ప్చ్… లిమిట్ లెస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ అన్నారు కదా ఈసారి బిగ్‌బాస్ సీజన్.,. మిడ్ వీక్ ఎలిమినేషన్ అనీ మొన్న చెప్పాడు కదా నాగార్జున… ఇప్పుడున్న పది మందిలో ఒక మిడ్ వీక్, ఒక వీకెండ్ వెళ్లిపోతే మిగిలేది 8 మంది… వాళ్లూ హోప్ లెసే, ఒకరిద్దరు మినహా… మరెలా..?
కొత్త వాళ్ల ఎంపికలో ఫెయిల్… దొరికిందే 14 మంది… వాళ్లను ఏడు జంటలుగా… సరే, దోస్తులుగా బడ్డీలు పేరిట ప్రవేశపెట్టాడు… నెల రోజులైంది… రేటింగ్స పరంగా షో అస్సలు పైకి లేవడం లేదు… సోషల్ మీడియాలో నెటిజనం బూతులు అందుకున్నారు… అందుకే ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అనే యవ్వారం మొదలెట్టాడు…
మళ్లీ కొత్త వాళ్ల వేటలో గాకుండా… పాత వాళ్లను కొందరిని దువ్వి, హౌజులోకి తీసుకొస్తున్నాడు… నలుగురని కొందరు, కాదు, ఎనిమిది మంది అని కొందరు.,. ఓ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాడు… కాకపోతే ప్రస్తుత హౌజ్ మేట్స్‌లాగా తిక్క కేసుల్ని గాకుండా గత సీజన్లలో కాస్త చెప్పుకోదగిన ఆటతీరు చూపించిన వాళ్లను ప్రవేశపెట్టబోతున్నాడు…
Ads
సరే, ఇప్పుడొచ్చే రకరకాల వార్తల ప్రకారం… రాబోయే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎవరంటే… మెహబూబ్… నయని పావని… రోహిణి… హరి తేజ… టేస్టీ తేజ… అవినాష్… గంగవ్వ… గౌతమ్ కృష్ణ… మొత్తం ఎనిమిది మంది… నలుగురు మేల్, నలుగురు ఫిమేల్… వీళ్లను కూడా జంటలుగా ప్రవేశపెట్టడం దగ్గర సమస్య…
ఎందుకంటే… ఫస్ట్, గంగవ్వ… గతంలో ఆమెను హౌజులోకి ప్రవేశపెట్టారు గానీ, ఏసీ పడలేదు, ఆరోగ్యం సహకరించలేదు… పైగా హౌజ్ కల్చర్‌కు ఆమె సూట్ కాదు… సరే, పంపించేశారు… బిగ్‌బాస్ కొంత, నాగార్జున కొంత సాయం చేశారు, ఓ ఇల్లు కట్టుకుంది… సుఖంగా ఉంది… కొన్ని సినిమాల్లో కూడా చేసినట్టుంది… ఇప్పుడు తీసుకొస్తారట… కానీ జంట ఎవరు..?
ఎవరూ ఉండరు… సో, సోలో… మెహబూబ్… మంచి డాన్సర్… కానీ సరిగ్గా ఆడలేక మధ్యలో వచ్చేశాడు… సింగరేణి ముద్దుబిడ్డగా చెప్పుకున్న సోహెయిల్‌కు సంజ్ఙలతో నువ్వు వోటింగులో మూడో ప్లేసులో ఉన్నావురా అని చెప్పి, తను బిగ్‌బాస్ ఆఫర్ చేసిన డబ్బుతో ఫినాలే పోటీలోకి పోకుండా ఎస్కేపయిపోవడానికి మెహబూబ్ సహకరించాడనే విమర్శలొచ్చాాయి అప్పట్లో… హౌజులో ఒకరికొకరు ఫుల్లు సపోర్ట్… ఇప్పుడు నిఖిల్‌తో పడకపోవచ్చుగానీ నబిల్‌తో దోస్తీ కుదురుతుందేమో…
తనకు నయని పావనిని జత చేస్తారేమో… మరొకరు గౌతమ్ కృష్ణ తనకు నయని పావని గానీ, రోహిణి గానీ సెట్ కారు… తను కూడా సోలో తప్పదు… అలాగే అవినాష్… ఈటీవీ బాధితుడు… గతంలో బాగానే ఎంటర్‌టెయిన్ చేశాడు గానీ, పదే పదే నేను సూపర్ పర్‌ఫార్మర్ అని డప్పు కొట్టుకుని జనం వ్యతిరేకంగా కొట్టేసరికి ఫినాలే ఆశల్లో భంగపడి బయటికొచ్చేశాడు… తనకూ రోహిణి, హరితేజ సెట్ కారు, సో, అవినాషుడూ సోలో తప్పదు…
హరితేజ అప్పట్లో వోకే, కానీ ఇప్పుడు మరింత గలీజుగా మారిన హౌజ్ కల్చర్‌లో ఏమేరకు ఫిట్టవుతుందో చూడాలి… యాక్టివే… రోహిణి త్వరగానే హౌజు నుంచి బయటికొచ్చింది… తరువాత లేడీ కమెడియన్‌గా, సినిమాల్లో, టీవీ షోలలో బాగా రాణించింది… నిజానికి తను బిజీ, మరెలా ఇక్కడికి టైమ్ కేటాయిస్తుందో… తను బెటరే, పర్లేదు…
నయని పావని అప్పట్లోనే వెళ్లిపోయి, మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తిరిగి ప్రవేశించింది… ఇప్పుడు మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నమాట… పెద్దగా ప్రభావం చూపించలేకపోవచ్చు… కాకపోతే సంఖ్యాపరంగా మరొక అంకె… అంతే… ఎలాగూ నంబర్ పెరుగుతుంది కదా బిగ్‌బాస్… చకచకా రెండు వారాలు డబుల్ ఎలిమినేషన్‌తో కొందరిని వేగంగా బయటికి తోసేయండి…!!
Share this Article