ఒకవైపు ఉర్రూతలూగించిన ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్స్… ప్రేక్షకులంతా టీవీలకు అతుక్కుపోయారు అక్కడే… ఇక ఈ దిక్కుమాలిన బిగ్‌బాస్ ఫినాలే ఎవడూ పెద్దగా దేకలేదు… వెరసి మొదటి నుంచీ చెత్తచెత్తగా సాగుతున్న ఈ సీజన్ బిగ్‌బాస్ చివరకు ఫినాలే విషయంలో కూడా అట్టర్ ఫ్లాప్ కాబోతోంది రేటింగ్స్‌లో… ఎవరు విన్నర్, ఎవరు రన్నర్… ఈ ప్రశ్నకు సింపుల్ జవాబు… ఈ ఆటలో ఎవడూ గెలవలేదు… చిత్తుగా ఓడింది మాత్రం ఆ పిచ్చి ఆటకు వోట్లేసిన ప్రేక్షకులు… ఎందుకు అంటారా..?
ఇదంతా స్క్రిప్టెడ్ గేమ్, పైగా ఓ దందా అనేది కాసేపు వదిలేద్దాం… బిగ్‌బాస్ టీం శుద్ధపూసలే అనుకుందాం… వాళ్లు చెప్పిందే నిజమని అనుకుందాం… ‘‘నిజానికి శ్రీహాన్ విజేత, జనం వోట్లు తనకే పడ్డాయి, కానీ డబ్బు తీసుకుని వదిలేయడంతో ఇక మిగిలిన రేవంత్ విన్నర్ అయ్యాడు’’ ఇదీ బిగ్‌బాస్ లెక్క… జనం వోట్లు శ్రీహాన్‌కు పడి ఉంటే, అందరూ తనే విజేత కావాలని కోరుకుంటే మరి రేవంత్ ఎలా అయ్యాడు..? ఇక్కడ ప్రేక్షకుల వోట్లకు అర్థమేముంది..? ఈ గేమ్ దిక్కుమాలినతనం కాదా..?
రేవంత్ కోణం చూద్దాం… ఓడి గెలిచాడా..? గెలిచి ఓడిపోయాడా..? నిజానికి తనది గెలుపేనా..? 50 లక్షల ప్రైజ్ మనీలో 40 లక్షలు శ్రీహాన్ కొట్టుకుపోతే ఇక మిగిలింది 10 లక్షలు, 3 లక్షలు టీడీఎస్ తీసేస్తే చేతికి వచ్చేది 7 లక్షలు… బయటికి వచ్చాక బంధుమిత్రులకు పార్టీ ఇవ్వడానికి సరిపోతుంది… హళ్లికిహళ్లి సున్నాకుసున్నా… నిజానికి తను ఓడిపోయాడు… కానీ బిగ్‌బాస్ పిచ్చి రూల్స్‌తో గెలిచాను అనిపించుకున్నాడు… మరిక ఆ గెలుపుకు విలువేముంది..? 10 లక్షల ఓ మారుతి బ్రెజా కారు, 10 లక్షలయినా ఉంటుందో లేదో తెలియని 600 గజాల ప్లాటు…
Ads
శ్రీహాన్ కోణం చూద్దాం… తను కూడా గెలిచి ఓడిపోయాడు… జనం వోట్లేశారు… నువ్వే విజేతవు అన్నారు… కానీ బిగ్‌బాస్ చూపిన ప్రలోభంతో టెంపర్ కోల్పోయాడు… రిస్క్ దేనికి..? 40 లక్షలు వస్తుంటే వద్దనడం దేనికి అనుకునేదాకా సాగింది టెంప్టేషన్… డబ్బు తీసుకున్నాక, నిజానికి నువ్వే విజేతవోయ్ అని నాగార్జున అనేసరికి తెల్లబోయాడు… వెరసి ఏం జరిగింది..? ఇద్దరు విజేతలు కాదు… గెలిచి ఓడి, ఓడి గెలిచి ఇద్దరికీ చివరకు ఏడుపే…
ఇది ఫెయిర్ గేమ్ అయితే… ప్రేక్షకులు చెప్పిన విజేతకే ప్రైజ్ మనీ దక్కాలి… తనకే కప్పు దక్కాలి… తనకే విన్నర్ అనే టైటిల్ దక్కాలి… కానీ ఏం జరిగింది..? రన్నర్ విన్నరయ్యాడు… విన్నర్ కాస్తా రన్నరై పోయాడు… విజేతగా ప్రకటించబడిన పరాజితుడు రేవంత్‌కు దక్కింది ముష్టి 10 లక్షలు… కానీ రన్నర్‌గా మిగిలిపోయిన శ్రీహాన్‌కు దక్కింది 40 లక్షలు… వీళ్లద్దరితో పోలిస్తే కళ్లెదుట 15 లక్షలు కనిపిస్తున్నా, హుందాగా తిరస్కరించిన కీర్తి భట్ వంద రెట్లు బెటర్… గేమ్ స్పిరిట్ అది…
మరీ 40 లక్షల దాకా డబ్బు ఇస్తామని టెంప్ట్ చేయడం గతంలో ఎన్నడూ లేదు… ఎలాగైనా శ్రీహాన్‌ను మెంటల్‌గా వీక్ చేసి, ఆ డబ్బు తీసుకునేలా చేసి, రేవంత్‌ను విన్నర్ చేయాలనే ప్రయత్నమా..? ఒకవేళ అదే నిజమైతే మిమ్మల్ని ఎవరికెన్ని వోట్లు వచ్చాయి అని ఎవడు అడిగాడు..? అంతా మీరు అనుకున్నట్టే కథ నడిపిస్తారు కదా… శ్రీహాన్ రన్నర్ అని సింపుల్‌గా ప్రకటిస్తే, జనం అన్నపూర్ణ స్టూడియోస్‌కు వచ్చి, కమాన్, వోట్ల వివరాలు చెప్పండి అని నిలదీస్తారా ఏమైనా..? సో, బిగ్‌బాస్ ఏం గేమ్ ప్లే చేయాలనుకున్నాడో, చివరకు ఏం జరిగిందో తనకైనా అర్థమైందా అసలు..? ఇదుగో ఇలాంటి ఆటనే నెత్తిమాశినతనం అంటారు..!! నో, నో, ఈ ఆటలో బ్యూటీయే అది అంటారేమో… అది మరీ మరీ చెత్త సమర్థన..!!
Share this Article