నిస్సారంగా… నీరసంగా… సాగుతున్న బిగ్‌బాస్ ఈసారి సీజన్‌లో కాస్త మెచ్చుకునే సందర్భం వస్తుందని అనుకోలేదు… దీపావళి స్పెషల్ సుదీర్ఘంగా గంటలకొద్దీ సాగింది… రక్తికట్టింది… దీపాల పండుగ సంబరం వెలిగింది…
సరే… క, లక్కీ భాస్కర్, అమరన్ సినిమా ప్రమోషన్లు వోకే… అనసూయ డాన్స్, మెహరీన్ డాన్స్ ఏమాత్రం బాగా లేవు గానీ… సాన్వి డాన్స్ మాత్రం కాస్త బెటర్… కంటెస్టెంట్లతో ఆడించిన ఆటలు బాగున్నాయి… అన్నింటికీ మించి సాయిపల్లవి రాక బాగుంది… హైపర్ ఆది పంచులు బాగానే పేలాయి…
ఈ సీజన్‌లో షో కాస్త రక్తికట్టడం ఇదే తొలిసారి… ఈ మూడున్నర గంటల పెద్ద ఎపిసోడ్ లో మొదట చెప్పాల్సింది సమీరా భరద్వాజ్… ఈ గాయకురాలు తనే కంటెస్టెంట్ల మీద పాటలు రాసి, కర్ణపేయంగా పాడింది… పాడటం కాదు ముఖ్యం… కాకపోతే ఒక్కో కంటెస్టెంట్ హౌజులోొ ఎలా ఆడుతున్నాడు, తనను చూడగానే ఏమనిపిస్తుందో చెబుతూ, పొగుడుతూ, కాస్త ఫన్ జనరేట్ చేస్తూ రాసిన తీరు బాగనిపించింది…
Ads
వాటిని సరైన సినిమా పాటల ట్యూన్లలో ఇరికించి, అదే ఫీల్‌తో పాడటం నచ్చింది… బాగుందమ్మా… ఆద్యంతమూ అలరించింది… లక్కీ భాస్కర్ హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి ఉన్న కాసేపు సరదాగా గడిపారు… క టీమ్ కూడా పర్లేదు…
అమరన్ సినిమా ప్రమోషన్ కోసం సాయిపల్లవితోపాటు శివకార్తికేయన్, దర్శకుడు రాజకుమార్ కూడా వచ్చారు… ట్రెయిలర్ కూడా బాగుంది… మేజర్ ముకుంద్ వరదరాజన్ సాహసం, ఆ ఫైట్, త్యాగమే గాకుండా… ఆర్మీలోకి పంపించిన తల్లి, భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని మిస్సయిన బిడ్డ… అన్నీ కలబోసినట్టున్నాడు దర్శకుడు… గుడ్…
ఈసారి సీజన్‌లో అస్సలు రేటింగ్స్ రావడం లేదు కదా… అందుకే కాస్త మనసు పెట్టి గేమ్స్, ఇతర హంగామా కోసం కష్టపడినట్టున్నారు… మొన్న దసరాకు డాన్సులు చేసిన అమృత, డింపుల్, ఫరియాల డాన్సుల్లాగే అనసూయ, సాన్వి, మెహరిన్ డాన్సులు కూడా పెద్ద ఆసక్తికరంగా లేవు… పండుగ స్పెషల్స్ షోలలో ఇలాంటి డాన్సులు అవాయిడ్ చేయడం బెటర్…
ఎలాగూ నాగార్జున వీకెండ్ షోకు రావడమే గ్రూప్ డాన్సులతో వస్తాడు… ప్రస్తుతం అలాంటివి ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడటం లేదు… కంటెస్టెంట్ల మధ్య ఫన్నీ గేమ్స్ మాత్రమే ఇష్టపడుతున్నారు… ఎలాగూ అవినాష్, రోహిణి, టేస్టీ తేజ, హరితేజ, విష్ణుప్రియ ఉన్నారు కదా… అఫ్‌కోర్స్, పృథ్వి, నిఖిల్, గౌతమ్, నబీల్ ఎట్సెట్రా మొహాల్లో ఏ ఎమోషన్సూ పలకవు, కామెడీ అస్సలు చేతకాదు… యష్మి, ప్రేరణ కాస్త బెటర్…
మెహబూబ్ వెళ్లిపోయాడు కదా… ఇక మళ్లీ రేపటి నుంచి నామినేషన్ల అరుపులు, పిచ్చి కేకలు, కూతలు… మళ్లీ వీకెండ్ దాకా బోర్…!!
Share this Article