.
నిజంగానే… బిగ్‌బాస్ హౌజ్ అనేది ఓ పద్మవ్యూహం… అనుకున్నంత వీజీ కాదు చేధించడం… అఫ్‌కోర్స్, ఆ టీమ్ పైత్యాలు చాలా పనిచేస్తాయి కానీ… అంతిమంగా గెలిచేది మాత్రం వ్యక్తిగతంగా కంటెస్టెంట్ స్ట్రాటజీ… ప్రేక్షకుల ఆదరణ…
ఐనాసరే, ప్రేక్షకుల ఆదరణకూ కొన్ని వికారాలు ఉంటాయి… ఎవడైతే దూకుడుగా, భిన్నంగా, అమర్యాదకరంగా ఉంటాడో వాడినే ఆదరిస్తారు ప్రేక్షకులు… మరి బిగ్‌బాస్ పైత్యానికి ఏమాత్రం తీసిపోనిది కదా ప్రేక్షకుడి పైత్యం కూడా…
Ads
గత సీజన్ చూశాం కదా… పల్లవి ప్రశాంత్… లిటరల్లీ అన్‌ఫిట్ ఫర్ ఎనీథింగ్… కానీ ఏం జరిగింది..? శివాాజీ అనే ఓ వేస్ట్ కేరక్టర్ సాయంతో గెలిచాడు… తన ఫ్యాన్స్ అట… ప్రత్యర్థి కంటెస్టెంట్ల కార్లపై దాడులు, కేసులు, అరెస్టు… చివరకు ఓ ఫేక్ రైతు బిడ్డగా మిగిలిపోయాడు…
ఈసారీ అంతే గౌతమ్ ఓ యారొగెంట్… తనకు పది రెట్లు ఎక్కువ పృథ్వి… ఇద్దరూ సేవ్ అవుతూనే ఉంటారు… విష్ణుప్రియ పరమ వేస్ట్… ఐనా జనం గెలిపిస్తూనే ఉంటారు… మొన్నటిదాకా యష్మి కూడా అంతే… ఫుల్ నెగెటివ్… తనూ మొన్నటిదాాకా గెలుస్తూ వచ్చింది…
వాళ్లందరినీ చూసి నోబుల్‌గా ఉండే నబీల్ చెడిపోయాడు… గతి తప్పాడు… చివరకు నిన్న ఫినాలే టికెట్ టాస్కులో దెబ్బతిని చివరకు బ్లాక్ బ్యాడ్జి పొందాడు… ఎవరైతే ఆఫ్టరాల్ కమెడియన్లు అని ఈసడించుకున్నారో వాళ్లలో రోహిణి ఒక కంటెండర్ అయిపోయింది రెండు టాస్కులు గెలిచి…
ఇప్పుడు అవినాష్ గెలిచాడు… ఇద్దరూ హౌజులో ఫన్ జనరేట్ చేస్తున్నారు… యాక్టివ్… చీఫ్‌లు అవుతున్నారు… ఇప్పుడు ఫినాలే కంటెండర్లు కూడా అయ్యారు… ఏమీ చేతకాని విష్ణుప్రియ, నబీల్ బ్లాక్ బ్యాడ్జిలు పొందారు…
ఒక దశలో అవినాష్ ఎవిక్షన్ అంచుల్లో నిలబడ్డాడు… రోహిణి, తను వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… ఐతేనేం… ఇప్పటిదాకా బలంగా నిలబడ్డారు… అదే నిఖిల్, నబీల్, విష్ణుప్రియ, పృథ్వి, యష్మి తదితరులు ఫుల్లు నెగెటివిటీని మూటగట్టుకున్నారు… అదీ తేడా… అదే ఆట… వ్యక్తుల తత్వాలకు అది ఓ పరీక్ష…
ఉంటయ్, బిగ్‌బాస్ పైత్యాలు ఉంటయ్… పోటీదారుల స్ట్రాటజీలు ఉంటయ్… ప్రేక్షకుల వోట్ల పరీక్ష ఉంటుంది… అన్నీ దాటేసి గెలిస్తేనే కదా మజా… ఒకడు గ్రూపు పోటీ ఏంటీ అంటాడు… కానీ అదీ ఆటలో, ఎత్తుగడలో భాగమే… అది తనకు తెలియదు… అక్కడే గౌతమ్ పప్పులో కాలేశాడు…
ఉంటయ్, ఆట అంటేనే స్ట్రాటజీ… కులం వాడతారా..? మతం వాడతారా..? ప్రాంతం వాడతారా..? వ్యక్తిగత లవ్వు వాడతారా..? భాష వాడతారా..? అవన్నీ స్ట్రాటజీలే… అవి చేధించేవాడే మొనగాడు… అవన్నీ దాటేసి నిలిచేవాడే విజేత… అదే బిగ్‌బాస్ ఆట… అది అర్థమైంది కాబట్టే నిఖిల్, ప్రేరణ, రోహిణి నిలబడ్డారు..!!
Share this Article