Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మీకు ఈ సొసైటీ ఏం తక్కువ ఇచ్చిందిరా…? ఇంకా ఈ అనైతిక దోపిడీ..!!

July 10, 2025 by M S R

.

ఒకరిని చూసి మరొకరు… శుద్ధ పూసలు… ఏమీ తెలియనట్టుగా…. ప్రకాష్ రాజ్ చూడు, ప్రపంచ రాజకీయాలపై కూడా కామెంట్స్ రాస్తాడు… తెలియని సబ్జెక్టు లేదు, అబ్బే, నాకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నేరం తెలియదని అంటాడు… ధూర్తుడు…

ఈ మాట ఎందుకు అంటున్నానంటే..? తెలిసీ సొసైటీకి నష్టం చేసే ధూర్త కేరక్టర్ గనుక… పైకి నీతులు చెబుతాడు… బెట్టింగ్ యాప్స్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పాయరు, అప్పులపాలయ్యారు, చావలేక బతుకుతున్నారు…

Ads

తనే కాదు, అందరూ ఇప్పుడు శుద్దపూస కబుర్లు చెబుతారు… అందరూ, ఈ కేసుల్లో ఉన్నవాళ్లందరూ…. ఎస్, నిజానికి మోడీయే ప్రధాన నిందితుడు… ఒక రాష్ట్రంలో ఈ యాప్స్ నేరం, మరో రాష్ట్రంలో కాదు… ఏకంగా ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారాల్లోనే యాడ్స్ వస్తుంటాయి…

ఎవరు దోషి..? దొరికింది కదా చాన్స్ అని… చిల్లర పెంకాసులకూ చెల్లని వాళ్లు కూడా ఎడాపెడా డబ్బులు తీసుకుని, ప్రమోషన్ రీల్స్, షార్ట్స్ చేసి… ఎన్నో వందల కుటుంబాల్లో మంటపెట్టారు… సరే, మరి ఇప్పుడు తాజాగా ఈడీ కేసు నమోదు చేసింది కదా… ఏమవుతుంది..?

ఏమీ కాదు, భ్రమలు అక్కర్లేదు… గతంలో తెలంగాణ పోలీసులు కేసులు పెట్టారు… సజ్జనార్ ఒత్తిడి కావచ్చు, ప్రయత్నం కావచ్చు… అభినందనీయమే… కానీ ఏమైంది..? వరుసగా అనేక పేర్లు బయటికి రావడం మొదలైంది… ప్రభుత్వం సైలెంట్ అయిపోయింది… ఓ దశలో ఇక ఆ కేసుల దర్యాప్తు లేదు, అసలు కదలికే లేదు…

కానీ అంటించిన వత్తి మెల్లిగా కాలుతూనే ఉంది, అది ఈడీ ఆఫీసు దాకా చేరింది, పేలింది… నిజంగా తవ్వుతూ పోతే వందల మంది సెలబ్రిటీలు… వందల కుటుంబాల్లో చిచ్చు పెట్టారు… దరిద్రులు… ఖచ్చితంగా నాశనం అయిపోతారు… కర్మ సిద్ధాంతం కాదు, జరగబోయేదే చెబుతున్నా, ఆశిస్తున్నా… కోరుకుంటున్నా…

సరే, ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేసింది… అదీ తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా… పెద్ద పెద్ద డ్రగ్స్ కేసులే, కఠినమైన నార్కొటిక్స్ చట్టాలే మట్టిగొట్టుకుపోయాయి… ఈ పీఎంఎల్ఏ కేసు ఎంత అంటారా..? అసలు అది వర్తిస్తుందా అంటారా..? ఎస్, మస్తు డబ్బు సంపాదించారు కదా, ఏక్‌సేఏక్ లాయర్లను పెట్టుకుంటారు… కథ అలా కొనసాగుతూ ఉంటుంది… అంతే…

అవునూ, ఈడీకి అరెస్టు అధికారాలూ ఉంటాయి కదా… పైగా ఇది ఆర్థిక నేరం కదా… ఒక్కడిని… ప్లీజ్ ఒక్కడిని అరెస్టు చేసి, చార్జి షీటు దాఖలు చేయండి… అర్జెంటుగా ఎన్ని ప్రమోషన్ యాడ్స్ ఆగిపోతాయో చూడండి… ఈడీకి చేతనవుతుందా..? సారీ, ఇంకో మాట చెప్పండి…

(రేయ్, రేయ్, గాడిద కొడుకుల్లారా, గాడిద కూతుళ్లారా..? మీకు సొసైటీ ఎంత ఇస్తోంది..? ఇంకా కక్కుర్తి ఎందుకురా..? భ్రమల్లో బతికే అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు కదరా…? ఇంకేం కావాలిరా మీకు..? చిల్లి గవ్వకూ కొరగాని టీవీ సెలబ్రిటీలు కూడా తోపులు, తురుములు… ఛిఛీ…) ప్రస్తుతం ఈడీ కేసు నమోదు చేసిన వాళ్లు ఎవరయ్యా అంటే..?



(i)  రానా దగ్గుబాటి.
(ii)  ప్రకాష్ రాజ్.
(iii)  విజయ్ దేవరకొండ.
(iv) మంచు లక్ష్మి.
(v)  ప్రణీత.
(vi)  నిధి అగర్వాల్.
(vii) అనన్య నాగెళ్ల.
(viii) సిరి హనుమంతు.
(ix) శ్రీముఖి.
(x) వర్షిణి సౌందరరాజన్.
(xi) వాసంతి కృష్ణన్.
(xii) శోబా శెట్టి.
(xiii) అమృత చౌదరి.
(xiv) నయని పావని.
(xv) నేహా పఠాన్.
(xvi) పాండు.
(xvii )పద్మావతి.
(xviii) ఇమ్రాన్ ఖాన్.
(xix) విష్ణు ప్రియ.
(xx) హర్ష సాయి.
(xxi) బయ్యా సన్నీ యాదవ్.
(xxii) శ్యామల.
(xxiii) టేస్టీ తేజ
(xxiv) రీతు చౌదరి.
(xxv) బండారు శేషాయని సుప్రీత.
(xxvi) బెట్టింగ్ యాప్‌ల నిర్వహణకు సంబంధించి కిరణ్ గౌడ్…. ప్లస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అజయ్, సన్నీ, సుధీర్ ప్లస్ యూట్యూబ్ ఛానెల్ ‘లోకల్ బాయ్ నాని…

ఈడీ మీద భారతీయ సమాజంలో ఎవడికీ ఏ నమ్మకమూ లేదు… పోనీలెండి, కనీసం ఈ దరిద్రుల పేర్లు బహుళ ప్రచారంలోకి వస్తున్నాయి… ఇవే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు… శుద్దపూసలు…!! ఈ స్టేట్ గవర్నమెంటుకు ఎలాగూ చేతకావడం లేదని, ఈడీ దాకా తీసుకుపోయిన మహానుభావులెవరో గానీ… దండాలు స్వామీ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యాక్షన్ లేదు, ఆధార్ బ్లాకూ లేదు… ఈ వివాదం పూర్వపరాలు ఇవీ…
  • మిస్టర్ కీరవాణీ… ఈ వారణాసి లవ్ సాంగ్ వీడియో నువ్వైనా చూశావా..?
  • బాగా మగ్గిన అరటి పండు కేన్సర్‌ కణాల్ని చంపేస్తుందా..? నిజమేంటి..?
  • ఈ తెలంగాణ ద్వేషి అస్సలు మారడు… మళ్లీ అదే విద్వేష ప్రదర్శన..!!
  • బిగ్‌బాస్..! బహుశా ఫైనల్స్‌లో తనూజ, ఇమ్మూ, పడాల, భరణి, రీతూ..!!
  • వ్యక్తిపూజ- ఫ్యానిజం… ఆంధ్రా కింగ్ తాలూకా… కాదు, ఓ హీరో ఫ్యాన్ తాలూకా…
  • హనుమాన్ చాలీసా టాప్ రికార్డు… ఇవీ ఇండియాలో టాప్ 10 వీడియోలు..!
  • బురద… బూడిద..! ఆలు లేదు, చూలు లేదు… అప్పుడే వేల కోట్ల స్కాములట..!!
  • ముగ్గురు కొడుకులు… కాదు, కాదు… ఒక తండ్రి, ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ…
  • 26/11 …. మరిచిపోలేని ఒక నిజ భారత రత్నం… కొన్ని బొగ్గు కేరక్టర్లు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions