ఏమాటకామాట… బిగ్‌బాస్ వీకెండ్ షోలలో నాగార్జునకు భలే డ్రెస్సులు వేస్తారు… ఈమధ్య ఆయన వేసుకునే చొక్కాల ఖరీదు 60 వేలు, లక్షా 80 వేలు అంటూ ఆధారాలతో సహా కొందరు పోస్టులు పెడుతున్నారు… ఈరోజు వేసుకున్న షర్ట్ బహుశా ఏదో పాలిస్టర్ పూల చీరెను కట్ చేసి కుట్టినట్టుంది… ధర ఎంతో తెలియదు…
చిన్నప్పుడు రేషన్ బట్ట దొరికేది… చౌకగా వస్త్రాలు ఇచ్చేవాళ్లు… ఎక్కువగా ప్లెయిన్ చేనేత బట్టలే ఉండేవి… కొన్ని డిజైన్లలో వచ్చేవి… శీటి బట్టలు అనేవాళ్లు… అయిదారు రూపాయలకు మీటర్ ఇచ్చేవాళ్లు… పది రూపాయలకు మేరోళ్లు చొక్కా కుట్టిచ్చేవారు… అదుగో నాగార్జున చొక్కా చూస్తే అదే గుర్తొచ్చింది… సరే, చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే…
ఏమాటకామాట… ఈ వీకెండ్ బిగ్‌బాస్ షో బాగుంది… అస్సలు ఊహించలేదు… నిజానికి ఈసీజన్ కూడా గత సీజన్‌లాగే దరిద్రంగా నడుస్తోంది ఏడు వారాలుగా… అసలు కంటెస్టెంట్ల ఎంపికే రాంగ్… (కొన్ని మినహాయింపులు…) దీనికితోడు షో క్రియేటివ్ టీం అస్సలు తమ బుర్రలకు పదును పెట్టడం లేదు… కాదు… వాడటమే లేదు… ఈ ఆదివారం షో మాత్రం బాగుంది…
Ads
సాధారణంగా టీవీల్లో ఏదేని పండుగలు లేదా స్పెషల్ అకేషన్లలో స్పెషల్ షోలు వేస్తుంటారు కదా… ఎక్కువగా ఎంటర్‌టెయిన్‌మెంట్ బేస్‌డ్… చాలా ఖర్చు చేస్తారు… సేమ్, సాయంత్రం ఏడు గంటలకు అందరూ బతుకమ్మ సంబురాల్లో ఉండగా ఇటు వీకెండ్ షో స్టార్ట్ చేశారు… రాంగ్ టైమింగ్… కానీ షో అనగా ఈ ఎపిసోడ్ బాగుంది…
ఆరు రకాల గేమ్స్ కూడా అలరించాయి… అందరూ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశారు… ఒక్కో గేమ్ తరువాత గిఫ్టులు… వినోదం… కొందరు కంటెస్టెంట్లు సేవ్ అవుతున్నట్టు వారి కుటుంబసభ్యులతో వీడియోల ద్వారా చెప్పించారు… గుడ్… లేఖలు కుటుంబసభ్యుల నుంచి తెప్పించి చదివించారు… ఎమోషన్… మరోవైపు ఎవిక్షన్లు… అన్నింటికీ మించి టీవీ స్పెషల్ షోలలాగే డింపుల్, పాయల్ వంటి హాట్ స్టార్లతో మసాలా పాటలకు రికార్డింగ్ డాన్సులు చేయించారు… అంటే అశ్లీలంగా ఉన్నాయని కాదు… ఆహా ఇండియన్ ఐడల్ సింగర్స్ వాగ్దేవి తదితరులతో పాటలు కూడా బాగున్నయ్…
ముందే చెప్పినట్టు పూజా మూర్తిని బయటికి పంపించేశారు… వరుసగా ఏడో ఆడ కంటెస్టెంట్ ఎలిమినేషన్ ఇది… మగ మహారాజులు ఏదో బాగా ఆడుతున్నట్టుగా… నిజానికి అంత సీనేమీ లేదు… బయటికి వెళ్లిపోయిన వారిలో ఒకరికి రీఎంట్రీ ఇస్తాం, వోట్లేయండి అని హౌజ్‌మేట్స్‌ను అడిగి, తక్కువ వోట్లు వచ్చిన రతికను తిరిగి ప్రవేశపెట్టారు… బయటికి వెళ్లి, అందరి ఫీడ్ బ్యాక్ తీసుకుంది కాబట్టి కొంత అడ్వాంటేజ్ ఆమెకు.,. కానీ వచ్చాక నయా పెత్తందారు శివాజీ కాళ్లు మొక్కడం నచ్చలేదు…
చివరగా… మూడు గంటల షోలో అందరికన్నా ఎక్కువ యాక్టివ్, ఎనర్జిటిక్‌గా శోభాశెట్టి కనిపించింది… ఫన్, ఎమోషన్, డాన్స్, ఇన్వాల్వ్‌మెంట్, గెలవాలన్న తపన ఎట్సెట్రా అన్నీ కనిపించాయి ఆమెలో… కావాలని తెలుగు వెబ్‌సైట్లు ఆమె మీద ఎంత వ్యతిరేకతను పెంచే ప్రయత్నం చేస్తున్నా సరే ఆమె మరింత గట్టిగా నిలబడుతోంది ఆటలో…
మధ్యలో హౌజులోకి వచ్చిన అర్జున్ కూడా బెటర్… ఎక్కడా ఎనర్జీ డౌన్ కావడం లేదు, బ్యాలెన్స్ కోల్పోవడం లేదు… ఈసారి టీవీ రేటింగ్స్ బాగానే వస్తయ్ బిగ్‌బాస్ వీకెండ్ షోకు… అవునూ, ఈసారి కూడా పెద్దగా యాడ్ రెవిన్యూ లేదు కదా, మరెందుకు ఈ భారీ ఖర్చు..? దాదాపు ఫినాలే తరహాలో ఖర్చు చేశారు… హేమో… ఈసారి దాని పేరే ఉల్టా పుల్టా కదా…!!
Share this Article