Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆత్మాభిమానం ఓవర్‌డోస్… అపార్థాలు, అవమానాలు, మనోగాయాలు…

December 29, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …… ప్రపంచంలో డబ్బు అవసరం లేకుండా విరివిగా దొరికేవి ఆత్మాభిమానం , మనోభావాలు . అదృష్టవశాత్తూ సినిమా వాళ్ళు మనోభావాల జోలికి పోలేదు . ఆత్మాభిమానం వరకే సినిమాలు తీసారు . కుప్పలుకుప్పలు ఆత్మాభిమానం మీద సినిమాలు .

1989 లో వచ్చిన ఈ భలే దంపతులు సినిమా కూడా ఆత్మాభిమానం చుట్టూనే . అయితే ఈ సినిమాలో రెండు జంటలు . ఒకటి కుర్ర జంట . మరొకటి ప్రౌఢ జంట . కుర్ర జంట విషయంలో అనుమానం . ప్రౌఢ జంట విషయంలో ఆత్మాభిమానం .

Ads

కుర్ర జంటగా రాజేంద్రప్రసాద్ , వాణీ విశ్వనాథ్ . ప్రౌఢ జంటగా ఏయన్నార్ , జయసుధ . కుర్ర జంట కన్నా ప్రౌఢ జంటే బహుత్ బ్యూటీఫుల్ హై . జయసుధ చాలా అందంగా కనిపిస్తుంది . 60+ లో కూడా ఏయన్నార్ ఫ్రెష్ గా కనిపిస్తారు .‌ కధ ఏంటంటే…. :

ఒక వీరాత్మాభిమానం కల యువకుడు ఏయన్నార్ , స్వతంత్ర భావాలు కల యువతి జయసుధ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు . యువతి తండ్రి నూతన్ ప్రసాద్ పెద్ద కోటీశ్వరుడు . అతన్ని కూడా కాదని భర్తతో ఇల్లు వదలి వెళ్ళిపోతుంది . ఓరోజు భార్యాభర్తలు కోటీశ్వరుడు ఇంట్లో ఫంక్షనుకు వెళ్లి మామా అల్లుళ్ళు ఘర్షణ పడతారు . భర్త కావాలో తండ్రి కావాలో తేల్చుకొమ్మని అంటాడు హీరో . అంతే షీరాత్మాభిమానం కల జయసుధ రాను పొమ్మంటుంది .

కుర్ర జంట గురించి ….. నిరుద్యోగి రాజేంద్రప్రసాద్ ఆత్మహత్య చేసుకోబోతే నివారించి, తన కంపెనీలో ఉద్యోగం ఇచ్చి దగ్గరకు తీస్తాడు ఏయన్నార్ . కుర్రోడు చింతపండు వ్యాపారంలో కోట్లు గడించిన కోట శ్రీనివాసరావు కూతురు వాణీ విశ్వనాధుని ప్రేమిస్తాడు . కోటీశ్వరుడు అంగీకరించడు . ఏయన్నార్ కోటను ఒప్పించి పెళ్లి జరిపిస్తాడు .

పెళ్ళయిన కుర్ర జంట విశాఖలో ఉన్న చింతపండు బ్రాంచిని చూసుకోవటానికి విశాఖ వెళతారు . అక్కడో ఆషాఢ భూతి గొల్లపూడి ఉంటాడు . వాడు కుర్ర జంట మధ్య తగాదాలు పెడతాడు . వీళ్ళ వివాహ బంధాన్ని కాపాడటానికి ఏయన్నార్ రంగప్రవేశం చేస్తాడు . విడిపోయిన భార్యని భార్యగా నటించమని అడుగుతాడు .

ఇరువురూ విశాఖకు వచ్చి అన్యోన్య దంపతులుగా నటించి కుర్ర జంట కాపురాన్ని కాపాడతారు . గొల్లపూడి కుతంత్రాన్ని బయటపెడతారు . కుర్ర జంటని కలిపే క్రమంలో నటించటానికి మాత్రమే దగ్గరయిన ప్రౌఢ జంట నిజంగానే దగ్గరయిపోవటంతో సినిమా సుఖాంతం అవుతుంది .

చక్కటి ఫేమిలీ పిక్చర్ . ఫుల్ వెజిటేరియన్ సినిమా . ఎక్కడా కత్తులు , కఠారులు , కుస్తీలు వగైరా ఉండవు . ఫాస్ట్ పాసెంజర్ ట్రైన్ లాగా సాఫీగా , కుదుపులు లేకుండా సాగిపోతుంది . రాజ్-కోటి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి . బేక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా డైలాగులు వినపడేలాగా శుధ్ధంగా ఉంటుంది .

పాటల్ని సి నారాయణరెడ్డి , వేటూరి వ్రాయగా బాలసుబ్రమణ్యం , జానకమ్మ శ్రావ్యంగా పాడారు . తారలకి జాబిలికి అంటూ సాగే డ్యూయెట్ అక్కినేని , జయసుధల మీద అందంగా చిత్రీకరించాడు దర్శకుడు కోడి రామకృష్ణ . చిలకమ్మకు నెల తప్పిందంట గోరింకకు తల తప్పిందంట అంటూ సాగే పాట రెండు జంటల మీద బాగుంటుంది .

సినిమా మొదట్లో దేశమేడున్నదో ..చూపరా మోసమెట్లున్నదో అంటూ సాగే పాట రాజేంద్రప్రసాద్ , అతని మిత్ర బృందం మీద ఉంటుంది . రాజేంద్రప్రసాద్ , వాణీ విశ్వనాధు మీద రెండు డ్యూయెట్లు హుషారుగానే ఉంటాయి .

కధను యం శ్రీనివాస చక్రవర్తి వ్రాసారని టైటిల్సులో వేసారు . ఈయన గురించి తెలియదు . డైలాగులను తోటపల్లి మధు వ్రాసారు . డైలాగులు బాగుంటాయి . స్క్రీన్ ప్లే , దర్శకత్వం వెటరన్ డైరెక్టర్ కోడి రామకృష్ణ వహించారు .

నాగేష్ , బ్రహ్మానందం , శ్రీలక్ష్మి మధ్య కామెడీ ట్రాక్ కాస్త జుగుప్సాకరంగా ఉంటుంది . సినిమా యూట్యూబులో ఉంది . ఏయన్నార్ , జయసుధ అభిమానులకు బాగా నచ్చుతుంది . చూడబులే . It’s a feel good , romantic ,family entertainer .

నేను పరిచయం చేస్తున్న 1207 వ సినిమా
#తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సాక్షి… విడ్డూర పాత్రికేయం… వితండ పాత్రికేయం… ఈ రెండు స్టోరీలూ అవే…
  • రిపబ్లిక్ టీవీ ఆర్నబ్ గోస్వామి ‘పొలిటికల్ లైన్’ నిజంగానే మారిందా..?!
  • ఆత్మాభిమానం ఓవర్‌డోస్… అపార్థాలు, అవమానాలు, మనోగాయాలు…
  • విడిపోయిన జంటను కలిపిన సుప్రీం ‘సిక్స్త్ సెన్స్’… కానీ..?
  • ప్రపంచాధిపత్యం కోసం మొదలైన ‘డిజిటల్ కురుక్షేత్రం’..!
  • ‘Hip’ocracy..! ఎవరు తక్కువ..? ఏం తక్కువ..? అది సినీ హిప్‌కల్చర్..!!
  • ‘పిలిచావా’ అంటూ ఆమెను పిలిచాను… నా పిలుపు ఆమెకు అందనే లేదు…
  • దారం పోగు కట్టడిని జంధ్యం శాసిస్తోంది..!
  • ‘‘ఈ భారత రాజును ఎవరైనా దూషిస్తే… ఫిరంగికి కట్టి పేల్చేస్తారుట…’’
  • హమారా హైదరాబాద్… దీని తెహజీబ్ నిత్యాంతర్వాహిని…!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions