ఏవో పాత సీజన్లలో హరికథలు చెప్పి పాపులర్ కావచ్చుగాక… కానీ ఇప్పుడు మెంటల్ కేసుల నడుమ కట్ థ్రోట్ పోటీ… ఏ కథలూ చెల్లవు… హరితేజకు అది అర్థం కాలేదు… అడ్డంగా బుక్కయిపోయింది… అఫ్‌కోర్స్, జనం వోట్లేస్తారేమో, హౌజులో కొనసాగుతుందేమో గానీ… భలే షాక్ ఇచ్చాడు అవినాష్…
అసలు డిసైడింగ్ హ్యాట్ తను చేజిక్కించుకోలేదు… ఎవరో అందుకుని, ఆమెకు ఇస్తే… ఏవో పిచ్చి కారణాలతో నిర్ణయాలు తీసుకుంది… ఫలితం వెంటనే అనుభవించింది… గతంలో గంగవ్వ, అవినాష్ కలిసి గెలుచుకున్న ఇమ్యూనిటీ షీల్డ్ ఉపయోగించుకుని, అవినాష్ తను నామినేషన్ల నుంచి బయటపడటమే గాకుండా… పృథ్వి అనే మెంటల్ కేసు తనను నామినేట్ చేస్తే, సమర్థించిన హరితేజనే అడ్డంగా ‘స్వాపింగ్’ చాన్స్ కింద బుక్ చేశాడు…
ఎస్… ఖచ్చితంగా హౌజులో పృథ్వి, నయని పావని ఉండకూడని కేరక్టర్లు… అవినాష్ అభ్యంతరపెడుతున్నా సరే… రా అంటూ, వీడు అంటూ, బరాబర్ అలాగే అంటాను అంటూ పృథ్వి ఓ సైకోలాగే బిహేవ్ చేశాడు… తన మాట, బాడీ లాంగ్వేజీ అన్నీ చెత్త ధోరణి… లాంగ్వేజ్ ప్రాబ్లం అని ఎవరో డిఫెండ్ చేయబోయారు కానీ… రేయ్ అనకు, వాడు అనకు అని అవినాష్ చెబుతున్నా సరే, అలాగే అంటాను అని పృథ్వి రెచ్చిపోయాడు… అంటే ఉద్దేశపూర్వకంగానే అన్నాడు అని అర్థం…
Ads
అఫ్‌కోర్స్, బిగ్‌బాస్ చెత్తా గేమ్ ధోరణిని బట్టి పృథ్విని కాపాడుతాడేమో… మరి పులిహోర కలిపే కేరక్టర్ ఒకడు ఉండాలిగా… ఇలాంటి పోకడలు పెరుగుతున్నందునే జూనియర్, నాని ఈ హోస్టింగు నుంచి తప్పుకున్నారు… మీకో దండంరా బాబూ అన్నారు… ది గ్రేట్ కింగ్ నాగార్జున మాత్రం దిక్కుమాలిన బిగ్‌బాస్ రాసిచ్చే స్క్రిప్టును చదువుతూ, నటిస్తూ… పరువు తీసుకుంటున్నాడు…
అవినాష్ చెప్పింది నిజాయితీగానే ఉంది… నేను మొత్తం ఎపిసోడ్లు చూడలేదు, నా వైఫ్ చెప్పిన కొన్ని పాయింట్లు మనసులో పెట్టుకున్నాను అని… దానికి పృథ్వి అనే పిచ్చోడు ‘మరి నీ వైఫ్‌నే పంపాల్సింది’ అనే చెత్తా కామెంట్ చేశాడు… డర్టీ కేరక్టర్ వాడు… దానికి నయనిపావని అనే మరో చెత్త కేరక్టర్ తోడు… అందరూ కలిసి ప్రేరణను బుక్ చేయాలని టార్గెట్ చేస్తే… చివరకు అదే పృథ్వి… పరోక్షంగా సహకరించిన అదే హరితేజ బుక్కయ్యారు… అంటే నామినేషన్ జాబితాలో చేరారు…
ఇంకేముంది..? చేసేయండ్రా… నైనిక, సీత, సోనియాలను పంపించేశారుగా… ప్రేరణనూ పంపించేయండి… ఇదే హరితేజలు, ఇదే పృథ్విలు, ఇదే నయనిపావనిలతో ఆట కొనసాగించండి… అందుకే రేటింగ్స్ దరిద్రంగా నమోదవుతున్నాయి… మీ దుంపతెగ… ఈ వారం మాత్రం గుడ్ అవినాష్… యు ఆర్ రైట్…!
Share this Article