.
బిగ్‌బాస్ హౌజులో ఈసారి చాలామంది ఎర్రగడ్డ కేరక్టర్లు ఉన్నారని పదే పదే చెప్పుకున్నాం కదా… ఏక్‌సేఏక్… ప్రత్యేకించి నామినేషన్ల సందర్భంలో మరీ కుక్కల కొట్లాట అయిపోతోంది…
మణికంఠ తరహా కేరక్టర్లు వెళ్లిపోయారు గానీ… తన ఛాయలు ఇంకా హౌజులోనే తచ్చాడుతున్నాయి… ఒక పృథ్వి, ఒక గౌతమ్… మరీ మరీ చెప్పుకోదగిన కేరక్టర్లు…
Ads
ఫస్ట్ నుంచీ పృథ్వి పోకడ చెప్పుకుంటూనే ఉన్నాం కదా… గౌతమ్ తనకు తాత అనిపిస్తున్నాడు… ఒక దశలో తనకు టాప్ వోట్లు పడ్డాయి అంటేనే ఆశ్చర్యం వేస్తోంది…
ఈరోజు నామినేషన్లనే తీసుకుందాం… తనేం మాట్లాడుతున్నాడో తనకే తెలియదు… అరుస్తాడు, కేకలు వేస్తాడు… ఓసారి ప్రేరణను ఉద్దేశించి అమ్మా తల్లీ బేబీ అంటాడు… అంతకుముందు తనే కదా వెక్కిరింపుగా తోటి కంటెస్టెంట్లను అక్కా అని పిలిచిన తీరు కూడా గతంలో చెప్పుకున్నదే…
అక్కా అంటే తన దృష్టిలో వెక్కిరింపు… ఇదేమి తమ్మీ, ఇదేమి బ్రో అని ఇతర కంటెస్టెంట్లు ప్రతిగా కౌంటర్ వేస్తే తనకు తప్పు… అదేమంటే అక్కా అనేది తెలంగాణ స్లాంగ్ అంటాడు… పిచ్చి గౌతమ్, అక్కా అంటే తెలుగు భాషలో అక్క, సోదరి, ఓ గౌరవనీయమైన, ప్రేమపూర్వక పలకరింపు, పదం… నీ అజ్ఞానాన్ని తెలంగాణ యాసకు ఎందుకు రుద్దుతావు..?
ఈరోజు కూడా అంతే… బేబీ అంటే తప్పులేదట… తను పలికిందే వెక్కిరింపుగా… అదేమని ప్రేరణ గట్టిగా అడిగితే… ఎవరు నీకు బేబీ అనడిగితే… మగాళ్లను బాబు అన్నట్టే ఆడవాళ్లను బేబీ అంటారు తప్పేముంది అంటాడు…
ఇదేకాదు, ఏ కంటెస్టెంట్ తనను నామినేషన్ చేసినా సరే అలాగే పిచ్చి పిచ్చిగా డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో ఏదో అర్థం కాని వాదనతో కేకలు వేస్తాడు… పరమ చిరాకెత్తించే కేరక్టర్… పేరుకు అశ్వత్థామ 2.0 అట, ఇప్పుడు అశ్వత్థామ 3.0 అట…. ఇదుగో ఈ ధోరణులతోనే బిగ్‌బాస్ రేటింగ్స్ ఇంత అధ్వానంగా ఉన్నాయి…
తను చెబుతూనే ఉంటాడు, ఎదుటోడు చెప్పింది వినడు… మొన్న నాగార్జున వీకెండ్ షోలో కూడా నాగార్జున మాట్లాడుతుంటే కూడా తను ఏదేదో చెబుతుంటాడు… వాదనలో లాజిక్ ఉండదు… చివరకు నాగార్జున కూడా నేను మాట్లాడుతుంటే షటప్ ఐసే అని మందలించాడు… ఐనా తను మారడం లేదు… బిగ్‌బాస్‌లో డెమొక్రసీ లేదా అంటాడు తనే మరోసారి…
ప్రేరణ చీర నచ్చలేదు అంటాడు, అదేమంటే నేను ఇక్కడ ఉండటం నీకు నచ్చకపోతే, నీ చీర నాకు నచ్చలేదు అంటాడు… పక్కా ఎర్రగడ్డ కేసు… హౌజులో తను గాకుండా ఉన్న ఎనిమిది మందికి గాను నలుగురు తనను నామినేట్ చేశారు… అదీ తన ధోరణికి రిజల్ట్… (విష్ణును ఐదుగురు నామినేట్ చేశారు…)
నామినేషన్లలో నబీల్ మాట్లాడిన తీరు కూడా అస్సలు బాగాలేదు… గౌతమ్ ఇన్‌ఫ్లుయెన్స్ పడినట్టుంది… చివరకు ఆ గౌతమ్ కూడా ఆశ్చర్యపోయాడు… తను ఇన్నాళ్ళూ చూస్తున్న మనిషేనా… కొత్త నబీలా..!! ఈసారి మొత్తానికి రోహిణి (చీఫ్ కాబట్టి ఇమ్యూనిటీ) తప్ప మిగతా అందరూ నామినేషన్లలో ఉన్నారు…
ప్రస్తుతానికి తను ఓ హోప్‌లెస్… మిగతా ఎనిమిది మందిలో నిఖిల్, నబీల్ కంపల్సరీ టాప్ ఫైవ్‌లో ఉంటారు… ప్రేరణకు కూడా చాన్స్ ఉంది… మిగతా ఇద్దరు బహుశా అవినాష్, రోహిణి ఉంటారేమో… తేజ, విష్ణు, పృథ్విలకు అంత సీన్ కనిపించడం లేదు…!!
Share this Article