.
ఈసారి బిగ్‌బాస్‌లో ఎలిమినేషన్ లేదు… ఎందుకు..? చాలా కారణాలున్నాయి…
శనివారం వీకెండ్ షో పరమ నీరసంగా సాగింది… బోర్… దీనికన్నా ఎప్పటిలాగే క్లాసులు పీకే ఎపిసోడ్‌లా నడిపిస్తే కాస్త నయంగా ఉండేదేమో…
Ads
యాంకర్ రవి పర్లేదు… భోలే ఎప్పటిలాగే తన మాట సరిగ్గా అర్థం కాదు… మధ్యమధ్యలో పాటబిడ్డను అంటాడు, ఏదేదో చెబుతాడు… శివాజీ కూడా అంతే కదా… తాను ఏదో ఎంటర్‌టెయినింగ్‌గా మాట్లాడుతున్నాను అనుకుంటాడు… తీరా చూస్తే ఏమీ ఉండదు… సోహైల్ కూడా ప్చ్…
పృథ్వి గరల్‌ఫ్రెండ్ కమ్ కోయాక్టర్ దర్శినిని తీసుకురావడం కాస్త బాగుంది… అంత మెంటల్ కేసు కదా, వరుసగా ప్రతిసారీ నామినేషన్లలో ఉంటాడు తను… ప్రతిసారీ జనం వోట్లేసి గెలిపిస్తారు తనను… అది విశేషమే…
నిజానికి నామినేషన్లలో ఉండాలి కంటెస్టెంట్, ఉంటేనే జనంతో కనెక్షన్ ఏర్పడుతుంది… వోట్లు పడుతూ ఉంటాయి… అవినాష్ అలా నామినేషన్లలో లేకపోవడమే దెబ్బతీసినట్టుంది… అందరికన్నా తక్కువ వోట్లు పడి, ఎలిమనేషన్ అంచుల్లో నిలుచుకున్నాడు… కానీ..?
నబీల్ తన దగ్గరున్న ఎవిక్షన్ షీల్డ్ అడ్డం పెట్టి అవినాష్‌ను రక్షించాడు, సో, ఈసారి ఎలిమినేషన్ లేదు… రేపు కూడా కొందరు కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ సోది వినాలి, సండే ఫండే కూడా బోర్ తప్పదన్నమాట…
ఇక్కడ రెండు అంశాలు… అవినాష్‌ను నబీల్ కాపాడటానికి ఓ రీజన్ ఉంది… అవినాష్ పలు సందర్భాల్లో నబీల్‌ను బలంగా సపోర్ట్ చేశాడు… అవినాష్ వల్లే ఆ ఎవిక్షన్ షీల్డ్ దక్కింది నబీల్‌కు… మరి తనకోసం ఉంచుకోకుండా ఆ ఎవిక్షన్ షీల్డ్‌ను అవినాష్ కోసం ఎందుకు వాడినట్టు..?
1) నబీల్ నిజాయితీ… అవినాష్ పట్ల కృతజ్ఞత… 2) ఈ వారమే వాడుకోవాలని బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టి ఉంటాడు… 3) అవినాష్‌ను బయటికి పంపడం బిగ్‌బాస్‌కు ఇష్టముండదు… సో, ఎలిమినేషన్ అంచుల్లో నిలబెట్టి, నబీల్‌తో షీల్డ్ ఇప్పించి, రక్షించే ఓ డ్రామాను బిగ్‌బాస్ నడిపించి ఉంటాడు… కథ రక్తికట్టడం కోసం…
ఎస్, అవినాష్ – రోహిణి లేకపోతే ఈసారి బిగ్‌బాస్ సీజన్‌కు ఈ అరకొర రేటింగ్స్ కూడా ఉండేవి కావు… ప్రత్యేకించి అవినాష్ టాస్కులు బాగా ఆడటమే కాదు… ఫుల్ టైమ్ షోలో ఎంటర్‌టెయిన్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు… ఆ అవినాష్ కూడా వెళ్లిపోతే షో ఒక్కసారిగా డౌన్ అయిపోతుంది… సో, రోహిణి, అవినాష్‌లను ఇప్పట్లో పంపించేది లేదు…
సో, ఏ కోణంలో చూసినా సరే, అవినాష్‌ను నబీల్ కాపాడటం అనివార్యమైపోయింది… ఎలాగూ మెగాచీఫ్ కాబట్టి ఈసారి నామినేషన్లలోకి రాడు… అటు నబీల్, ఇటు అవినాష్ ఇద్దరి గ్రాఫూ పెరుగుతుంది కాబట్టి… ఇద్దరూ టాప్ ఫైవ్‌లోకి వెళ్తారని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు…
మొదటి నుంచీ పర్‌ఫెక్ట్ గేమ్ ఆడుతున్న నిఖిల్, ఈమధ్య వోట్లు పెరిగిన గౌతమ్ కూడా టాప్ ఫైవ్‌లోకి చేరవచ్చు… మరి ఆ అయిదో వ్యక్తి ఎవరు..? బహుశా ప్రేరణ… ఏమో, యష్మి నుంచి కూడా పోటీ ఉండొచ్చు… రోహిణి, విష్ణుప్రియ, పృథ్విలకు మధ్యలోనే నిష్క్రమణ తప్పకపోవచ్చు… బట్, ఇది బిగ్‌బాస్… ఈ సమీకరణాలు చివరకు పూర్తిగా రివర్స్ అయిపోయినా ఆశ్చర్యం లేదు..!!
Share this Article