోచన సరళి…
  • ఒక ఛావా… ఒక ధురంధర్… హిందీ సినిమాకు మళ్లీ పూర్వ వైభవం…
  • తదుపరి ప్రధాని రేసులో లోకేష్..!! చివరకు ఇది ‘యెల్లో రాయిటర్స్‌’..!!
  • సత్వర న్యాయం Vs చట్టప్రకారం విచారణ… జనానికి ఏది నచ్చుతుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions