రీ లోడ్ అనీ… సీజన్ 8 2.0 అనీ… లిమిట్ లెస్ ఫన్ అనీ… ఎన్నిరకాల ఊదరగొట్టినా సరే బిగ్‌బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు పెద్ద జోష్ క్రియేట్ చేయలేకపోయాయి… ఒకవైపు నైనిక ఎలిమినేషన్, సాగనంపే కార్యక్రమం, వరుసగా కొత్త ఎంట్రీలు… వాళ్ల ఏవీలు, డాన్సులు… మరోవైపు సినిమా ప్రమోషన్లు… అంతా గందరగోళంగా సాగిపోయింది…
ఇదుగో ఇది చమక్కుమనిపించింది అని ఒక్క సీన్ కూడా లేదు… వచ్చేవారం టీఆర్పీల జాబితాలో చూడాలిక ఏమేరకు ఇది ప్రేక్షకుల్ని కనెక్టయిందో… ఇప్పటివరకు పెద్దగా ఈ షోకు టీఆర్పీలు లేవు… మొన్నటివారం బార్క్ రేటింగుల్లో సండే, సాటర్‌డే వీకెండ్ షోలు కూడా 5, 6 నడుమే ఉండిపోయాయి…
బిగ్‌బాస్ అంటేనే ఓ దిక్కుమాలిన రూల్స్ యవ్వారం కదా… కొత్త వాళ్లకు ఇమ్యూనిటీ అంటాడు, మరోవైపు ఇద్దరు నామినేషన్లలో ఉండాల్సిందే అంటాడు… గంగవ్వ, అవినాష్ కలిసి ఓ టాస్క్ గెలిచి ఇమ్యూనిటీ పొందినట్టు కూడా చూపించారు… తీరా నామినేషన్ల జాబితాలో గంగవ్వ వచ్చి చేరింది..? అలాగే మెహబూబ్ కూడా..! వాళ్లు కొత్తగా వచ్చారు కదా, సరే, ఏం కారణాలు చెప్పినా సరే, అవి కృతకమే… ఒకేరోజులో గంగవ్వను, మెహబూబ్‌ను ఏం అంచనా వేసినట్టు..?
Ads
సేమ్, కొత్తగా వచ్చిన వాళ్లకు ఈసారి నామినేట్ చేసే అవకాశం ఇవ్వకుండా ఉండాల్సింది… వాళ్లు వచ్చిన ఒకేరోజులో హౌజులో ఉన్నవారిని ఎలా అంచనా వేస్తారు..? టీవీల్లో చూస్తారు కాబట్టి అంచనా వేయిచ్చు అంటారా..? అదీ కరెక్టు కాదు… బిగ్‌బాస్ ఎడిట్ చేసి గంటసేపు ఫీడ్ ప్రసారం చేస్తాడు… అందులో కొందరిని కావాలనే బ్యాడ్‌గా ప్రొజెక్ట్ చేస్తాడు… సోనియా బుక్కయింది అలాగే కదా… పృథ్వి కూడా అదే అడిగాడు గంటసేపు ఫీడ్ మాత్రమే కదా మీరు చూసింది అనడిగాడు తనను ఎవరో నామినేట్ చేస్తే…
సో,.. కొత్త, పాత వాళ్ల నామినేషన్ల విధానం, ఆలోచన, అమలు తీరే దరిద్రం… స్థూలంగా గంగవ్వకు ఎందుకోగానీ ఓవర్ రేటింగ్ అనిపిస్తోంది… రూరల్ వ్యూయర్ షిప్ కోసం ఆమెను తీసుకొచ్చారేమో గానీ ఆమె హౌజులోని వాళ్లకు ఈక్వల్ కాదు… కాలేదు, తన వయస్సు సహకరించదు… ఈసారి విశేషం ఏమిటంటే… మణికంఠ నామినేషన్ జాబితాలో లేకపోవడం… తన సింపతీ గేమ్‌తో హౌజులో వాళ్లందరినీ చిర్రెక్కిస్తున్నాడు కాబట్టి ఈసారీ జాబితాలో ఉంటాడు అనుకుంటే… తను మాత్రం లేడు…
యష్మి, సీత నామినేషన్లలో ఉంటారని ఎక్స్‌పెక్ట్ చేసిందే… తోడుగా విష్ణుప్రియ, పృథ్వి కూడా ఉన్నారు… గంగవ్వ, మెహబూబ్‌లను ఏ కారణాలతో ఈ జాజితాలో చేర్చారో ఈరోజు ఆట చూస్తే గానీ తెలియదు… ఈరోజుకూ… స్థూలంగా ఆటను గమనిస్తే నిఖిల్ మాత్రమే టాప్ ప్లేయర్…!!
Share this Article