.
Alamuru Sowmya …… హెచ్చరిక: ఇవాళ ఫేస్బుక్ ఓపెన్ చెయ్యగానే… “You can’t open this page…your mobile is hacked” అని వచ్చింది. చూడగానే కంగారు పడిపోయాను. ఫేస్బుక్ యాప్ ఓపెన్ అవ్వలేదు.
కేవలం ఒక తెల్ల పేజీ, మధ్యలో ఈ మాటలు. ఒక్క క్షణం అలా చూస్తు ఉండిపోయా. వెంటనే పేజ్ మారి, ఫోన్ నుంచి ఒక వింత శబ్దం రావడం మొదలైంది. మళ్లీ వైట్ పేజ్… పైన ఎర్ర అక్షరాలతో “alert…” అని రాసి ఉంది.
Ads
మధ్యలో.. “at this moment, somebody is trying to hack your bank account. If you hear a strange sound, click on the below link…” అని అక్కడేదో లింక్ వచ్చింది. చాలా భయపడిపోయాను.
బుర్ర పనిచేయలేదు. ఆ లింక్ చూస్తూ ఉన్నా. ఫోన్ లోంచి శబ్దం పెరిగిపోతోంది. వెంటనే మొత్తం పేజ్ క్లోజ్ చేసేశా. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి, ఆన్ చేసా. తిరిగి ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అంతా మామూలుగానే ఉంది. గూగుల్ని అడిగా ఏమిటి సంగతని?
“అది కచ్చితంగా scam. ఫేస్బుక్ ఇలాంటి అలర్ట్ ఇవ్వదు. లింక్ నొక్కావో చచ్చావే” అంది. హమ్మయ్య, బతికానురా బాబూ అనుకున్నా… నేను లింక్ నొక్కలేదుగా!
నేను చాలా గట్టి పిండాన్ననీ, ఇప్పటివరకూ స్కామర్ల బారిన పడలేదనీ నాకో గర్వం. అలాంటి నాకే ఒక్క క్షణం ఊపిరి సలపలేదు. ఆ శబ్దం బాగా భయపెట్టింది.
పారాహుషార్....ఇలాంటిది మీకూ జరిగితే ఏ లింకూ నొక్కకండి. వెంటనే ఆ app లేదా ఆ పేజ్ పీక నొక్కండి. శబ్దాలకు భయపడకండి.
ఈ స్కాం screenshot తీసే టైం దొరకలేదు. అంతా క్షణాల్లో జరిగిపోయింది…
(స్మార్ట్ ఫోన్, రోజూవాడే రకరకాల యాప్స్ ఇప్పుడు సైబర్ నేరగాళ్ల మోసాలకు వేదికలు… ఇలాంటి ఉదాహరణలు షేర్ చేస్తే మరో పది మంది రక్షింపబడతారని ఈ పోస్టు షేర్ చేస్తున్నా…)
Share this Article