Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇప్పుడు ఈ సినిమా తీస్తే… ఫోఫోవోయ్ అంటారేమో జనం…

May 23, 2024 by Rishi

(Dogiparthi Subramanyam)… 1950 లో హిట్టయిన సినిమా 1972 లో ఫ్లాప్ అయింది . కాల మాన పరిస్థితులను బట్టి కూడా జనం కధలను , కధాంశాలను ఆదరిస్తుంటారేమో ! కాలేజీ రోజుల్లో చూసిన నేను కూడా ఈ కధకు కన్విన్స్ కాలేదు . అక్క పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే కధానాయకుడు రొట్టెను దొంగలించి జైలుకు వెళతాడు . జైల్లో నుంచి పారిపోయి , దొరికి పదేళ్ళ జైలు శిక్ష అనుభవిస్తాడు .

జైలు నుంచి విడుదల అయ్యాక సంవత్సరానికి ఒకసారి పోలీసు స్టేషన్లో సంతకం చేయాలి . కధానాయకుడు అలా సంతకం చేయకుండా ఠలాయిస్తాడు . ఒక క్రిస్టియన్ ఫాదర్ బోధనలతో సన్మార్గంలో పయనించి , కోటీశ్వరుడయి , నగర మేయర్ అయి , ప్రజల మన్ననలను పొందుతాడు . అతని గతాన్ని గుర్తు పట్టిన పోలీసు ఆఫీసర్ కధానాయకుడిని అరెస్ట్ చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు .

ఒక ఆపత్తులో పోలీసు ఆఫీసర్ని కధానాయకుడు కాపాడతాడు . చివర్లో కధానాయకుడిని మానవత్వంతో అరెస్ట్ చేయలేక , విధి నిర్వహణ చేయలేక , ఆ పోలీసు ఆఫీసర్ ఆత్మహత్య చేసుకుంటాడు . 1972 కే గుడినీ , గుడిలో లింగాన్నీ అమ్మే సత్పురుషులు పుష్కలంగా ఉన్నారు . రొట్టె కోసం దొంగతనం , సంతకం చేయకపోవటం నేరం , విధి నిర్వహణ చేయలేకపోయినందుకు ఆత్మహత్య చేసుకోవటం !!! హరి హరీ !!!! ఇప్పుడయితే జనం సినిమాను సామాజిక బహిష్కరణ కూడా చేసేవారు .

Ads

అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాకు ఆధారం 1862 లో విక్టర్ హ్యూగో చేత వ్రాయబడిన ప్రపంచంలోనే గొప్ప పాపులర్ ఫ్రెంచ్ నవల Les Miserables . ఎక్కడ 1862 !? ఎక్కడ 1972 ?! సినిమా చూడమంటే జనం ఎక్కడ చూస్తారు ? 1950 సినిమాలో కధానాయకుడిగా నటించిన చిత్తూరు నాగయ్య 1972 సినిమాలో క్రిస్టియన్ ఫాదర్ గా నటించటం విశేషం . 1950 సినిమాలో పద్మిని , లలితలు నటించారు . తెలుగు తమిళ భాషల్లో విడుదల చేయబడిన ఈ 1950 సినిమా రెండు భాషల్లోనూ ఘన విజయం సాధించింది .

1972 సినిమాలో ANR , గుమ్మడి , కృష్ణకుమారి , చంద్రకళ , చంద్రమోహన్ , సత్యనారాయణ , రావు గోపాలరావు , సూరేకాంతం , అల్లు రామలింగయ్య ప్రభృతులు నటించారు . ఈ సినిమాలో విశేషాలు ఏమిటంటే నాగేశ్వరరావుకు హీరోయిన్ ఉండదు , డ్యూయెట్లు ఉండవు . బాగా నటించారు .

జానపద బ్రహ్మ బి విఠలాచార్య దర్శకత్వం వహించిన స్వంత సినిమా . కె వి మహదేవన్ అంతటి వాడు సంగీత దర్శకత్వ వహించినా పాటలు హిట్ కాకపోవటం ఆశ్చర్యమే . అప్పుడప్పుడు టి వి చానళ్ళలో వస్తుంటుంది . సినిమాను ఆకళింపు చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటా . సినిమా యూట్యూబులో ఉంది . కాసేపు ట్రై చేయండి . నచ్చితే పూర్తి చేయండి . ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని భాషల్లోకి అనువదించబడిన నవల Les Miserables ఆధారంగా తీయబడిన సినిమా కదా !!  #తెలుగుసినిమాల సింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్చ్, సుమంత్‌కు మళ్లీ భంగపాటే – బహుశా అమ్మవారి శాపమేమో…
  • ఫాఫం కేసీయార్ ! ప్లాన్ ఎదురుతన్ని తెలంగాణ సమాజంలో అభాసుపాలు !!
  • సో, పిక్చర్ వెరీ క్లియర్… కన్నవాళ్లూ కసాయిలే ! 
  • నాయకులే కాదు – మీడియా కంపెనీలూ కండువాలు మార్చుకుంటయ్ !!
  • EPIC – బోల్డ్‌గా ఏదో చెప్పాలనుకుని- బోల్తాకొట్టిన కథాకథనాలు !!
  • వారమైనా కాలేదు – బిగ్‌బాస్ తిక్క ప్లానింగు – ఓ గట్టి కంటెస్టెంట్ ఔట్ !!
  • సినిమా బ్లాక్‌బస్టర్ ! హఠాత్తుగా కరోలీ బాబా ఇంటిపై పంచాయితీ !!
  • సర్దార్-2 … మిషన్ పెద్దదే… కానీ ఇంజన్‌లో దమ్ములేదు – ఇది కార్తి టాక్సిక్ !!
  • ‘‘పిరికి న్యాయమూర్తి అనిపించుకోవడంకంటే చావడానికే ఇష్టపడతాను’’
  • ప్రతి కథా ఇరుముడి కాలేదు – మారెమ్మలా తుస్సుమనొచ్చు కూడా!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions