దీపిక పడుకోన్ సిగ్గూశరం లేకుండా నర్తించిన సిగ్గులేని రంగు… అనగా బేశరం పాటను ఆ సినిమా నుంచి పూర్తిగా తీసేయాలని సదరు పఠాన్ నిర్మాతలు ఆలోచిస్తున్నారట… దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, హీరోయిన్ దీపిక పడుకోన్, హీరో షారూక్ కలిసి అకారణంగా తమ బ్యానర్‌ను అప్రతిష్టపాలు చేస్తున్నారని, సినిమాను రిస్క్‌లోకి నెట్టేశారని నిర్మాతల భావనగా చెబుతున్నారు…
నిజానికి ఈ సినిమాను నిర్మించిన యశ్‌రాజ్ ఫిలిమ్స్‌ది దశాబ్దాల చరిత్ర… దీని వ్యవస్థాపకుడు యశ్ చోప్రా కొడుకు ఆదిత్య చోప్రా దీనికి సీఎండీ ఇప్పుడు… సినిమా ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, స్టూడియో, మార్కెటింగ్, మ్యూజిక్, హోమ్ వీడియో, టీవీ… వాట్ నాట్… టీవీ, సినిమా, ఎంటర్‌టెయిన్‌మెంట్ ఫీల్డులో పాతుకుపోయిన సంస్థ… అయితే ఒక్క పాట కోసం రిస్క్ దేనికి అని ఆలోచిస్తున్నాడట ఆదిత్య చోప్రా… ఈ విషయాన్ని ఆదిత్య క్లోజ్ ఫ్రెండ్ ఒకరు చెప్పినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి…
వివాదం తెలుసు కదా… షారూక్ హీరోగా రాబోయే పఠాన్ సినిమాలో బేశరం రంగ్ అనే పాట ఉంది… చిల్లర ఐటం సాంగ్ కన్నా ఘోరం… ప్రత్యేకించి దీపికకు రెండేరెండు బట్టపీలికలు… అవీ ఆమె దేహాన్ని పూర్తిగా కప్పలేక, దాదాపు 90 శాతానికి పైగా నగ్నత్వమే… పైగా ఆమె మూమెంట్స్, ఊపులు, స్టెప్పులు చిల్లరతనం, రోత… దీనికన్నా పచ్చిదనం నయం… అసలు ఆ పాటకు ఎలా ఒప్పుకుంది ఆమె..? దీనికితోడు ఆ బికినీని కావాలనే కాషాయం రంగులో ఉంచి, అవమానించారని మరో వివాదం… దీన్ని సాకుగా చూపి సినిమాను బాయ్‌కాట్ చేయాలనే క్యాంపెయిన్ పెద్ద ఎత్తున సాగుతోంది…
Ads
మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం అయితే హీరోకు గ్రీన్ క్లాత్స్, హీరోయిన్ కాషాయం బికినీ క్లాత్స్ వేసి హిందూ మనోభావాలను దెబ్బతీశారని, ఆ పాటే అభ్యంతరకరంగా ఉందనీ, దాని విడుదలకు అంగీకరించాలా లేదా ఆలోచిస్తున్నామని అన్నాడు… అభ్యంతరకరమైనవి కనిపించకుండా నిర్మాతలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు… అసలే దీపిక మీద కాషాయశిబిరానికి ఫుల్లు కోపం… అప్పుడెప్పుడో తుక్‌డే తుక్‌డే ఆందోళనలు సాగుతున్నప్పుడు దీపిక వెళ్లి వాళ్లకు సంఘీభావం ప్రకటించింది… అదీ కోపకారణం…
దానికితోడు ఇప్పుడీ వివాదం… మధ్యప్రదేశ్ ఉలేమా బోర్డు కూడా ఆ పాట పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది… ఇస్లామిక్ కమ్యూనిటీ మనోభావాలకు కూడా అది వ్యతిరేకంగా ఉన్నట్టు అభిప్రాయపడింది… దీనికితోడు షారూక్ ఈ బాయ్‌కాట్ పిలుపులతో ఏమీకాదు అన్నట్టుగా ఎక్కడో మాట్లాడినట్టు సోషల్ మీడియాలో ప్రచారం… హిందూ సెక్షన్ వ్యతిరేకతను తగ్గించడానికా అన్నట్టు అర్జెంటుగా వైష్ణో దేవి సందర్శనకు వెళ్లాడు… వెరసి వివాదం ముదురుతోంది… సినిమా రిలీజుకు ఇంకా నెలరోజుల టైముంది…
ఈలోపు మరో పాట రిలీజు చేశారు… అది మరీ అంత రోతగా లేకపోయినా, చాలా చిల్లర అభిరుచినే సూచిస్తోంది… అసలు అంత సీనియర్ షారూక్‌కు ఏమైంది..? తన వయస్సు, తన సీనియారిటీ, తన ఇమేజీ ఏమీ పట్టలేదా..? అఫ్‌కోర్స్, దీపిక పెద్దగా ఇవన్నీ పట్టించుకోదు… ఈ స్థితిలో అసలే బంటీ ఔర్ బబ్లీ2, జయేష్ భాయ్ జోర్‌దార్ సినిమాలు ఫెయిలై, పఠాన్‌తో రికవర్ కావాలని అనుకుంటున్న ఆదిత్యచోప్రా ఈ అనుకోని వివాదంతో ఠారెత్తిపోయాడట…!!
Share this Article