అసలు నాగమణికంఠ అనే వెధవ… సారీ, మెంటల్ గాడిని బిగ్‌బాస్‌కు ఎంపిక చేయడమే తప్పు,.. సరే, బిగ్‌బాస్ ఈ సీజన్ ఎంపికలో ఉన్న దరిద్రాల్లో వాడొకడు… వాడు అనడానికి సందేహించడం లేదు… పక్కా ఎర్రగడ్డ కేసు వాడు…
వదిలేసిన పెళ్లాం మళ్లీ తన దగ్గరకు రావాలంటే తను బిగ్‌బాస్ గెలవాలట… గెలిస్తే పెళ్లాం, బిడ్డ వచ్చి వాడిని హత్తుకుపోతారట… రేయ్, ఎవడ్రా నువ్వు..? వాడితో ఏం గోక్కుంటే ఏం బాధో తెలియక అందరూ దూరదూరంగా, జాగ్రత్తగా మసలుతుంటారు… బిగ్‌బాస్ అనే వెధవను బండబూతులు తిట్టుకుంటూ…! ఇంత దరిద్రపు బిగ్‌బాస్ క్రియేటివ్ టీం ఇంతకుముందెప్పుడూ తెలుగులో లేదు…
ఏ జూనియరో, ఏ నానియో అయితే కాడి కింద పడేసి… ఒరేయ్ వెధవా, నువ్వూ నీ దరిద్రం గంగలో కలవండి అని వదిలేసేవాళ్లేమో గతంలో… కానీ నాగార్జున కదా… ఏ సోయీ ఉండదు… డబ్బులొస్తే చాలు… అది ఎన్ కన్వెన్షయినా సరే, బిగ్ బాసయినా సరే… ఓ నీతి, ఓ రీతి ఏమీ పట్టవు… అందుకే ఎన్ కన్వెన్షన్ కూలిపోతే ఒక్కడంటే ఒక్కడూ తనకు జాలి చూపలేదు… థూ, దీనెమ్మ జీవితం…
Ads
సరే, విషయానికొస్తే… ఆ మణికంఠ అనే మెంటల్ పేషెంట్ ఉన్నాడు కదా… అదిప్పుడు చికిత్సకూ లొంగదు ఇక… గతంలో యష్మిని హగ్ చేసుకుంటే చిరాకుపడింది, అసహ్యించుకుంది, దులపరించుకుంది ఓ పురుగులాగా… మరో కామ కేరక్టర్ పృథ్వి ఉన్నాడు కదా, హగ్గులతోనే బతికేయొచ్చు అనుకునే డర్టీ కేరక్టర్… వాడిని చూసి ఈ మణికంఠుడూ నేర్చుకున్నాడో… ఏమో, ఆ వెధవ బిగ్‌బాసే ఉసిగొల్పుతున్నాడో…
ఆల్రెడీ యష్మి ఓసారి వాడు హగ్ చేసుకుంటే… పురుగులాగా విదిల్చింది తెలుసు కదా… తప్పనిసరై నాగార్జున కన్‌ఫెషన్ రూమ్‌కి పిలిచి మందలించాడు… ఆ నాగార్జున మారడు, ఆ మణికంఠా మారడు… ఇప్పుడిక థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విలాగే వెనుక నుంచి అలుముకుంటున్నాడు… గట్టిగా… నయని పావని, రోహిణి… వాళ్లు ఏడుస్తున్నా సరే, వీడు వెళ్లి వెనుక నుంచి వాటేసుకుంటాడు… ఒరేయ్, యాణ్నుంచి వచ్చావురా నువ్వు..? మొత్తం సీజన్‌కు వీడొక దరిద్రం…
నిజానికి ఇదంతా బిగ్‌బాస్ అనే దరిద్రుడి నిర్వాకం… ఆల్రెడీ ఆకుల సోనియా తాలూకు విమర్శల ఎపిసోడ్లు చూస్తున్నాం కదా… ఇంత దరిద్రంగా తెలుగు బిగ్‌బాస్ గతంలో ఎప్పుడూ లేదు… (భలే ఫైట్ చేస్తోంది బిగ్‌బాస్ దరిద్రపు పోకడల మీద… ఎస్, ఆదిరెడ్డి సహా ఎవరినీ వదిలిపెట్టకు తల్లీ… గుడ్, స్పిరిట్…) ఆ మణికంఠను సపోర్ట్ చేసే ప్రేక్షకులే అసలు నిందితులు… సరే, మెగా చీఫ్ నబీల్ స్థానంలో మరో చీఫ్ కోసం ఏవేవో పిచ్చి టాస్కులు పెట్టారు… చివరకు హరితేజీ, మెహబూబ్ మిగిలారు…
తనను చీఫ్‌ను చేసిన టాస్కులో నబీల్ తీర్పు సందేహాస్పదం… ఎందుకంటే..? హరితేజ ఓ ప్లేటును మధ్యలో అడ్జస్ట్ చేసిందట… నబీలే చెప్పాడు, హరితేజ కూడా చివరలో అంగీకరించింది… కానీ అది గమనించినప్పుడే నబీల్ ఆమెను డిస్ క్వాలిఫై చేయాలి… చేయలేదు… చివరలో కూడా అంతే… ఆమె అన్ని ప్రాపర్టీలను ఒకదాని మీద ఒకటి పెట్టింది… కానీ అప్పటికి మెహబూబ్ ఒక ప్రాపర్టీ యూజ్ చేయనేలేదు… చేసే సమయానికి హరితేజ ప్రాపర్టీలన్నీ కిందపడిపోయాయి.., తరువాత మెహబూబ్ చివరి ప్లేటును వాడకుండానే అవి కిందపడిపోయాయి…
మరి ఎవరు విజేత..? పెద్ద చిక్కు ప్రశ్న… అసలు ఆ టాస్కులో ఎవరు ఎంత సేపట్లో ప్రాపర్టీని వాడేయాలనే ఆదేశం లేదు, సంచాలకుడిగా ఉన్న నబీల్‌కు ఆ సోయీ లేదు… ఫలితంగా మెహబూబ్ విజేత అయ్యాడు… సరే, హరితేజ కూడా నవ్వుతూ ఆ నిర్ణయాన్ని అంగీకరించింది… నాగార్జునకు ఇవన్నీ చూసి, అర్థం చేసుకుని, వీకెండ్‌లో ఎవరిని ఎలా మందలించాలో సోయి కూడా ఉండదు… సో, అది వోకే…
అయితే వోటింగులో అందరికన్నా సీత వీక్… నిజానికి ఓ సెక్షన్ ఆఫ్ మీడియా గతంలో శివాజీ అనే చిత్తభ్రముడిని మోసినట్టే ఇప్పుడు విష్ణుప్రియనూ మోస్తోంది… అదేం సామాజిక ప్రేమో… బిగ్‌బాస్‌కు ఈ తెలివి ఎలాగూ లేదు, కాకపోతే ఈ పుణ్యస్త్రీ ఆటలో ఉంటేనే… బిగ్‌బాస్ ఆట తాలూకు థ్రిల్ అనుకుంటుంది ఆ టీమ్… సో, విష్ణుప్రియను అలాగే ఉంచేసి, నువ్వు పులిహోరలు కలుపుకో తల్లీ అని చెప్పి… ఈమధ్య నిజంగానే వీక్ అయిపోయిన సీతను ఎలిమినేట్ చేస్తారేమో..!!
Share this Article