Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అగ్నిపరీక్ష ఓ చెత్త తంతు… 3 గంటల లాంచింగే జీరో జోష్ నాగార్జునా…

September 8, 2025 by Rishi

.

నిజానికి బిగ్‌బాస్ మీద ఈసారి పెద్ద ఆసక్తి ఏమీ లేదు ఎవరికీ… గత రెండుమూడు సీజన్లను భ్రష్టుపట్టించారు… రేటింగ్స్ దారుణంగా వచ్చాయి… బిగ్‌బాట్ క్రియేటివ్ టీమ్స్ అట్టర్ ఫ్లాప్… ఇదీ అసలు రియాలిటీ… మరీ లాస్ట్ సీజనయితే మరీ ఘోరం…

ఈ నేపథ్యంలో ఏదో ఓ ప్రయోగం, కొత్త దనం కావాలని ప్లాన్ చేశారు… లేకపోతే ఈసారి మరీ ఘోరంగా ఉంటుందని భయం… అందుకని డబుల్ హౌజ్, డబుల్ డోస్ అన్నారు… చదరంగం కాదు, రణరంగం అన్నారు… ఈసారి సెలబ్రిటీలతోపాటు కామనర్స్ అన్నారు… విస్తృతంగా ఆడిషన్స్ చేశారు…

Ads

అందులో 40 మందికి అగ్నిపరీక్ష పేరుతో పిచ్చి పిచ్చి పైత్యపు టాస్కులు ఇచ్చారు… వికృతం… దాంతోనే అర్థమైంది, ఈసారి ఈ షో ఇంకా దారుణంగా ఉండబోతున్నదీ అని… అంత బేకార్ టాస్కులు ఫాఫం వాళ్లకు… ఎంత స్క్రిప్టెడ్ అయినా సరే, జడ్జిలు నవదీప్, శ్రీముఖి తమ ఓవరాక్షన్‌తో బాగా విసిగించారు… గత సీజన్ల విజేతలు బిందు, అభిజిత్ కాస్త బెటర్…

సరే, ఏదో ఏడ్చారు… కాళ్లు తొక్కినప్పుడే కాపురం చేసే కళ తెలుస్తుందీ అన్నట్టు ఈ అగ్నిపరీక్ష తంతుతో సమజైంది కదా… అసలు కామనర్ అంటే ఎవరు..? సెలబ్రిటీ అంటే ఎవరు..? బిగ్‌బాస్‌కు కావల్సింది మామూలు సెలబ్రిటీలు కాదు… వివాదాల్లో ఉండేవాళ్లు… వాళ్లయితే పంచాయితీలు హౌజులో రక్తికడతాయి…

ఒక్క మాటలో చెప్పాలంటే వివాదమే అర్హత… ఉదాహరణ రీతూ చౌదరి… మొన్నామధ్య రోజూ వార్తల్లో కనిపించింది… ఎవడితోనో పెళ్లి, ఆస్తులు, ఫేక్ రిజిస్ట్రేషన్లు… మరో ఉదాహరణ శ్రేష్టి వర్మ… జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసుతో కంట్రవర్సీ… తనూ కొరియోగ్రాఫరే…

సరే, గత షోలలో అవినాష్ పోషించిన పాత్రను ఈసారి ఇమాన్యుయేల్ పోషిస్తాడు… స్పాంటేనిటీ, మెరిట్ ఉన్నోడే… తనూజా సైలంట్ ప్లేయర్… తక్కువ అంచనా వేయలేం… టీవీ నటి… అఫ్‌కోర్స్ విష్ణుప్రియ టైపు, చాన్నాళ్లు ఉంటుంది హౌజులో…

bb9

కామనర్స్ అంటే గతంలో ఓ పిచ్చోడి ఎంట్రీ, ఎలిమినేషన్, రీఎంట్రీ చూశాం… తరువాత ఓ సీజన్ విజేత పల్లవి ప్రశాంత్ ఏం ఉద్దరించాడో చూశాం… ఈసారి ఆరుగురు కామనర్లు… కాస్త పద్ధతిగానే ఉన్నారు… దమ్ము శ్రీజ చాన్నాళ్లు ఉంటుంది హౌజులో పక్కా… బలమైన కంటెస్టెంట్ తను… ఐనా వాళ్లు అగ్నిపరీక్ష ప్రసారాలతో ఆల్రెడీ సెలబ్రిటీలు అయిపోయారు..!!

ఆశా షైనీ అలియాస్ ఫ్లోరా షైనీ జీవితంలో విషాదం… అలాగే సంజన కూడా… ఎన్నాళ్లుంటారో చూడాలి… భరణి యాటిట్యూడ్ ఈ షోకు పెద్దగా పనికిరాదు… రానూ బొంబయికి రాను ఫేమ్ ఫోక్ డాన్సర్ రాము రాథోడ్ యాక్టివ్‌గా ఉన్నాడు, వేచి చూడాలి… గత సీజన్లలో టేస్టీ తేజ పోషించిన పాత్రను ఈసారి సునీల్ శెట్టి పోషిస్తాడేమో…

9 మంది సెలబ్రిటీలేమో టెనెంట్లట… ఔట్ హౌజులో ఉండాలి… ఆరుగురు కామనర్లు ఓనర్లట… వాళ్లు అన్ని విలాసాలూ ఉండే మెయిన్ హౌజులో ఉంటారట… హేమిటో…!! అన్నట్టు నాగార్జునా, మూడు గంటలపైచిలుకు మారథాన్ గ్రాండ్ లాంచింగ్ ప్రసారం చేశారు కదా… ఏమిటండీ ఈసారి ఏమాత్రం జోష్ కనిపించలేదు ఈ లాంచింగులో… ఏదో తేడా కొట్టింది సుమా..!!

  • ఇక్కడే ఓ విషయం చెప్పుకోవాలి… మలయాళం బిగ్‌బాస్ ఏడవ సీజన్ సందర్భంగా హోస్ట్ మోహన్‌లాల్ తన ఫ్రెండ్, మరో అగ్రనటుడు మమ్ముట్టి బర్త్ డేను పురస్కరించుకుని, తన ఫోటోలు ముద్రించిన షర్ట్ ధరించి కనిపించాడు… ఈ సహృదయత మన తెలుగు నటుల్లో కనిపిస్తుందా..? ఎక్సపెక్ట్ చేయగలమా..? మలయాళ ఇండ స్ట్రీ ఎప్పుడూ మనల్ని సర్‌ప్రయిజ్ చేస్తూనే ఉంటుంది…
  • mammotty

    Share this Article



    Advertisement

    Search On Site

    Latest Articles

    • జర్నలిస్టుంటే తోపులు, తురుములు కాదు… జస్ట్, వెర్రి పుష్పాలు…
    • 1.74 లక్షల స్కామ్ సహారాకు… అప్పట్లో కేసీయార్ చేసిన సాయం, సలాం..!!
    • ఒరేయ్ గుండూ… బట్టతలపై బొచ్చు పెంచే మందొచ్చిందటరా…
    • అగ్నిపరీక్ష ఓ చెత్త తంతు… 3 గంటల లాంచింగే జీరో జోష్ నాగార్జునా…
    • అదిప్పుడు క్రిమినల్ గ్యాంగుల స్వీడన్… కిశోర బాలికలే గ్యాంగ్‌స్టర్లు…!
    • అరుదైన సాహసం..! ఈ వయస్సులో, ఈ అనారోగ్యంలో కైలాస యాత్ర..!!
    • ఏదో ఓ పురాణకథని సినిమాకరిస్తే సరి… అప్పట్లో అదే పరుచూరి ట్రెండు..!!
    • ఫాఫం కేటీయార్… తన విలువను తనే దెబ్బతీసుకుంటున్నాడు..!!
    • ‘ఈ చీపురుపల్లి నుంచి ఆ డల్లాస్‌పల్లి దాకా’ బహుళ గాత్రవైవిధ్యం..!!
    • మిస్టర్ విజయ్, సినీ ఫ్యాన్స్ వేరు, ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలు వేరు…

    Archives

    Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions