Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Biggboss… చివరకు ఆ షో ఫినాలే రేటింగ్స్‌పైనా అబద్ధపు ప్రచారం…

December 30, 2023 by M S R

మొదటి నుంచీ బిగ్‌బాస్ ఇదే ధోరణి… పిచ్చి స్ట్రాటజీలు, తిక్క ప్రచారాలు, దిక్కుమాలిన షో నిర్వహణ… ఈసారి మరీ ఘోరం… సోఫాజీ అనబడే శివాజీని మోసిన తీరు చిరాకెత్తించగా… పల్లవి ప్రశాంత్‌ను జనం మీదకు విన్నర్‌గా రుద్దడం ఏకంగా సొసైటీకే సమస్యగా మారింది… గత సీజన్ ఎలాగూ మట్టిగొట్టుకుపోయింది… దరిద్రమైన రేటింగ్స్‌తో జనం ఛీ అన్నారు… లైట్ తీసుకున్నారు…

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు… గత సీజన్ దరిద్రానికి ఎన్నో కారణాలు… ఈసారి ఏదో పేరు మార్చి, కాన్సెప్టు మారుస్తున్నామని చెప్పి, ఏదో ఉల్టా పుల్టా అన్నారు… ఆ పుల్టా అనే పదం కూడా తప్పే… సరే, ఏదో ఏడ్చారు… కానీ ఆ పాత ధోరణులే… సేమ్ టాస్కులు, సేమ్ షో లైన్, సేమ్ గేమ్స్… కొత్తదనం ఏమీ లేదు… పైగా స్పై బ్యాచ్ అరాచకం… కాస్త ఆ బ్యాచ్‌కు దీటుగా నిలబడి సమాధానం చెప్పింది కేవలం శోభాశెట్టి…

బయటికి వచ్చాక కూడా ఈ శివాజీ అనబడే కేరక్టర్ తనను బెదిరిస్తున్నాడు… బీకేర్‌ఫుల్ అంటున్నాడు… అసలే ఇండస్ట్రీలో ప్రస్తుతం జీరో, ఏం చేస్తాడు తనను..? ఐనా ఇదేం ధోరణి..? అమర్‌దీప్ అనబడే రన్నరప్ ఈరోజుకూ మళ్లీ కనిపించడం లేదు… ఎటుపోయాడో ఎవరికీ తెలియదు… భోలే షావలి, శివాజీ, టేస్టీ తేజ వంటి కొందరు పల్లవి ప్రశాంత్‌ను సపోర్ట్ చేస్తున్నారు, అంటే ప్రభుత్వ వాహనాల ధ్వంసాన్ని సమర్థిస్తున్నారా..? అరాచకాన్ని ఎంజాయ్ చేస్తున్నారా..? వీళ్లా బిగ్‌బాస్ చెక్కిన శిల్పాలు..?

Ads


🌟✨Breaking all records! 🎉📺 Bigg Boss Telugu 7 Grand Finale achieved an astounding 21.7 TVR points, making it an unparalleled success! 🏆💥Thank you for making it the grandest celebration.🙌🌈 #BiggBossTelugu7 #StarMaa @DisneyPlusHSTel @iamnagarjuna @EndemolShineIND pic.twitter.com/kO1p2lXSoj

— Starmaa (@StarMaa) December 29, 2023

చివరకు బిగ్‌బాస్ దరిద్రం ప్రచారంలో కూడా కనిపిస్తోంది… బిగ్‌బాస్ ఫినాలే మునుపెన్నడూ లేనంతగా విసిగించింది… ఎంటర్‌టెయిన్‌మెంట్ లేదు కదా, చిరాకు పుట్టించింది… కానీ ఈ షోకు ఏకంగా 21.7 రేటింగ్స్ వచ్చాయనీ, సూపర్ హిట్ అనీ స్టార్‌మాటీవీ తన సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం చేసుకుంటోంది… అబ్బో, కథ బాగానే ఉంది, నిజమేనా అని చెక్ చేస్తే బిగ్‌బాస్ అబద్ధాలని తేలిపోయింది… దారుణమైన అబద్ధాలు…

bb

చూశారు కదా… హైదరాబాద్ బార్క్ రేటింగ్స్ కేవలం 12.42… అదే చానెల్‌లో వచ్చే బ్రహ్మముడి అనే సీరియల్‌కు వచ్చిన రేటింగ్స్‌తో దాదాపు సమానం… ఈ అసత్య ప్రచారం దిగువన కామెంట్స్‌లో ఒకాయన కుండ బద్ధలు కొట్టేశాడు… ‘‘ప్రచారం చేసుకునేముందు ఏ కేటగిరీలో ఈ 21.7 వచ్చాయో చెప్పాలి, నిజానికి ఏపీ ప్లస్ టీఎస్ కలిపి 13.7 మాత్రమే’’… ఈమాత్రం దానికి మా పల్లవి ప్రశాంత్ వల్లే ఈ రేటింగ్స్, పల్లెజనం బాగా చూశారు, కామన్ మ్యాన్ గెలుపు అని కొందరు… మా శివాాజీ లేక ఈ రేటింగ్స్ లేవు అని మరికొందరు… అమర్‌దీపే ఈ సక్సెస్‌కు కారణం అని ఇంకొందరు… అసలు ఆ ప్రచారమే తప్పు, ఆ రేటింగ్సే తప్పు అంటుంటే… దాన్ని ఓ ఘనతగా ప్రచారం చేసేవాళ్లు మరో వైపు… ఏం దొరికార్రా బాబూ…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions