ఈసారి కంటెస్టెంట్ల ఎంపిక చెత్త… వైజాగ్, ఎర్రగడ్డ కేసుల్ని పట్టుకొచ్చారు, లెంపలేసుకుని, ఇక తప్పనిసరై పాత బిగ్‌బాస్ సీజన్ల పాత కాపుల్ని కొందర్ని పట్టుకొచ్చాడు… చివరకు అందులోనూ గౌతమ్ వంటి మెంటల్ కేసులే… ప్రత్యేకించి మణికంఠ గురించి చెప్పనక్కర్లేదు కదా…
మెంటల్ కేసులు అనే మాట కొందరికి నచ్చలేదు… అలాంటోళ్లు నిన్న పృథ్వి ధోరణి చూడాలి… పెద్ద మెంటల్ కేసు… తోడుగా మరో సైకిక్ నయని పావని… భలే కలిశార్రా మీరంతా… నిజానికి శేఖర్ బాషా, ఆకుల సోనియా, సీత, నైనికలు చాలా బెటర్… అభయ్ కూడా… సో, ఈ పిచ్చోళ్ల నడుమ ఉండలేని వాళ్లు ఎలిమినేట్ అయిపోతున్నారు… అదొక చిత్రం…
పృథ్వి గురించి కదా చెప్పుకునేది… వాళ్లతోవీళ్లతో పులిహోర కలపడం, సిగరెట్లు ఊదేయడం, పిచ్చి కూతలు తప్ప తను చేసిందేమీ లేదు… ఫన్ ఉండదు, ఎంటర్‌టెయిన్ చేయలేడు… ఇన్నిరోజులూ కొనసాగడమే ఓ విచిత్రం… నిన్న ప్రేరణ తనను నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది… ఎవరిని నామినేట్ చేయాలో, ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆమెకంటూ ఓ వాదన ఉంది… అదే చెప్పింది… దానికి నయనితో కలిసి పృథ్వి భీకరంగా టార్గెట్ చేశాడు ప్రేరణను…
Ads
ఇదేం ధోరణి..? ఇదేం పైత్యం..? ప్రేరణను ఎలాగైనా నామినేటయ్యేలా చేస్తాను అని పదే పదే టార్గెట్ చేసి, తనకు అనుకూలంగా బెదిరించి మరీ ఇతర హౌజ్‌మేట్లను లొంగదీసుకునే ప్రయత్నం… పిచ్చి లేచినట్టే వ్యవహరించాడు… అచ్చం తన తోకలా నయని… మునుపటి సీజన్‌లో త్వరగా ఎలిమినేట్ అయిపోయి ఆ సీజన్ బతికిపోయింది ఫాఫం…
అక్కడికి గంగవ్వ స్ట్రెయిట్‌గా పృథ్విని దులిపేసింది… హౌజులో నువ్వేం చేస్తున్నవ్..? ఆ సిగరెట్లు తాగడం తప్ప… నీకు తగ్గట్టుగా ఆ నయని… ఆటలో నాకు అసిస్టెంట్ అన్నారు ఆమెను, ఏదీ నాతో ఉన్నదెక్కడ..? అని ఇద్దరినీ కడిగేసింది… ఆ కోపమంతా ప్రేరణ మీద చూపిస్తున్నారు ఆ జంట… రెడిక్యులస్… గంగవ్వ చెప్పిన అంశాన్నీ కరెక్టే… కడుపులో ఉన్న నిజాల్నే కక్కేసింది ఆమె… ఫేక్ ఆట ఆమెకు చేతకాదు కదా…
చివరకు నిఖిల్, మణికంఠ తదితరులు కూడా ప్రేరణకు సపోర్ట్ నిలవలేదు… మొదట్లో అందరూ యష్మిని నెగెటివ్ ప్లేయర్ అని తూలనాడారు గానీ తనే నయం… ప్రేరణకు సపోర్టుగా నిలిచే ప్రయత్నం చేసింది… చివరకు ప్రేరణ కన్నీళ్లు పెట్టుకుంది… పృథ్వి మాత్రం ఆమె అంతు చూడాల్సిందే అన్నట్టుగా వ్యవహరిచాడు… తనను ఈసారి ఎలిమినేట్ చేస్తే హౌజుకు, ఆ టీమ్‌కు, ఆ నాగార్జునకు గౌరవం… నయనితోపాటు డబుల్ ఎలిమనేట్ చేస్తే మరీ మంచిది…
Share this Article