సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్… అంటే ఇమడగలవాడే నిలబడతాడు… బతుకుతాడు అని కదా డార్విన్ పరిణామ సిద్ధాంతం చెప్పేది… ఈసారి బిగ్‌బాస్‌లో ఈ కాన్సెప్టు తీసుకుని, దాని చుట్టే ఆటను నడిపిస్తున్నారు… అంటే హౌజులో ఉండాలంటే ఆడాలి, రంజింపచేయాలి, ఆట రక్తికట్టించాలి… లేకపోతే..?
మిమ్మల్ని తరిమేసి, కొత్తవాళ్లను వైల్డ్ కార్డు ఎంట్రీలుగా తీసుకొస్తాను అంటున్నాడు… 12 మంది రెడీ… అడ్డుకొండి చేతనైతే… మీరు గేమ్స్ గెలిస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీల సంఖ్య ఆమేరకు తగ్గిస్తాను అనేది ఛాలెంజ్… ఏవో గేమ్స్ పెడుతున్నాడు… నిజానికి నలుగురు మాత్రం రెడీ అయిపోయారు మిడ్ వీక్ ఎంట్రీకి…
వాళ్లూ ఈ షోకు పాత కాపులే… హరితేజ, అవినాష్, టేస్టీ తేజ, రోహిణి… వీళ్లెవరూ ఫినాలేలో పోటీపడినవాళ్లు కాదు గతంలో… కానీ ఆటను రక్తికట్టించినవారు, ఇప్పటికీ స్పాంటేనిటీ, ఎనర్జీతో ఆటలో కొత్త జోష్ తీసుకురాగలరు… ఒక్క టేస్టీ తేజ కాస్త సందేహం… కాకపోతే కాస్త కామెడీ సహాయకుడిగా ఉండగలడు అవినాష్‌కు…
Ads
నిజానికి హౌజులో ఇప్పుడున్న ఆటతీరు చూస్తుంటే… టోటల్ రాంగ్ సెలక్షన్స్, మెంటల్ కేసులు అనే విమర్శ మొదటి నుంచీ వస్తూనే ఉంది కదా… బేబక్క, అభయ్, సోనియా, శేఖర్ బాషా వెళ్లిపోయారు… ఉన్నవాళ్లలో కూడా ఒక్క నిఖిల్ మాత్రమే కూల్‌గా, ఓ స్ట్రాటజీతో, చురుకుగా కనిపిస్తున్నాడు… ఆటల్లో కూడా యాక్టివ్, మిగతావాళ్లందరికన్నా దూకుడు… ఆ ఒక్కడినీ ఉంచేసి మిగతా వాళ్లందరినీ పంపించేసి, మొత్తం నువ్వు చెప్పినట్టు 12 మందిని కొత్తగా తీసుకురా బిగ్‌బాస్ అనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి…
సోనియా తాలూకు నెగెటివిటీ కాస్త నిఖిల్ మీద ప్రసరించింది, అంతే తప్ప ఇప్పటికైతే తనే ప్రధానంగా కనిపిస్తున్నాడు… పోతూ పోతూ సోనియా అన్నదీ అదే… నిఖిల్ లేక హౌజులో ఏమీ లేదు అని..! నబిల్, కిరాక్ సీత, ఆదిత్య ఓం కూడా కాస్త పర్లేదు… హగ్ కింగ్ పృథ్వి కాస్త బెటర్… మణికంఠ రోజురోజుకూ విసుగెత్తిస్తున్నాడు… (ఏమో, గత సీజన్‌లో పల్లవి ప్రశాంత్ అనే కేరక్టర్‌ను ఏకంగా విజేతను చేశారు ప్రేక్షకులు, కొంపదీసి మణికంఠను కూడా అలాగే మోస్తారో ఏమో…)
చేజేతులా నోటిదురుసుతో చెడగొట్టుకున్నాడు గానీ అభయ్ హౌజులో ఉండాల్సింది… సడెన్ ట్విస్టుగా సోనియాను మళ్లీ తీసుకొస్తే కూడా ఆట రసవత్తరంగా ఉంటుంది… ప్రత్యేకించి సీత, నైనిక, యష్మి, విష్ణుల మొహాలు మాడిపోతాయి… ఎస్, ఆ షాక్‌లు, ఆ ట్విస్టులే కదా బిగ్‌బాస్‌కు కావల్సింది…!!
Share this Article