Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భద్రాచలానికి ఇక కొత్త కళ… కేసీయార్ నిర్లక్ష్యానికి రేవంత్ దిద్దుబాటు…

March 17, 2026 by M S R

.

ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీల్లో ఓ చిన్న సింగిల్ కాలమ్ వార్త ఆకర్షించింది… రాములోరి పెళ్లికి సీఎం రేవంత్ అనేది వార్త… అంతేకాదు, 100 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం అట… మొత్తం 300 కోట్లు ఖర్చు పెట్టనున్నారు…

గుడ్… కోట్ల మంది భక్తులు కొలిచే గుళ్లకు వెళ్లి, విశ్వాసాన్ని ప్రకటించడం, భక్తిప్రపత్తులను ప్రదర్శించడం పాలకుడిని చూసే కోణంలో కరెక్టు… మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పరిసరాల్లోనే కేబినెట్ మీటింగ్ పెట్టి, 300 కోట్ల దాకా ఖర్చుపెట్టి ఓ కొత్త రూపు తీసుకొచ్చారు…

Ads

వేములవాడ (వేమాాద్రి కాదు)లో కూడా దాదాపు 300 కోట్ల మేరకు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి… ఆలయ పునర్నిర్మాణం డిజైన్, పనుల తీరు పట్ల పాజిటివ్ ఫీడ్ బ్యాకే వస్తోంది… కాకపోతే మొన్నటి మేడారం జాతరలోపు పనులు పూర్తి చేసి ఉంటే బాగుండేది… జాప్యం జరుగుతోంది…

మరోవైపు ఇప్పుడు భద్రాచలం (భద్రాద్రి కాదు) అభివృద్ధికి కూడా 300 కోట్లు… 1) సమ్మక్క సారలమ్మ… ఓ ఆదివాసీ జాతర… 2) వేములవాడ… ప్రసిద్ధ శైవక్షేత్రం, ప్రత్యేకించి గ్రామీణ భక్తులు అధికం… 3) భద్రాచలం… ఓ వైష్ణవ క్షేత్రం… అన్ని సంప్రదాయాలకూ సమ ప్రాధాన్యం… తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ తొలిపాలనలో కనిపించిన కేసీయార్ మార్క్ నిర్లక్ష్యానికి ఇప్పుడు దిద్దుబాటు…

22

కేసీయార్‌ ప్రస్తావనకు ఓ కారణం ఉంది… యాదగిరిగుట్టను మాత్రమే పట్టించుకుని, వందల (వేయి దాటి) కోట్లు ఖర్చ పెట్టడం… నిర్మాణలోపాలు, అక్రమాల వార్తల్ని వదిలేస్తే… ఎండ కొడితే, వాన పడితే అప్పటికప్పుడు భక్తులు ఎక్కడ తలదాచుకోవాలో తెలియని వాస్తు నిర్మాణం… పైగా స్థంభాలపై పార్టీ ముద్రలు, పథకాల గుర్తులతో బదనాం కావడం కూడా తెలిసిందే…

పైగా ఇతర క్షేత్రాల మీద పూర్తి నిర్లక్ష్యం… భద్రాచలం రాములోరి పెళ్లికి పాలకుడు ముత్యాల తలంబ్రాలు తీసుకుపోవడం దశాబ్దాల సంప్రదాయం… ఆ గౌరవానికి కూడా మంగళం పాడాడు కేసీయార్… చివరకు ఓసారి మనమడిని పంపించాడు తలంబ్రాలతో… అదీ దొరవారు భద్రాచలం రాముడికి ఇచ్చిన ఆధ్యాత్మిక మర్యాద..!!

bhadrachalam

నిజానికి ఇది కూడా కాదు ప్రస్తావించాల్సింది… అయోధ్యలో రామాలయ నిర్మాణానికి చందాలు వసూలు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు, కేడర్ అడ్డుకున్నారు, విమర్శించారు… అదేదో జాతి వ్యతిరేక నిర్మాణం అన్నంతగా బిల్డప్, కలర్ ఇచ్చారు… అయ్యో, అయోధ్య సరే, మరి భద్రాచలాన్ని వదిలేశారేమిటి అని మోదీని ఎత్తిపొడిచారు… భద్రాచలం రాముడిపై తెగ ప్రేమ కురిపించారు పింక్ మేధావులు… అంశం ఏదైనా రాజకీయం పులమడంలో సిద్ధహస్తులు కదా…

నిర్లక్ష్యం చేసేదేమో కేసీయార్… తిట్టిందేమో మోదీని… పైగా జీహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే, హిందువులందరూ వ్యతిరేకంగా ఉన్నారని గుర్తించి… కేసీయార్ ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద హిందువు అని ప్రచారం చేసుకున్నారు… అదీ ద్వంద్వ వైఖరి… గుడి, గోదావరి, అడవులు, పాపికొండలు… ఇతరత్రా కాస్త పర్యాటక హంగుల్ని సమకూరిస్తే… ఆధ్యాత్మికతకు తోడుగా పర్యాటకాన్ని కూడా జతకలిపి ఇంకాస్త బెటర్, కాంప్రహెన్సివ్ ప్లానింగుతో ముందుకు పోతే మరింత బెటర్…

సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి సీతక్క, వేములవాడపై ఆది శ్రీనివాస్, భద్రాచలంపై తుమ్మల అభినందనీయులు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హమ్మ మంగ్లీ..? నీ నోట ఈ బూతు పాటేంటి..? యూట్యూబ్‌లో మాయం..!!
  • భద్రాచలానికి ఇక కొత్త కళ… కేసీయార్ నిర్లక్ష్యానికి రేవంత్ దిద్దుబాటు…
  • ఈ సినిమాలో అందరికన్నా మెచ్చుకోవలసింది సత్యనారాయణనే
  • సాయం కోరుతూ కన్నీళ్లు, విన్నపాలు… ఇదోరకం మోసం, జాగ్రత్త…
  • ఆస్కార్ జ్యూరీని ఎందుకు ఈ సినిమా అంతగా ఇంప్రెస్ చేసింది..?!
  • పాత కేసీయార్ ఫ్యాన్… ధాటిగా ఆ పొలిటికల్ అనైతికతపై ప్రశ్నలు…
  • దిష్టి వ్యాఖ్యలు, వెక్కిరింపుల్ని తొక్కిపడేస్తూ… తెలంగాణ పరుగులు…
  • పేరుకే BRS- TDP వైరం… *యవ్వారాల్లో* జాన్‌జిగ్రీలే… ఏమంటావ్ బాపూ..?!
  • గుండమ్మ కథ రీమేక్..! అసాధ్యం… ఎస్వీఆర్, సూర్యకాంతం కావాలి కదా..!!
  • నేను ఎందుకు రాసుకుంటున్నాను ఇవన్నీ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions