Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ చిన్న తప్పు ఆటనే మార్చేస్తుంది… జీవితమైనా… బిగ్‌బాస్ ఆటయినా…

October 18, 2024 by M S R

ఒక తప్పుటడుగు… ఒక తప్పుడు అంచనా… మొత్తం గేమ్‌ను మార్చేస్తుంది… నిజ జీవితంలోనైనా అంతే, బిగ్‌బాస్ ఆటలోనైనా అంతే… అదే జరిగింది… నిజానికి మణికంఠ ఓ మెంటల్ కేసు… కానీ రోజులు గడిచేకొద్దీ మారాడు, మెచ్యూరిటీ కనిపిస్తోంది… అంటే, మొదట్లో ఫ్యామిలీ ఇష్యూస్ చెప్పి, సింపతీ గేమ్ ఆడాడని లెక్క…

మొన్న అవినాష్ అండ్ కో తనను కరప్ట్ చేయాలని చూశారు, కానీ మణికంఠ నిజాయితీగా తను కోవర్టుగా మారలేనని తిరస్కరించాడు… ఈరోజు గేమ్‌లో కూడా అంతే… తను, గౌతమ్ ముందే మాట్లాడుకున్నామని చెబుతూ మెగా చీఫ్ బరి నుంచి గౌతమ్‌ను తనే తప్పించే చాన్స్ వచ్చినా వాడుకోలేదు… తను నిజాయితీగా ఉన్నాడు… కానీ గౌతమ్ మరో మెంటల్ కేసు కదా… ప్లేటు తిప్పాడు…

చివరకు ఏమైంది..? ఇదే మణికంఠ బరి నుంచి దూరమయ్యాడు… అదే గౌతమ్ చాన్స్ వాడుకుని, ఒక్కొక్క బలమైన పోటీదారుడిని పక్కకు తప్పిస్తూ, అంతిమంగా తనే మెగా చీఫ్ అయ్యాడు… నిజానికి తన అగ్రెసివ్, దూకుడు, మెంటల్ ధోరణితో చిరాకెత్తిస్తున్నాడు హౌజులో… కానీ తనే ఇప్పుడు ఆ బిగ్‌బాస్ క్లాసుకు ‘పెబ్బ’ అయిపోయాడు… ఇదే ఆటలో ట్విస్టులు అంటే…

Ads

ఏవో ఛార్జింగులు, పాయింట్లు… కుషన్ పోటీలు… మన్నూమశానం అన్నీ పోయి… చివరకు మెగా చీఫ్ కంటెండర్‌గా ఫస్టే ఎంపికైన గంగవ్వ కూడా అందరితో పాటు మెగా చీఫ్ బరిలో కుస్తీ పట్టాల్సి వచ్చింది… వీళ్లతో పోటీ ఆమెతో అవుతుందా..? బిగ్‌బాస్ కోణంలో అన్ ఫెయిర్ గేమ్… అంతిమంగా అందరూ మెగాచీఫ్ ‘బొక్క మార్క్’ బరిలో నిలబడే స్థితి వచ్చినప్పుడు… మరిక రకరకాల టాస్కుల్లో గెలుపూ ఓటములకు అర్థమేముంది..?

ఒక అవకాశాన్ని పృథ్వి కోల్పోయాడు… అవినాష్ అందుకున్నాడు… ఏమీలేదు… బిగ్‌బాస్ చెప్పినట్టు జుట్టు కత్తిరించుకోవాలి… పృథ్వికి మానసిక వైకల్యమే తప్ప ఆలోచన, విచక్షణ అంటూ ఏడిస్తే కదా… అవినాష్ ఎంచక్కా వాడుకున్నాడు… ప్రేక్షకుల్లో మంచి మార్కులు సంపాదించుకున్నాడు… అదే బిగ్‌బాస్ ఆట తీరు… అది అర్థమైనవాడే నాలుగు వారాలు పదిలంగా ఉంటాడు… అది నిఖిల్‌కు తెలుసు, పృథ్వికి తెలియదు… అంతే తేడా…

నిజంగా మణికంఠ గనుక నిజాయితీకి కట్టుబడి ఉండకపోతే… తనే మెగా చీఫ్ అయ్యే సిట్యుయేషన్ వచ్చేదేమో… ప్చ్, దెబ్బతిన్నాడు… వోటింగులో హరితేజ, పృథ్వి, టేస్టీ తేజ మరీ దిగువ స్థానాల్లో ఉన్నారు… సో, ఎవరో ఒకరు ఔట్… ఏ కోణం నుంచి చూసినా సరే, పృథ్వి బయటికి వెళ్లడమే ఉత్తమం. ఉత్త హోప్ లెస్ కేసు… అన్నట్టు… మెహబూబ్ చెబుతున్నట్టు నబీల్‌కు కమ్యూనిటీ వోటింగు పెద్దగా ఉపయోగపడుతున్నట్టు లేదు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…
  • వాము మంచిదే కానీ జాగ్రత్త, రెచ్చిపోకండి… మసాలా దినుసుల్లో మహారాణి…
  • సీతారామశాస్త్రి రాసిన చరణాల్ని కూడా… బేసబబు అని బాలు మార్చేశాడు..!!
  • *నువ్వు లేకపోతే ఈ లోకం ఏమీ ఆగిపోదు… పిచ్చి భ్రమల్లో బతకొద్దు…*
  • జపాన్ దేశం ఉనికికే ముప్పు..? ఆమె జోస్యంతో భారీ భయ ప్రకంపనలు..!!
  • చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కనిపించుట లేదు… విధుల్లో లేడు, దింపేశారా..?
  • తెలంగాణ సీఎం ఎవరు..? అసలు ఈ మీనాక్షి నటరాజన్ ఎవరు..?
  • పోక్సో కేసులో లంచంగా ఆరు సమోసాలు… పోలీసుల ఇజ్జత్ తీసేశాడు…
  • మేజిక్ + హిప్నాటిజం + రచన + బోధన+ సైకాలజీ + కౌన్సెలింగ్… వాట్ నాట్..?
  • ఓ ప్రియురాలి పాదయాత్ర..! ప్రేమ + భక్తి + విశ్వాసం + వ్యక్తీకరణ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions