నో డౌట్… తెలుగు టీవీల్లో నప్పతట్ల సెలెబ్రిటీలు పలు చాట్‌షోలు చేశారు… ఏదో పైపైన సరదాగా నడిచిపోయాయి… కానీ విస్తృత ప్రజాదరణ పొందుతున్నది మాత్రం ఆహా ఓటీటీలో వచ్చే బాలయ్య అన్‌స్టాపబుల్ షో… వాళ్లేదో డిజిటల్ వ్యూస్ అని ఏవో తప్పుడు లెక్కలు ప్రచారం చేసుకుంటారు, వాటి నిజనిర్ధారణకు ఎలాగూ మనకు చాన్స్ లేదు… సినిమా వాళ్ల వసూళ్ల సంగతి తెలుసు కదా… ఇవీ అంతే… బట్, బాలయ్య షో సూపర్ హిట్… అయితే..?
ఫస్ట్ సీజన్ గురించి వదిలేయండి… ప్రతి ఎపిసోడ్‌కు ఒక సినిమాకు కావల్సినంత ప్రిపరేషన్ వర్క్ చేస్తున్నారు… జనంలోకి కొత్త బాలయ్య వెళ్లాడు… బాలయ్య తను షోలో గెస్టులను డామినేట్ చేస్తూనే, సరదాగా పలు సంగతులు రాబట్టి ఎంటర్‌టెయిన్ చేశాడు… ఎటొచ్చీ సెకండ్ సీజనే గాడితప్పింది… ప్రత్యేకించి గెస్టుల ఎంపిక కాంబినేషన్ గతితప్పింది… మెల్లిగా కరణ్‌జోహార్ దారిలోకి వెళ్తున్నట్టుగా ఉంది… ఇదిలాగే కొనసాగితే వ్యూస్ తగ్గకపోవచ్చుగాక, కానీ ఆ చాట్‌షో తన విశిష్టతను కోల్పోవడం ఖాయం…
ఫస్ట్ ఎపిసోడ్ చంద్రబాబును తీసుకొచ్చాడు… ఎందుకో ఈ షోలో గెస్టుగా చంద్రబాబు సూట్ కాడు అనిపించింది… అనుకున్నట్టే కాలేదు కూడా… తను ఎక్కడా హిపోక్రసీని వదులుకోడు… పిల్లనిచ్చిన వియ్యంకుడు కాబట్టి బాలయ్య గెస్టు ముందు వినయంగా, విధేయంగా కనిపించాడు… సరే, బాబును తెచ్చాడు, ఇక లోకేష్‌ను తీసుకురాకుండా ఉండాల్సింది… అవసరమైతే వేరే ఎపిసోడ్‌కు తనొక్కడినే పిలవాల్సింది… వీలయితే నారా బ్రాహ్మణి, దేవాన్ష్‌లతో కలిపి…! భలే ఉండేది…
Ads
తరువాత ఈ పొలిటికల్ వాసనను కొనసాగిస్తూ, నా దోస్తులు అంటూ మాజీ స్పీకర్లు కిరణ్‌కుమార్‌రెడ్డి, సురేష్‌రెడ్డిలను పట్టుకొచ్చాడు… నిజానికి వాళ్లు కూడా ఈ షో కేరక్టర్‌కు ఫిట్ కారు… వాళ్లు తమ చుట్టూ పెంచుకున్న ఇగో పెంకులను పగులగొట్టుకుని బయటికి రారు… చిత్రమేమిటంటే వాళ్లతో ఆ ఎపిసోడ్‌లో రాధిక కోగెస్ట్… ఏ కోణంలో చూసినా మిస్‌ఫిట్… ఆమె వాళ్లలా నిజాం కాలేజీ స్టూడెంట్ కాదు, పొలిటిషియన్ కాదు, అసలు బాలయ్యతో కలిసి వర్కే చేయలేదు… రెండురకాల బిర్యానీలకు పులిహోర యాడ్ చేసినట్టు శృతి కలవలేదు…
శర్వానంద్, అడివి శేష్… సరిగ్గా ఈ షో కేరక్టర్‌కు సరిపోయారు… బాలయ్య కూడా రెచ్చిపోయాడు… కానీ జబర్దస్త్ షో అనుకున్నాడేమో మరీ కొన్ని వెగటు ప్రశ్నలకు వెళ్లాడు… ఫ్యామిలీ ప్రేక్షకులు ఇష్టపడరు… ఇప్పుడు ప్రభాస్, గోపీచంద్… గుడ్ కాంబో… ఎందుకంటే… ఇప్పుడు ఆ ఇద్దరి రేంజు వేర్వేరు కావచ్చుగాక… కానీ ప్రభాస్ కెరీర్ మొదట్లో గోపీచంద్ ప్రభాస్‌కు ఈక్వల్… ఒక ఏడాది సీనియర్ కూడా… ఇద్దరూ ఏదో సినిమాలో కలిసి చేశారు కూడా… పైగా వాళ్లు రియల్ లైఫ్‌లో కూడా దోస్తులు…
నిజానికి ఇద్దరు, ముగ్గురిని గెస్టులుగా తీసుకురావడం కరెక్టు కాదు… ఆ టైమ్ సరిపోదు… గెస్టును పూర్తిగా ఆవిష్కరించలేం… మళ్లీ అదే తప్పు… జయప్రద, జయసుధ, రాశీఖన్నాలను పట్టుకొచ్చాడు… ఇదెక్కడి ఎంపిక..? అసలు బాలయ్య టీం బిగ్‌బాస్ టీంలాగా మారిపోయిందా..? నిజానికి జయప్రద, జయసుధలకు ఒక్కొక్క ఎపిసోడ్ టైమే సరిపోదు… వాళ్లు తెలుగు సినిమాకు లెజెండ్స్… ఇక్కడ వారిని ప్రస్తుతించలేం గానీ… రాశిఖన్నా వాళ్లతో ఎలా జతకలుస్తుంది అసలు..?
ఆ ఇద్దరి నటజీవితమంత లేదు ఆమె వయస్సు… ఆమె నటజీవితం పిసరంత… ఆమె వీళ్ల నడుమ ఇరికిింది బాలయ్యా..? కనీసం షో చేస్తున్నప్పుడు ఆలోచించాలి కదా.., జయప్రద, జయసుధ కలిసి చాలా సినిమాల్లో చేసి ఉంటారు గానీ మేఘసందేశం ఓ క్లాసిక్… ఇద్దరూ రాజకీయాల్లో చేరి, అధికార పదవుల్ని అనుభవించారు… ప్రత్యేకించి జయప్రద యూపీలో ఆజంఖాన్ అనే ఓ గలీజుగాడితో పోరాడింది… ప్చ్, వాళ్లిద్దరినీ తీసుకొచ్చి ఏదో పెరిఫెరల్ చాట్ షో మమ అనిపించాడు బాలయ్య… మళ్లీ ఏమైంది బాలయ్యా నీకు..?
Share this Article