మొదట హరితేజ… హరికథ చెప్పి అబ్సూస్ చేసింది… టాప్ ఫైవ్‌లోకి వెళ్లిపోయింది… కానీ సహజంగానే బిగ్‌బాసుడికి మేల్ వివక్ష కదా… యాంటీ నాచ్… యాంటీ ఫెమినిస్ట్… యాంటీ ఫిమేల్… యాంటీ ఎట్సెట్రా కదా… హరితేజను కూడా ఫైవ్ నుంచే ఇక నువ్వు వెళ్లిపో అని తరిమేశాడు…
గత సీజన్‌లో కావచ్చు, అవినాష్ ఏదో కామెడీగా జ్యోతిష్కం చెప్పే ఏదో పిచ్చి ప్రయత్నం చేశాడు గానీ… అస్సలు రక్తికట్టలేదు… అఫ్‌కోర్స్, మళ్లీ వస్తున్నాడు… నేను గొప్ప పర్‌ఫార్మర్‌ను అనే టూమచ్ అతిశయం…
నిజానికి ఒక హరికథో, ఒక జ్యోతిష్యమో స్పూఫ్ చేయాలన్నా, అనుకరించాలన్నా కాస్త కష్టం… లుక్కు కాదు, భాష, స్పాంటేనిటీ, హ్యూమర్ ముఖ్యం ఇలాంటి షోలలో… ఎవడూ కామెడీ చేయలేకపోతున్నాడు, సెలక్షన్స్ అన్నీ ఎదురుతన్నాయి అనే సోయి బిగ్‌బాస్ టీంకూ వచ్చినట్టుంది… తప్పదు కదా, తనే పరోక్షంగా ఆదేశాలు ఇస్తూ, పాటలు పాడిస్తూ, ఆడిస్తూ కథలు పడుతున్నాడు ఫాఫం…
Ads
అలాగే మణికంఠను జోస్యాలు చెప్పమన్నాడు… విచిత్రంగా ఆ మెంటల్ కేసు ఈ ఎపిసోడ్‌లో భలే నటించాడు… నవ్వించాడు… మాటిమాటికీ కన్నీళ్లు పెట్టుకుంటూ సింపతీ గేమ్ ఆడే కేరక్టర్ ఇలా మొదటిసారి కాస్త రక్తికట్టించే పర్‌ఫామెన్స్ చూపించాడు… (అవినాష్, హరితేజ, రోహిణి… మీ రాకలు అవసరమా..?) ఆల్రెడీ మణికంఠ అనే కమెడియన్ తయారయ్యాడు ఇక్కడ…
యష్మి మొదటి నుంచీ ఓ టిపికల్ కేరక్టర్… అరుస్తుంది, ఏదో వాగుతుంది… సబబా, బేసబబా జానేదేవ్… తిక్క కేసు… బిగ్‌బాసోడు లోపలకు రా అన్నాడు… హబ్బ, అదేనండీ కన్‌ఫెషన్ రూమ్‌లోకి… నిఖిల్‌కు ఇంటి నుంచి ఏదో గిఫ్ట్, మణికంఠకు భార్య నుంచి ఏదో గిఫ్ట్… మొదట నిఖిల్ వైపే మొగ్గు చూపింది… అదంతే, ఆ కేరక్టర్ అంతే కదా…
నిజానికి మణికంఠ వైవాహిక జీవితం బాగా డిస్టర్బ్‌డ్… ఆమె వదిలేసింది,… బిడ్డతో సహా వెళ్లిపోయింది… తను డిప్రెషన్‌లోకి… బిగ్‌బాస్ కప్పు గెలిస్తే వాళ్లు తన జీవితంలోకి వస్తారని ఓ పిచ్చి భ్రమ…. తన మెంటాలిటీ, మెంటల్ సిట్యుయేషన్‌లాగే… కానీ భార్య ఏదో కేక్, మెసేజ్ పంపించింది… నిజమో కాదో తెలియదు… కానీ మణికంఠ మెంటల్ సిట్యుయేషన్‌కు నిజానికి తనకే దక్కాలి…
ఒరేయ్, బిగ్‌బాస్ గెలిచిరా, మళ్లీ నువ్వు ప్రయోజకుడివే అని ఒప్పుకుంటాను, నీ ఇంటికి వస్తాను అని మెసేజ్ ఇచ్చిందా..? ఏమో… అన్నీ తిక్క కేసులే కదా… బిగ్‌బాస్ అంటేనే మెంటల్ బాస్..!! ఏం ట్విస్టులు ఇస్తున్నావురా నాయనా..!! గత సీజన్‌లో ఆ మెంటల్ కేసు పల్లవి ప్రశాంత్‌ను విజేతను చేసినట్టు ఈసారి మణికంఠను చేయరు కదా కొంపదీసి..!!
Share this Article