Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈనాడు చెప్పలేదు… ఆమే ట్వీట్ ద్వారా ఆ సంఘటన వివరించింది…

January 22, 2023 by M S R

నిజంగా కలవరం కలిగించే సంఘటనే… ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేసే స్మిత సబర్వాల్ ఇంటికి రాత్రిపూట ఓ డిప్యూటీ తహసిల్దార్ వెళ్లిన తీరు ఆందోళనకరమే… రెండురోజుల క్రితం జరిగిన సంఘటనను ఈనాడు దాన్ని కవర్ చేయడం బాగానే ఉంది… కానీ ఆమె ఎవరో పేరు దాచిపెట్టాల్సిన అవసరం లేదు… ఎందుకో భయపడింది… ఆ వార్త రాసిన తీరు కూడా ఆమె ఎవరో ఊహించేట్టుగా కూడా లేదు…

వార్త ఏమిటంటే… స్మిత సబర్వాల్ భర్త ఐపీఎస్ అధికారి… ఆమె జుబ్లీ హిల్స్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది… సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గా ఉంటుంది… మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ డిప్యూటీ తహసిల్దార్ రెండుమూడుసార్లు ఆమె ట్వీట్‌ను రీట్వీట్ చేశాడట… ఇంకేముంది..? చనువు వచ్చేసిందని అనుకున్నాడేమో… ఏకంగా అర్ధరాత్రి తన దోస్త్, హోటల్ యజమానితోపాటు ఈ గేటెడ్ కమ్యూనిటీలో నేరుగా ఆమె ఇంటికి వెళ్లిపోయాడు…

అసలు ఈ ట్వీట్లు ఏమిటి..? రీట్వీట్లు ఏమిటి..? అసలు సదరు డిప్యూటీ తహసిల్దార్ నిజమే చెబుతున్నాడా..? లేక తన దోస్తు, తను ఫుల్లుగా తాగి, నేరుగా ఆమె ఇంటికి వెళ్లిపోయాడా..? ఆమె సహజంగా ధైర్యం కలిగిన మహిళ, ఐఏఎస్ కాబట్టి ఏ అఘాయిత్యమూ జరగకుండా వాడిని దబాయించి ఎలాగోలా అక్కడి నుంచి పంపించేసి ఊపిరి పీల్చుకుంది… కచ్చితంగా అక్కడ సెక్యూరిటీ వైఫల్యమే… అర్ధరాత్రి ఐడెంటిటీ లేకుండా, ఇంటి యజమాని పర్మిషన్ లేకుండా ఎలా లోనకు పంపించినట్టు..?

Ads

smitha

ఆమె కేకలు విని అప్పటికప్పుడు భద్రతా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు… తనతోపాటు తన దోస్త్‌ను కూడా అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు… ఈ ప్రొసీజర్ వోకే… కానీ గేటెడ్ కమ్యూనిటీల సెక్యూరిటీ వ్యక్తులకు కూడా కొంత శిక్షణ అవసరమని అనిపిస్తోంది… సదరు డిప్యూటీ తహసిల్దార్ తన ఉద్యోగం గురించి మాట్లాడటానికి వచ్చానని బుకాయించాడట… దానికి అర్ధరాత్రి ఆమె ఇంట్లోకి ప్రవేశించడం ఏమిటి..? తనను సస్పెండ్ చేయడం కాదు, డిస్మిస్ చేయాలి… ఖచ్చితంగా దుర్బుద్దితోనే ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు…

ఈనాడు వార్త పొద్దున్నే బాగా చర్చనీయాంశం కాగా… పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఆమె పేరు బయటపెడుతూ, ఆమెకే రక్షణ లేకపోతే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏమిటంటూ పొలిటిసైజ్ చేశాడు… ఆమె కూడా జరిగిన సంఘటన ఏమిటో ఓ ట్వీట్ ద్వారా బయటపెట్టింది… ధైర్యంగా, చాకచక్యంగా రక్షించుకున్నాను, కానీ అందరూ తలుపులు, తాళాలను పడుకునే ముందు పరీక్షించుకోవాలి… అత్యవసరమైతే 100 నంబర్‌కు కాల్ చేయాలి…’’ అని చెబుతోంది…

నిజానికి సంఘటన జరిగిన తెల్లవారే చెబితే బాగుండేది… ఈనాడులో వార్త రావడం, రేవంత్ పొలిటిసైజ్ చేయడంతో ఇక ఆమె బయటికి వచ్చి, ట్వీట్ ద్వారా ఏం జరిగిందో చెబుతున్నట్టుంది… సో, మేం మంచి భద్రత ఏర్పాట్ల నడుమ ఉన్నాం అని హైప్రొఫైల్ పోస్టుల్లో ఉన్న మహిళలు కూడా ధీమాగా ఉండే పరిస్థితులు లేవా..?! ఈమె సీఎంవోలో కార్యదర్శి కాబట్టి జరిగిన సంఘటనకు బాగా ప్రాచుర్యం వచ్చింది…!!

అన్నట్టు, సాక్షి ఆమె పేరు, ఆ గేటెడ్ కమ్యూనిటీ పేరు కూడా రాసింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 
  • అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions