భోలే షావలి… బిగ్‌బాస్ హౌజ్ నుంచి వెళ్లగొట్టబడ్డాడు… అనగా ఎలిమినేటెడ్… ఎవిక్టెడ్ బిగ్‌బాస్ భాషలో… ఊహిస్తున్నదే, కానీ హౌజులో ఉన్న కొందరికన్నా తను ఇంకొన్నాళ్లు ఉండటానికి మరీ అనర్హుడేమీ కాదు… కొనసాగనివ్వాల్సింది…
గాయకుడు… తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా… మ్యూజిక్ కంపోజర్ కూడా… కాకపోతే ఫోక్ స్టయిల్… అప్పటికప్పుడు నాలుగు పదాలు కూర్చగలడు, రాగయుక్తంగా పాడగలడు… కానీ ఏమాటకామాట బిగ్‌బాస్ వంటి ఆటకు తను సూట్ కాడు… తను ఈ ఏడో సీజన్లోకి మిడిల్ ఎంట్రీ… ఫస్ట్ జాబితాలో వచ్చినవాడు కాదు…
కంటెస్టెంట్లతో మాట్లాడినప్పుడు, నామినేషన్లు- టాస్కుల సందర్భాల్లో తన ధోరణి విచిత్రంగా ఉంటుంది… మాటకుమాట సమాధానం స్ట్రెయిట్‌గా ఇవ్వకుండా ఏదేదో పాడుతూ, అర్థరహితంగా వ్యవహరిస్తున్నాడు… అదే చికాకు తనతో… పైగా ప్రతి వాదన చివర భోలే షావలి సన్నాఫ్ యాకూబ్ అలీ అని ఎందుకు ప్రస్తావిస్తాడో అర్థం కాదు… బాడీ లాంగ్వేజీ కూడా ఎదుటోడికి చిర్రెక్కించేలా ఉంటుంది… పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డను అంటూ ఓ సెంటిమెంట్ క్యారీ చేస్తుంటాడు కదా, అది చూసి నేను పాటబిడ్డను అని భోలే మొదలుపెట్టాడు…
Ads
అన్నింటికీ మించి తను శివాజీ గ్యాంగుకు లోబడిపోయాడు… అదొక తప్పు… దీంతో నొటోరియస్ టీవీ సీరియల్ బ్యాచ్ శోభ గ్యాంగుకు వ్యతిరేకం అయిపోయాడు… మహారాణుల నామినేషన్ కాన్సెప్టు తీసుకున్నారు కదా గత వారం… ఈ శోభ, ప్రియాంక రెచ్చిపోయి, శివాజీ గ్యాంగును టార్గెట్ చేశారు… చివరకు భోలే ఎగిరిపోయాడు…
నిజానికి ప్రతిసారీ సైట్ల అనధికారిక వోటింగ్ రిజల్ట్స్ చూసి, ఎవరు ఎలిమినేట్ అవుతారో మీడియా సైట్లు ఊహించి రాస్తుంటాయి… ఈమధ్య మరీ కొన్ని సైట్లు కక్షగట్టినట్టు శోభ, ప్రియాంక తదితరుల్నితిడుతూ పోస్టులు పెడుతున్నాయి… విపరీత, పైత్య ధోరణి… ప్రత్యేకించి శివాజీ ఫ్యానిజం తెలుగు సైట్లలో పెరిగిపోయింది… తనేమో పెదరాయుడు టైపు… చివరకు తనకు నాగార్జున, బిగ్‌బాస్ టీం ఇస్తున్న ప్రయారిటీ, ఫేవరిటిజం చూసి బయటికి వెళ్లి మళ్లీ వచ్చిన రతిక కాళ్ల మీద పడింది…
అంతెందుకు..? కుటుంబసభ్యుల రాక సందర్భంగా అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ వచ్చింది… ఇద్దరూ సీరియల్ నటులే… వచ్చీ రాగానే ఇద్దరూ కలిసి శివాజీ కాళ్లు మొక్కారు… హౌజులో ఇవేం పెద్దరికాలు..? పల్లవి ప్రశాంత్, యావర్ కూడా శివాజీ గ్యాంగే… శివాజీ చెప్పినట్టు నడిచే కేరక్టర్లే… శివాజీతో ఢీ అంటే ఢీ అని సవాల్ విసిరి, ఎక్కడా తగ్గకుండా ఆడుతున్నది శోభ, ప్రియాంక… మొన్నటిదాకా అమర్ దీప్ కూడా… తను శివాజీ కాళ్ల మీద పడటం అందుకే ఆశ్చర్యం కలిగించింది…
మొన్నటివరకూ వోటింగుల సరళి చూసి అందరూ రతిక లేదా గౌతమ్ ఔటవుతాడని ఊహించారు… రతిక అయితే మరీ ఘోరంగా ఆడుతోంది… బతిమిలాడుతోంది అందరినీ… ఎలిమినేషన్ ప్రాసెస్‌లో ఏడుస్తూ నాగార్జునను బతిమిలాడింది… నిజానికి వోటింగ్ సరళిని బట్టి తను బయటికి పోవాలి… ఈమధ్య పిచ్చిపిచ్చిగా బిహేవ్ చేస్తున్న గౌతమ్ ఎలిమినేట్ కావాలి… నిన్నో మొన్నో మెయిన్ డోర్ కొడుతూ బయటికి పంపించేయండి అంటూ హిస్టీరిక్‌గా వ్యవహరించాడు…
తను యాంటీ శివాజీయే… ఈ స్థితిలో అనుకోకుండా భోలే బయటికి వెళ్లిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది… మొత్తానికి వాడు పోయినట్టే, వీడు పోయినట్టే, అది కంత్రీ, ఇది జగత్ కంత్రీ అని లేకి రాతలకు దిగే సైట్లకు మళ్లీ షాక్… భోలే ఎవిక్షన్ ఊహించక పోయాయి… అదే మరి బిగ్‌బాస్ అంటే… వోటింగుతో సంబంధం లేదు… తను ఎవరిని అనుకుంటే వాళ్లను పంపించేస్తాడు… అదంతే…
Share this Article