మణికంఠ అనే మెంటల్ వెళ్లిపోయాడు… తనంతటతనే… ఇక గౌతమ్, పృథ్వి అలాగే ఉండిపోయారు… ఇద్దరూ ఇద్దరే… ఆవేశాన్ని ఆపుకోలేరు, అరుపులు, కేకలు… అలా చేస్తేనే జనం వోట్లుస్తారనే భ్రమలు కావచ్చు బహుశా…
నిజంగానే వాళ్లు నామినేషన్లలో ఉన్నాసరే జనం వోట్లేసి గట్టెక్కిస్తున్నారు కూడా..! మరి నేనేం తక్కువ, నేనూ అలాగే ఉంటాను అనుకున్నాడేమో టేస్టీ తేజ… తను వాళ్లను మించి ఓవరాక్షన్ చేస్తున్నాడు… కాదు, ఎక్కువ ఫూలిష్ వాదన కూడా కనిపించింది ఈసారి నామినేషన్ల సమయంలో…
మొన్నమొన్నటిదాకా విష్ణుప్రియను మోస్తూ… కన్నడ బ్యాచ్‌ను శాపనార్థాలు పెడుతూ… ఆ నలుగురు కన్నడ కంటెస్టెంట్ల మీద నెగెటివిటీని పెంచడానికి బాగా ప్రయత్నం చేస్తున్న సెక్షన్ ఇప్పుడు ఆమెను వదిలేసి, ఇక గౌతమ్ పల్లకీ మోయడం మొదలుపెట్టింది…
Ads
ఆ ప్రభావం వోట్లలో కూడా కనిపిస్తోంది… నిఖిల్, ప్రేరణ, యష్మి వెనకబడిపోయి గౌతమ్ టాప్‌లోకి వచ్చాడు… టేస్టీ తేజ విషయానికి వస్తే… మొన్న ఎవిక్షన్ షీల్డ్ టాస్కులో టేస్టీ తేజ చెత్తా ఆటను చూపించాడు… ఇద్దరు కంటెస్టెంట్లు మాట్లాడుకుని ఏకాభిప్రాయానికి వచ్చి, ఎవరినైనా తప్పించాలి… కానీ తేజ ఏం చేశాడు..?
యష్మి చెప్పింది వినిపించుకోకుండా వ్యవహరించాడు… అదేమంటే హౌజ్ అదే చెబుతోంది అని పిచ్చి కూతలకు దిగాడు… ఆ టాస్కులో హౌజ్ అభిప్రాయం అప్రస్తుతం, అక్కర్లేదు… కానీ అదే మూర్ఖపు వాదనకు కట్టుబడితే వీకెండ్ షోలో నాగార్జున మందలించాడు…
నీకోసం ఫ్యామిలీ వీక్‌లో ఎవరూ హౌజుకు రారు, నువ్వు వచ్చేవారం మెగాచీఫ్ పోటీలో ఉండలేవు అని శిక్ష కూడా విధించాడు… మళ్లీ ఇప్పుడు నామినేషన్ల సమయంలోనూ అదే గొడవ… నువ్వు ఆ టాస్కులో తప్పు చేశాడు అని నిఖిల్ తేజను నామినేట్ చేశాడు… దాంతో కోపాన్ని అణుచుకోలేకపోయాడు తేజ… ఆల్రెడీ అయిపోయిన ఇష్యూను ఎందుకు గెలుకుతున్నావ్ అని నిలదీయాల్సింది…
కానీ యష్మి కూడా తప్పు చేసింది కదా అనే వాదనకు దిగాడు… తప్పు, ఫస్ట్ తేజ తప్పు చేశాడు, తరువాత అనివార్యంగా ఆమె కూడా తను అనుకున్న కంటెస్టెంట్‌ను తప్పించాల్సి వచ్చింది… లేకపోతే తేజ వాదనను, చర్యను అంగీకరించినట్టు అవుతుంది కాబట్టి..! తేజ ఇదే మనసులో పెట్టుకుని యష్మిని నామినేట్ చేశాడు… ఆమెను వెక్కిరిస్తూ అరుపులు స్టార్ట్ చేశాడు…
నిఖిల్- తేజ ఎదురెదురుగా మొహాలు పెట్టుకుని అరుస్తున్న తీరు చిల్లరగా ఉంది… అదే చిరాకు పుట్టిస్తే మధ్యలో పృథ్వి కలగజేసుకుని, తనదైన శైలిలో తేజ మీదకు వచ్చాడు… అది మరీ చిల్లర… నేను కన్నడ బ్యాచ్‌తో తలపడుతున్నాను అని బయటికి కనిపించడం వల్ల తనకు బాగా వోట్లు పడతాయని అనుకుంటున్నాడేమో తేజ…
అది అన్నిసార్లూ ఫలిస్తుందని అనుకోవడం కరెక్టు కాదు… ప్రస్తుతం టాప్‌లో ఉన్నా సరే, గౌతమ్ ఓ దశలో ఎలిమినేషన్ అంచుల్లో నిల్చున్న సంగతిని మరిచిపోతే ఎలా తేజా..? ఎవరి స్థానాలు ఎటు మారతాయో చెప్పలేరు హౌజులో…
మంచి ఫన్ క్రియేట్ చేస్తూ… ఎంటర్‌టెయిన్ చేస్తున్న అవినాష్ కూడా నామినేషన్ల జాబితాలోకి వచ్చాడు… యష్మి సరేసరి, ఆమె ఎప్పుడూ నామినేషన్లలో ఉంటూనే ఉంది… ఈసారీ అంతే… గౌతమ్, విష్ణుప్రియ, పృథ్వి, తేజ కూడా ఉన్నారు ఇప్పుడు జాబితాలో… వీరిలో పృథ్వి, తేజలే బహుశా వోటర్ల టార్గెట్స్ అవుతారేమో..!!
Share this Article