వాడు… పేరు నాగమణికంఠ… గత సీజన్‌లో పల్లవి ప్రశాంత్ అనే పిచ్చోడిలాగే ఇతనూ… మెంటల్ కేసే… డౌట్ లేదు… బిగ్‌బాస్ గెలిస్తే వదిలేసి పోయిన పెళ్లాంబిడ్డ తిరిగి తన దగ్గరకు వస్తారనే ఓ పిచ్చి భ్రమ… హౌజులో కనిపించే ఆడవాళ్లందరినీ వెనుక నుంచి, ముందు నుంచీ హగ్ చేసుకుని శాటిస్‌ఫై అయిపోయే ఓ తిక్క కేరక్టర్…
బిగ్‌బాస్ టీం కూడా అలాంటిదే కదా… వాళ్లకు ఇలాంటి ఎర్రగడ్డ కేరక్టర్లంటే మహామోజు… వాడికి ఇప్పుడు (వాడు అనడగానికి ఏమాత్రం సందేహించడం లేదు ఇక్కడ,.. ఇంకా ఎక్కువే అనొచ్చు… కోట్లాది మంది ప్రేక్షకుల టైమ్, డబ్బు, మనశ్శాంతిని పొల్యూట్ చేస్తున్నాడు కాబట్టి…) సరే, వాడు ఎలాగోలా దారికి వస్తున్నాడు… మరీ రోహిణిని కూడా వెనుక నుంచి వాటేసుకున్నా సరే, నాగార్జున అనే మరో మెంటల్ కేసు మందలించకపోయినా సరే… పర్లేదు అనుకుంటున్న దశలో… నీ తాతను ఒరేయ్ అని గౌతమ్ కృష్ణ అనే మరో మెంటల్ కేరక్టర్ వచ్చింది…
అసలు గత సీజన్లలోనే అట్టర్ ఫ్లాప్… ఐనా సరే, తనేదో తోపు, తురుమ్ అనుకుని లేదా ఇంకేమైనా ప్రలోభ ప్రభావమో… మళ్లీ ఈ సీజన్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నాడు బిగ్‌బాస్… వాడూ ఎర్రగడ్డ కేసే కదా… అశ్వత్థామ 2.0 అనేసరికి అవినాష్ మీదకు కస్సుమన్నాడు మొన్న… మైక్ విసిరిపారేశాడు… బిగ్‌బాస్ మొహం మీదకు అన్నట్టుగా… వాడికి సిగ్గూశరం ఉండదు కదా… నాగార్జునతో కూడా గట్టి మందలింపు కూడా లేదు… అక్కడ అవినాష్ చేసిన తప్పేమీ లేదు… గౌతమ్ అనబడే కేరక్టర్ తిక్కతనం తప్ప…
Ads
ఇప్పుడేమో ఆదే కారణంతో వాడిని నామినేట్ చేశారు… నో, నో, మీరు దీన్ని కామెడీ షో అనుకుంటున్నారా, నాన్సెన్స్… అది బుల్లీయింగ్… అన్నాడు… అందరూ అపోజ్ చేశారు, కనీసం తన మాటను డిఫెండ్ చేసుకున్నాడా, లేదు… ఏదో గట్టిగా అరుస్తూ, వాగుతూ సమర్థనకు తిప్పలు… ఒరేయ్, నాన్నా… ఏ టీవీ రియాలిటీ షో అయినా సరే, ఫన్ కోసమే, రేటింగ్స్ కోసమే, రెవిన్యూ కోసమే… అదేమీ దేశోద్ధారక ఛారిటీ కాదురా తండ్రీ… చిరాకెత్తిస్తున్నాడు గౌతమ్… ఒకరకంగా మణికంఠ నయం అనిపిస్తున్నాడు… వాడిలాగే నీ ఏడుపు కూడా…
ఇది కామెడీ షో కాదు, ఇది బిగ్‌బాస్ అంటున్నాడు గౌతమ్… ఎడ్డోడు… బిగ్‌బాస్ అంటేనే ఓ పెద్ద కామెడీ అని మరిచిపోయాడు ఫాఫం… కామెడీ చేసేవాళ్లేమైనా పిచ్చోళ్లా అని రోహిణి, వీడిని మళ్లీ అశ్వత్థామ 2.0 అనకండ్రా అని ఫ్యాన్స్‌ను ఉద్దేశించి అవినాష్ భలే కౌంటర్లు ఇచ్చారు… ఎస్, రియల్లీ గౌతమ్ అనేవాడు ఖచ్చితంగా ఈ షోకు అనర్హుడు… అచ్చంగా మణికంఠలాగే… ఐతే ఇలాంటోళ్లే బిగ్‌బాస్‌కు కావాలనేది మరో ట్రాజెడీ..!!
Share this Article