.
ఓ వార్త… షణ్ముఖ్ జస్వంత్ అనే ఓ కేరక్టర్… యూట్యూబ్ వీడియోస్, వెబ్ సీరీస్‌తో ఫాఫం బాగానే ఉండేవాడు…
బిగ్‌బాస్ (బహుశా 5 సీజన్,..?) లోకి ఎంటరయ్యాక తన జీవితం దుర్భరమైపోయింది… ఆ టీం ఏదో శాసిస్తుంది… దాంతో సిరి హన్మంతు అనే మరో కేరక్టర్‌తో లవ్వు, రొమాన్స్ హౌజులో…
Ads
ఆమెకు బయట ఒకడున్నాడు… ఇతనికీ బయట ఒకామె ఉంది… కానీ టీఆర్పీల కోసం వాళ్ల నడుమ లవ్ ట్రాక్ నడిపించింది బిగ్‌బాస్… వాడికి రేటింగ్స్ కావాలి కదా… ఇద్దరూ హౌజులో రెచ్చిపోయారు…
వాడి బొంద సీజన్, ఎప్పటిలాగే ఫ్లాప్… లీలా వినోదం అని ఓ వెబ్ సీరీస్ విడుదలవుతోంది… ఇప్పుడు వెబ్ సీరీస్‌లకు కూడా ప్రిరిలీజ్ ఫంక్షన్ చేయాలి కదా… చేశారు… అక్కడ ఇదే షన్నూ అలియాస్ షణ్ముఖ కన్నీళ్లు పెట్టుకున్నాడు… కారణం, తన వల్ల తన ఫ్యామిలీ సఫరైందీ అని…
నిజం… తను ఫైనలిస్టే గానీ విన్నర్ కాదు… ఓ యాక్సిడెంట్ కేసు… ఓ అమ్మాయిని మోసం చేసిన కేసులో అరెస్టు చేయడానికి తన సోదరుడి వేటలో గంజాయి దొరికిందని అదో కేసు… మొత్తానికి ఓ ట్రాజెడీ స్టోరీ…
ఇదే కాదు… బిగ్‌బాస్ ఫైనలిస్టులు, విన్నర్లు ఎవరూ బాగుపడినట్టు చరిత్రలో లేదు… ఫస్ట్ విజేత, శివబాలాజీ… నయాపైసా ఫాయిదా లేదు, తనకు పైసా ఫాయిదా లేదు… కౌశల్… ఆర్మీ అంటూ నానా హంగామా… ఈరోజుకూ తనకు ఏమీ ఒరగలేదు… రాహుల్ సిప్లిగంజ్… తనకు బిగ్‌బాస్‌తో వచ్చిందేమీ లేదు…
అభిజిత్ దుద్దాల… బిగ్‌బాస్ చెత్తా పాలసీ కారణంగా అరకొర ప్రైజ్ మనీ… ఆ పాపులారిటీ దేనికీ ఉపయోగపడలేదు… ప్రస్తుతం లాపత్తా… వీజే సన్నీ సేమ్ సేమ్ స్టోరీ… రేవంత్, వచ్చింది లేదు, పోయిందీ లేదు… పల్లవి ప్రశాంత్, బిగ్‌బాస్ చరిత్రలో తనొక బ్లాక్ ఎపిసోడ్… ఇప్పుడు నిఖిల్… పాపం శమించుగాక…
షన్నూ మాత్రమే కాదు… రీసెంటు విషయాలు చెప్పుకుందాం… ఓ షోలో తేజస్వి చెప్పుకుంటోంది, బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చాక రెండేళ్లు నరకం అనుభవించానని… బిగ్‌బాస్ హౌజులో ఉండటం ఓ మానసిక నరకం అనీ… అర్థంతరంగా సూట్‌కేసు పట్టుకుని వెళ్లిపోయిన సోహెయిల్ సినిమా తీసి, వేదిక మీదే ఏడ్చాడు తెలుసు కదా…
చిరంజీవి మెచ్చుకున్న మెహబూబ్ మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చాడు… మధ్యలోనే వెళ్లిపోయాడు, ఏమీ ఫాయిదా లేదు… శోభా శెట్టి గత సీజన్‌లో అదరగొట్టింది… కానీ ఈసారి కన్నడ బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లి… నన్ను పంపించేయండి మహాప్రభో అని ఏడ్చింది, బయటికి వచ్చేసింది… ఇలా ఎన్నెన్నో ఉదాహరణలు…
జస్ట్, తమ ఒరిజినల్ ప్రొఫెషన్‌కు ఆటవిడుపుగా వచ్చినవాళ్లే హేపీ… రాహుల్, ఏకంగా ఆస్కార్ ఎంట్రీ దాకా వెళ్లాడు… ఆస్కార్ దిక్కుమాలిన విధానాల కారణంగా చంద్రబోస్, కీరవాణికి అవార్డులు వచ్చాయి గానీ నిజానికి రాహుల్ అర్హుడు… శ్రీముఖి, గీతామాధురి వంటి కంటెస్టెంట్లు జస్ట్, ఆటవిడుపుగా, పాపులారిటీ కోసం, నాలుగు డబ్బుల కోసం వచ్చారు, వెళ్లారు… నో రిగ్రెట్స్…
ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే..? బిగ్‌బాస్ పాపులారిటీతో సినిమాలు తీసేస్తామనీ, హీరో హీరోయిన్లు అయిపోతామని అనుకుంటే అదొక భ్రమ… ఆ హౌజ్ ఒక ఐరన్ హ్యాండ్… అదొక గేమ్‌లా భావించి, తమతమ ఒరిజినల్ వృత్తుల్లో కాన్సంట్రేట్ చేస్తే రాణిస్తారు… అంతే… బిగ్‌బాస్ పాపులారిటీ మీద బోలెడు భ్రమలు పెంచుకుంటే… పిచ్చి ప్రయోగాలు చేస్తే చేతులూ మూతులూ కాలతాయ్ జాగ్రత్త…
Share this Article