Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బిల్ గేట్స్ ప్రేమకథలో బకరా ఎవరు..? ఆ ప్రైవేటు డిటెక్టివ్ కథేమిటి..?!

May 2, 2025 by M S R

.

ఓ అమెరికన్ తన పిల్లల్ని తన భారతీయ అతిథికి పరిచయం చేస్తున్నాడు ఇలా… ‘‘ఈ ఇద్దరూ నా పిల్లలు, ఆ ఇద్దరూ నా భార్య పిల్లలు… వీళ్లేమో మా పిల్లలు… అదుగో ఆ బ్లూ టీషర్ట్‌లో ఉన్నాడు చూడండి, ఆయన నా భార్య మాజీ రెండో భర్త… తనతో ఉన్నది ఆయన మూడో భార్య, వాళ్ల పిల్లలు… ఇటు కుర్చీలో కనిపిస్తున్నది నా మాజీ రెండో భార్య… తనతో ఉన్నది ఆమె మూడో భర్త, వాళ్ల పిల్లలు…’’

భారతీయ అతిథికి పిచ్చెక్కిపోయింది… అమెరికా సమాజం ఆమోదించే, ఆచరించే పద్ధతి వేరు… అసలు కుటుంబ వ్యవస్థకు దూరంగా ఉండేవాళ్లు బోలెడు మంది… నచ్చకపోతే విడాకులు, పెళ్లికి ముందే డేటింగులు, పెళ్లికీ పెళ్లికీ నడుమ డేటింగులు, ఔటింగులు, ఒంటరి జీవితాలు… భారతీయ సంప్రదాయికులకు ఓపట్టాన జీర్ణం కావు అవి… ఇక్కడ ఓ చిన్న తప్పనిసరి ఇంటరప్షన్ ఎపిసోడ్…

Ads

————-

ఒక ప్రియుడు, ఒక ప్రియురాలు… ప్రియుడికన్నా ప్రియురాలి వయస్సు ఐదేళ్లు ఎక్కువ… 1984 నుంచే డేటింగ్… ఆమె సెవెన్టీస్ లోనే ఓ కంపెనీ స్టార్ట్ చేసింది… తరువాత ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ స్టార్ట్ చేసి, మైక్రోసాఫ్ట్‌కే సలహాదారు అయ్యింది… ఏదో ఐటీ సెమినార్‌లో ఇద్దరూ కలిశారు…

అసలే ఆమె వయస్సు ఎక్కువ, ప్రియుడికేమో ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు… అలా కొన్నేళ్లు కలిసి తిరిగారు… తరువాత ఆ ప్రియుడికి మరొక మహిళ దొరికింది… ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు… ప్రియురాలిని అడిగాడు… ఆమె అర్థం చేసుకుంది, నీ ఇష్టం, కానీ ఏడాదికి ఓసారి సెలవుల్లో మనమిద్దరమూ ఇష్టారాజ్యంగా కలిసి తిరగాలి అంది…

ఇద్దరూ ఆ కొత్త మహిళను అడిగారు… ఆమె అంగీకరించింది… తన భర్త అయినా సరే, ఏడాదికి ఓసారి తన పాత ప్రియురాలితో ఏడాదికోసారి గడపడానికి వోకే చెప్పింది… అంతేకాదు, ఒకవేళ మేం పెళ్లి చేసుకున్నా సరే, విడిపోయే పరిస్థితి వస్తే భరణం వంటి సెటిల్మెంట్లు కూడా అవసరమయ్యే ఒప్పందాలను కూడా వద్దనుకుంది… ఇంకేముంది..? ప్రియుడు, మరో మహిళ పెళ్లి చేసుకున్నారు…. ఏడాదికోసారి ఈ ప్రియుడు తన పాత ప్రియురాలితో కాలం గడుపుతూనే ఉన్నాడు… ఇదీ కథ…


bill gates girl friend

కథ కాదు, నిజం… ఆమధ్య విడాకులు తీసుకున్న బిల్ గేట్స్, మిలిందా గేట్స్ జీవితాల్లోని ఓ ఆసక్తికరమైన ఎపిసోడ్… సూపర్ పెళ్లాం, సూపర్ ప్రియురాలు… ఏ తెలుగు సీరియల్ కథకూ తీసిపోనిది… నిజానికి చాలారోజులుగా ఇది వార్తల్లో ఉన్నా, ఇప్పుడు వాళ్ల విడాకుల నేపథ్యంలో మళ్లీ అమెరికన్ పత్రికలు, సైట్లు, టీవీలు పదే పదే ప్రసారం, ప్రచారం చేస్తున్నాయి…

ఓహో, బిల్ గేట్స్ గ్రంథసాంగుడే సుమీ అని చెబుతున్నాయి… అఫ్ కోర్స్, కానిదెవ్వరు..? అది మన భారతీయ సమాజం కాదు కదా, వాళ్ల లెక్కలు వేరు, వాళ్ల బతుకులు వేరు… ఇంతకీ ఆ ప్రియురాలి పేరు ఏమిటి అంటారా..? విన్ బ్లాడ్… ప్రస్తుతం (నాలుగేళ్ల క్రితం) ఆమె వయస్సు 70 ఏళ్లు… బిల్ గేట్స్ వయస్సు 65 ఏళ్లు… ఆ ఇద్దరి ప్రేమకథ అప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్….. పెళ్లయ్యాక కూడా బిల్ గేట్స్ ఏళ్ల తరబడీ ఆమెతో కొనసాగించిన ప్రేమాయణం…

5 లక్షల కోట్ల ఆయన గారి ఆస్తిలో మిలిందాకు పంపకాల్లో భాగంగా ఎంత వస్తుంది..? అంత ఆస్తి ఉన్నా వాళ్ల ముగ్గురు పిల్లలకు తలా 75 కోట్లకు ఎక్కువ రాకపోవడం, ఎందుకంటే వాళ్లు మేజర్లు కావడం వంటి కథనాలకు మించి గేట్స్ పాత ప్రేమ కథే ఎక్కువ ప్రాచుర్యంలోకి వస్తోంది…

సరే, ఆ సొసైటీ అంతే… వాళ్లిష్టం… కానీ ఈ మొత్తం కథలో బకరా ఎవరు..? సగటు భారతీయుడి కోణంలో చూద్దాం… ఆమె, అనగా విన్ బ్లాడ్ ఏమైంది..? నిక్షేపంలా ఉంది… మస్తు కంపెనీలు పెట్టింది, మస్తు సంపాదించింది… పదిహేనేళ్ల క్రితం కావచ్చు అలెక్స్ లైన్ అనేవాడిని పెళ్లి చేసుకుంది… ఎవరీ ఆదర్శ ప్రేమికుడు..?!

alex

అలెక్స్ లైన్…. ఓ ప్రైవేటు డిటెక్టివ్…. కంపెనీల మోసాలు, కేసులను దర్యాప్తు చేస్తుంటాడు… తన బ్రదర్ ఓ హాలీవుడ్ నటుడు… తన కంపెనీ పేరు Alex Kline Investigation and Research Service… అనేకానేక ప్రైవేటు కేసుల్ని దర్యాప్తు చేసి, నిగ్గు తేల్చే సదరు డిటెక్టివ్‌కు తన భార్య, తన మాజీ ప్రియుడితో కొనసాగించే ప్రేమాయణం గురించి తెలియదా..?

తెలుసునేమో… ఏమో, వాళ్లిద్దరి ప్రేమాయణం కొనసాగింపుకి మిలిందా వోకే చెప్పినట్టే ఆయన కూడా వోకే అన్నాడేమో… ఇవి అసాధారణ ప్రేమ ఒప్పందాలు…

ఒక్కసారి ఊహించండి, భారతీయ సమాజంలో ఇవి సాధ్యమేనా..? చివరగా :: మిలిందాతో పెళ్లికి ముందు ఈ ప్రియురాలు ఏమన్నాదో తెలుసా..? ‘‘బిల్, ఈమె నాకన్నా బెటర్, చాలా తెలివైనది, ఈమెనే పెళ్లిచేసుకో, మనం ఏడాదికోసారి కలుద్దాం సరేనా..? ఈమేరకు నేను ఆమెను ఒప్పిస్తాను..!! (– మే 2021 నాటి స్టోరీ)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…
  • డిస్టర్బింగ్ సీసీటీవీ ఫుటేజీ… కొన్ని జవాబులు దొరకని ప్రశ్నలు కూడా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions