.
‘‘BB9Telugu..! ఫాఫం కింగ్ నాగార్జునకే అగ్నిపరీక్ష… నో బజ్, నో వ్యూయర్స్…’’ సరిగ్గా ఇదే ‘ముచ్చట’ ఈ నిస్సారమైన సీజన్ లాంచింగు తరువాత రాసిన కథనానికి పెట్టిన హెడింగ్… అది అక్షరాలా ఈసారి రేటింగ్సులో కనిపించింది… బిగ్‌బాస్ క్రియేటివ్ టీమ్ మొహాలన్నీ మాడిపోయేలా…
ఆ లాంచింగు ఎంత నిస్సారంగా సాగిందీ అంటే… చాలామంది బిగ్‌బాస్ షో ప్రేమికులు సైతం వేరే చానెళ్లలో ఇంకేవో ప్రోగ్రామ్స్ వైపు వెళ్లిపోయారు… అసలు కామనర్స్‌కు అగ్నిపరీక్షల పేరిట నిర్వహించిన పైత్యపు పరీక్షలే ఈ సీజన్ మీద ఆసక్తిని సగం దెబ్బతీశాయి…
Ads
పైగా లాంచింగ్‌లో మరీ నవదీప్, శ్రీముఖి తదితరులతో ఫైనల్ కామనర్స్‌ను ఎంపిక చేయించడం… పెద్దగా రక్తికట్టే వినోదాంశాలు, డాన్సులు, పెద్ద గెస్టులు గట్రా లేకపోవడం… ఈసారి సెలబ్రిటీల్లో కూడా పెద్ద పేరున్న వాళ్లు గాకుండా, వివాదాస్పద కేరక్టర్లను ఎంపిక చేయడం… వెరసి కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్టుగా… చివరకు బిగ్‌బాస్ 9 సీజన్ లాంచింగ్ రేటింగ్ సాధనలో కుప్పకూలిపోయింది…
‘చదరంగం కాదు, ఇక రణరంగం’ అనేది కదా ఈసారి సీజన్ నినాదం… రణరంగం కాదు, దారుణరంగం… ఇదీ రియాలిటీ… ఈసారి గ్రాండ్ లాంచింగుకు వచ్చిన రేటింగ్స్ జస్ట్ 9.07 మాత్రమే… ఇది మొత్తం 9 సీజన్ల లాంచింగ్ రేటింగుల్లో రెండో డిజాస్టర్ రేటింగ్స్… గత 8వ సీజన్ రేటింగ్ 18.9 తో పోలిస్తే ఇది సగం కూడా లేదు… ఫాఫం…
ఎన్టీఆర్ హోస్ట్‌గా వచ్చిన మొదటి సీజన్‌కి 16.18… నాని హెస్ట్ చేసిన రెండో సీజన్ 15.05 రేటింగ్ సొంతం చేసుకుంది. ఆ తరువాత నుంచి వరుసగా నాగార్జున హోస్ట్ … మూడో సీజన్ 17.9… నాలుగో సీజన్ 18.5… ఐదో సీజన్ 18 రేటింగ్ సాధించింది. అయితే ఆరో సీజన్ 8.86 రేటింగ్ సాధించడంతో అన్ని సీజన్లకంటే ది వరస్ట్ సీజన్ అయ్యింది…
ఇదే ప్రశ్న నాగార్జునకు ఏదో ఫంక్షన్‌లో ఎదురైతే… టీవీల నుంచి ప్రేక్షకులు ఓటీటీలకు షిఫ్టవుతున్నారు కదా, అందుకే రేటింగ్ డౌన్ అని ఏదో విఫల సమర్థనకు దిగాడు… కానీ తప్పు… అదే నిజమైతే మరి సీజన్6 తరువాత 7వ సీజన్ 18.10… 8వ సీజన్ 18.90 రేటింగ్ ఎలా సాధించాయి… సో, నాగార్జున విశ్లేషణ తప్పు… ఆ సీజన్6 దారుణ వైఫల్యమే ఇప్పుడు కూడా… దాదాపు సేమ్ రేటింగ్స్…
రెండేసి హౌజులు, కామనర్లకు పెద్దపీట వంటి అంశాలు ఏవీ ప్రేక్షకులకు కనెక్ట్ కావడం లేదు… హరిత హరీష్ అనే కేరక్టర్ ఒక్కటి చాలు, ఈ సీజన్ ఫ్లాప్‌గా కొనసాగడానికి..? ఆ మనిషిని ఈ షోకు ఎంపిక చేసిన జడ్జి ఎవరో గానీ… నాగార్జున, బిగ్‌బాస్ టీమ్, స్టార్ మా చానెల్ ఎప్పుడూ మరిచిపోలేని ఫ్లాప్‌ను ఇవ్వబోతున్నాడు ఈ సీజన్‌కు..!
Share this Article