Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వెస్టరన్ మీడియాకు అస్సలు కొరుకుడుపడని జైశంకర్ ఎదురుదాడి…

March 6, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి …….  దేశ చరిత్రలో ఇంతవరకు ఏ విదేశాంగ మంత్రి ఇవ్వని జవాబు EAM జై శంకర్ ఇస్తున్నారు వెస్ట్రన్ మీడియాకి ! వెస్ట్రన్ మీడియా హిపోక్రసీని ఎండగట్టిన EAM జై శంకర్ గారు !

విలేఖరి : భారత్ లో హిందూ నేషలిస్ట్ ప్రభుత్వం లక్ష్యం ఏమిటి ?

జై శంకర్ : మీరు [వెస్ట్రన్ మీడియా ] ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి హిందూ అనే టాగ్ లైన్ తగిలించి మాట్లాడుతున్నారు ! కానీ బ్రిటన్, అమెరికా, ఇతర యూరోపు దేశాలని క్రిస్టియన్ ప్రభుత్వాలు అని ఎందుకు సంబోధించరు?

సమాధానం లేదు అవతలివైపు నుండి !

******************

విలేఖరి : 130 కోట్ల భారత ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్న మీ ప్రభుత్వం రష్యా నుండి ఆయిల్ కొంటూ పరోక్షంగా రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడానికి ప్రోత్సహిస్తున్నారు ఫెన్సింగ్ [ముళ్ల కంచె ] మీద కూర్చొని !

జై శంకర్ : మేము మా భూభాగం నుండే పాలన చేస్తున్నాము. 130 కోట్ల ప్రజల అవసరాలని దృష్టిలో పెట్టుకొనే రష్యా నుండి చవకగా ఆయిల్ కొంటున్నాము. మీరు కొనడం మానేశారని మమ్మల్ని ఎందుకు మానేయమంటున్నారు ? ఇప్పటికీ మా పొరుగు దేశం [పాకిస్థాన్ ] కి సహాయం చేస్తూనే ఉన్నారు. గతంలో కూడా అక్కడ సైనిక నియంతలు ఉన్నప్పుడూ డబ్బు, ఆయుధాలు సప్లై చేశారు ! ఇన్నాళ్ళూ మా భూభాగం మీదకి టెర్రరిజం ఎగుమతి చేసిన దేశానికి మీరు సహాయం చేసినప్పుడు మీరు ముళ్ళ కంచె మీద ఉండే సహాయం చేశారా ?

విలేఖరికి సమాధానం చెప్పడానికి ఏమీ లేకుండా పోయింది !

**********

ఒక రాజకీయ నాయకుడిని విదేశాంగ శాఖ మంత్రిగా నియమిస్తూ వచ్చాయి అన్ని ప్రభుత్వాలు కానీ ఒక ఇండియన్ ఫారిన్ సర్వీస్ [IFS] అధికారిని నేరుగా విదేశాంగ మంత్రిగా నియమిస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో జై శంకర్ బీఫిట్టింగ్ సమాధానాలని చూస్తే అర్ధం అయిపోతుంది !

అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా ఇలా అన్ని దేశాల విలేఖరులు జై శంకర్‌ను తప్పుడు ప్రశ్నలతో ఇంటర్వ్యూలు చేసి భంగ పడ్డారు ఇప్పటివరకు ! విదేశీ విలేఖరులకి సమాధానం ఇవ్వాలంటే గత చరిత్ర తెలిసి ఉండాలి, లేకపోతే వాళ్ళు డామినేట్ చేస్తారు కానీ జై శంకర్ సుదీర్గ అనుభవం వలన ఇప్పటి వరకు ఏ విలేఖరి కూడా ఆయనని ఇబ్బంది పెట్టి, ఇరుకున పెట్టలేక పోయారు !

****************

ఎంత అనుభవం మరియు నాలెడ్జ్ ఉన్న విలేఖరి అయినా సరే జై శంకర్ తో ముఖాముఖి తలపడి ప్రశ్నలు వేసి, భంగ పడ్డారు తప్పితే ఆయనని ఇబ్బంది పెట్టలేకపోయారు ! సాధారణంగా విలేఖరులు అడిగిన ప్రశ్నలకి ఇబ్బంది పడి సమాధానం ఇవ్వకుండా టాపిక్ ని డైవర్ట్ చేసే రాజకీయ నాయకులని మన చూశాం కానీ విలేఖరులే తమ టాపిక్ ని డైవర్ట్ చేసుకొని వేరే విషయంలోకి వెళ్ళిపోయి ప్రశ్నలు వేయడం కేవల జై శంకర్ ఇంటర్వ్యూ లోలనే జరుగుతున్నది !

ఏ దేశ విలేఖరికి అయినా తమ దేశం మీద తాము ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి నిజాలతో ఎదురుదాడి చేస్తే తట్టుకోలేరు ! జై శంకర్ విషయంలో ప్రస్తుతం విదేశీ విలేఖరులకి ఎదురవుతున్న దృశ్యం ఇదే !

************************

చాలా కాలంగా జై శంకర్ ను ఇబ్బంది పెట్టి సమాధానం ఇవ్వలేని ప్రశ్న ఏ దేశ విలేఖరి అన్నా వేస్తాడేమో ఎదురు చూస్తున్నాను నేను!  యూరోపియన్ యూనియన్ ఎప్పటికీ జీర్ణించుకోలేని, మరిచిపోలేని ఒక వాక్యం జై శంకర్ నుండి వచ్చింది ! ”యూరోపు సమస్య ప్రపంచానిది-  ప్రపంచ సమస్య యూరోపుది కాదు ! ఈ మైండ్ సెట్ నుండి యూరోపు బయటపడాలని ఆశిస్తున్నాను’’ అంటూ జై శంకర్ చేసిన వ్యాఖ్య తరువాత యూరోపు విలేఖరులు జై శంకర్ ని ఇబ్బంది ప్రశ్నలు వేయాలనే ఆశని అణిచివేసుకున్నారు!

************************

ఏదో ఒక రోజున జర్మనీ విలేఖరులని జై శంకర్ కొన్ని ఎదురు ప్రశ్నలు వేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నాను నేను…. అవి..

1. కాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన గురించి తెగ ఆందోళన పడే జర్మనీ దేశం హిట్లర్ చేసిన అకృత్యాల గురించి ప్రశ్నలు వేయాలి !

2. హిట్లర్ పెట్టే హింస నుండి తప్పించుకోవడానికి పోలాండ్ ప్రజలు భారత దేశానికి వచ్చి ఆశ్రయం తీసుకున్నారు. హిట్లర్ మరణం అనంతరం తిరిగి పోలాండ్ దేశం వెళ్ళిన ప్రజలు భారత్ పట్ల ఇప్పటికీ కృతజ్ఞత చూపిస్తున్నారు. కానీ జర్మనీ అంటే ఇప్పటికీ పడదు పోలాండ్ కి. మరి అలాంటప్పుడు జర్మనీ, పోలాండ్ దేశాలు ఒకే కూటమిలో ఎలా కొనసాగుతున్నాయి ఇప్పటికీ ?

3. రష్యాతో భారతదేశం స్నేహ సంబంధాలని ప్రశ్నించే వెస్ట్రన్ మీడియా జర్మనీ పోలాండ్ సంబంధాలని ఎందుకు ప్రశ్నించదు ?

*******************

ఇలాంటి ప్రశ్నలు జై శంకర్ అడగాలని ఆశిస్తున్నాను ! బహుశా రాబోయే రోజుల్లో నా ఆశ తీరుతుంది అని కోరుకుంటున్నాను ! ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే భారత దేశ విదేశాంగ విధానం ఘోరంగా విఫలం అయ్యింది అంటూ లండన్ వెళ్ళి అక్కడ కూశాడు రాహుల్ !

రాహుల్ దృష్టి లో యూరోపుకి బానిసగా ఉండాలి భారత దేశం !

బ్రిటన్ అడగకుండానే టమాటాలు, కీర దోసకాయలని పన్నులు లేకుండా ఎగుమతి చేయాలి !

బ్రిటన్ అడగకుండానే వాళ్ళకి కావాల్సిన అత్యవసర మందులు ఇవ్వాలి !

బ్రిటన్ అడగకుండానే బ్రిటన్ ఉత్పత్తులని మన దేశంలో పన్ను రాయితీలు ఇచ్చి అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలి !

ప్రజలు అన్నీ గమనిస్తున్నారు! అందుకే ఈశాన్య రాష్ట్రాలలో ఘోర పరాజయం దక్కింది కాంగ్రెస్ కి !

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘ఆ క్షణంలో ప్రధాని నరేంద్ర మోడీ కళ్లల్లో నేను భయం గమనించాను…’’
  • నటుడిగా బ్రహ్మానందం ఇప్పుడు పరిపూర్ణుడు… ఐనాసరే జాతీయ అవార్డు రాదు…
  • అది వీర బొబ్బిలి మాత్రమే కాదు… వీణ బొబ్బిలి కూడా…
  • మోడీ వ్యాఖ్యలు తప్పే… శూర్పణఖ అందగత్తె, మనోహరమైన నవ్వు… బాధితురాలు…
  • తెలుగు టీవీ సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ బైబై చెబుతున్నట్టేనా..?
  • Indian Idol Telugu… హేమచంద్రకు శ్రీముఖి హైపిచ్ కేకలే ఆదర్శం…
  • రాహుల్‌పై అనర్హత వేటులో మోడీ ఆశించే అసలు టార్గెట్స్ పూర్తిగా వేరు..!!
  • మధిరోపాఖ్యానం… తయారీ నుంచి రుచి తగిలేదాకా… ఇదొక వైనాలజీ…
  • రాంభట్ల కృష్ణమూర్తి అంటే ఒక పెద్ద బెల్జియం అద్దం…
  • హేమిటో… మునుపు వెహికిల్స్‌కు డ్రైవర్లు విడిగా ఉండేవాళ్లట భయ్యా…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions