.
ఈసారి అన్నీ అడ్డదిడ్డం వ్యూహాలే… కంటెస్టెంట్లవి కావు… బిగ్‌బాస్ టీమ్‌వి..! కంటెస్టెంట్ల ఎంపిక సరిగ్గా లేదు, వాళ్లతో షో రక్తికట్టడం లేదు…
దాంతో గత సీజన్లలో కంటెస్టెంట్లుగా ఉన్నవాళ్లను పట్టుకొచ్చారు… పోనీ, వాళ్లతో ఏమైనా ఫాయిదా ఉంటుందా అంటే..? అలా వచ్చిన ఎనిమిది మందిలో సగం మంది అర్థంతరంగానే ఔట్… వాళ్లలో అవినాష్ మినహా మిగతా వాళ్లెవరూ ఫినాలే దాకా వచ్చినవాళ్లు కాదనుకుంటా…
Ads
హరితేజ, మెహబూబ్ గత సీజన్లలో కాస్త బెటరే… ఈ సీజన్‌లోకి వైల్డ్ ఎంట్రీ ఇచ్చి పెద్దగా క్లిక్ కాలేదు… గంగవ్వను మళ్లీ గత సీజన్లలోలాగే మధ్యలోనే పంపించేశారు… నయని పవని గత సీజన్ అంతే, ఈసారీ అంతే…
వారిలో మిగిలింది గౌతమ్, అవినాష్, టేస్టీ తేజ, రోహిణి… టేస్టీ తేజ ఓవరాక్షన్, ఫ్యామిలీ వీక్ ఏడుపులు చిరాకు పుట్టించాయి… అవినాష్, టేస్టీ తేజ కూడా ఎవిక్షన్ అంచుల్లో నిలబడ్డవాళ్లే… ఇక గౌతమ్ పృథ్వి అనే మెంటల్ కేసుకు కాపీగా మారాడు… రోహిణి మాత్రం లక్కీగా నెగ్గుకొస్తోంది… ఈసారి మరో ప్రయోగం… అది మరింత చిరాకు…
ఆల్రెడీ ఇదే సీజన్‌లో ఎవిక్టయిపోయిన వాళ్లను తీసుకొచ్చి, గ్రూపుగా ఆట ఆడుతున్న కన్నడ బ్యాచ్‌ను టార్గెట్ చేయించాడు… పక్కా బిగ్‌బాస్ స్క్రిప్ట్ ప్రకారమే వాళ్ల నామినేషన్లు, వాళ్ల వాదనలు… ఎంత నెగెటివిటీని సోషల్ మీడియా స్ప్రెడ్ చేస్తున్నా జనం వోట్లు వేస్తూనే ఉన్నారు… యష్మి, నిఖిల్, పృథ్వి, ప్రేరణలు గెలుస్తూనే ఉన్నారు… నిలబడి ఫైట్ ఇస్తూనే ఉన్నారు…
మరి వాళ్లనే బిగ్‌బాస్ టార్గెట్ చేయించడం ఏమిటో..? గ్రూపు ప్లే అనేది కూడా స్ట్రాటజీయే… వేరే కంటెస్టెంట్లకు గ్రూపులు కట్టడం చేతకాకపోవడం..! గత సీజన్లలో లేదా ఇది..? అంతెందుకు శోభాశెట్టి, అమరదీప్, ప్రియాంకలను సీరియల్స్ బ్యాచ్ అని ట్రోల్ చేయలేదా..? యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్ గ్రూపు కట్టలేదా..?
అన్నింటికీ మించి… తక్కువ వారాల్లోనే, ఆడటం చేతకాక ఎవిక్లయిపోయిన వాళ్లు… ఈరోజుకూ హౌజులో ఆటలో నిలబడినవాళ్లను జడ్జ్ చేసి, నామినేట్ చేయడం…! గతంలోనే చిరాకు పుట్టించిన అంశాల్నే మళ్లీ మళ్లీ తవ్వి గంటల తరబడీ వాదించడం… బేబక్క అయితే తను వెళ్లిపోయిన మొదటి వారం అంశాల్నే ప్రస్తావించి ఇప్పుడు ఆ పాత పెంట మొత్తం మళ్లీ తవ్వింది…
సోనియా వాదనలు సుదీర్ఘంగా చికాకు పుట్టించాయి… యష్మి ఫీలింగ్స్‌ను నిఖిల్ తోసిపుచ్చితే అదీ నామినేషన్‌కు ఓ కారణమా..? ఆటకు సంబంధించిన అంశమేముంది అందులో..? కావాలనే నిఖిల్‌ను టార్గెట్ చేయించడం వెనుక బిగ్‌బాస్ ఉద్దేశం ఏమిటో..? ఇంకెవరినైనా పైకి లేపే ప్రయత్నమో ఏమిటో..? శేఖర్ బాషా, ఆదిత్య ఓం వాదనలూ అలాగే… సోది…
రేటింగ్స్ రావడం లేదు అనుకుంటే వేరే భిన్న, కొత్త ప్రయోగాలు అవసరం… అంతేతప్ప జనం తిరస్కరించినవాళ్లను తీసుకొచ్చి, మళ్లీ పాత పంచాయితీల్ని తవ్వడం చికాకు యవ్వారం… అదే జరిగింది… సో, ఈసారి నామినేషన్ల పర్వం బోర్… బోరర్… బోరెస్టు…
అవినాష్‌కు ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వడం ద్వారా నబీల్ రెండుమూడు మెట్లు పైకి ఎక్కాడు… తను ప్రదర్శించిన కృతజ్ఞత తన పట్ల ఆదరణను పెంచేదే… తను ఏ గ్రూపులోనూ లేడు… తన ఆట తనది… ఎటొచ్చీ బిగ్‌బాస్, నాగార్జున మొదటి నుంచీ మోస్తున్న విష్ణుప్రియ మాత్రం షోలో ఓ ఉత్సవవిగ్రహంలా నిలబడిపోయింది…!!
Share this Article