కొన్ని మతాలు, కులాలకు, ప్రాంతాలకు పండుగలు ఉంటాయి – కాని ప్రపంచంలో తెలుగు జాతి ఎక్కడున్న ఘనంగా జరుపుకునే పండగ ఎన్టీఆర్ జయంతి – తెలుగు జాతి అంటే ప్రపంచం మొత్తానికి మొదటగా ఎన్టీఆరే గుర్తుకు వస్తారు .………. ఈ మాట అన్నది ‘ఎవరంటే…? శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు… తమ విఖ్యాత పార్టీ డిజిటల్ మహానాడు సందర్భంగా ఆయన్ని స్మరించుకున్నాడు… రెండు మూడు విషయాల్లో మనకూ కొంత క్లారిటీ అవసరం… లేకపోతే ఇలాంటి నాయకులు వాళ్ల మాటలతో జనం మెదళ్లలో కల్చరల్ కాలుష్యాన్ని నింపే ప్రయత్నం చేస్తారు కాబట్టి… మొత్తం యెల్లో మీడియా దాన్ని మరింత ప్రజల మెదళ్లలో కాన్సంట్రేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి… ఇలాంటి దిక్కుమాలిన, శుష్క, డొల్ల మాటల్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబీఎన్, ఈటీవీ ఎట్సెట్రా హైలైట్ చేస్తాయి కాబట్టి…
తెలుగు జాతికే ఎన్టీయార్ జయంతి పండుగ అయ్యే పక్షంలో…. ఆయన ఓ మహిమాన్విత దేవుడైన పక్షంలో…. మరి ఆ దేవుడిని వెన్నుపోటు పొడిచింది ఇదుగో మనం పైన చెెప్పుకున్న ముఠా కాదా..? ఆ ముఠానాయకుడు చంద్రబాబు కాదా..? ఒక నాయకుడు, ఒక హీరో… తెలుగు జాతికి సంబంధించి బోలెడు మంది నాయకులు వచ్చారు, పోయారు… హీరోలు వచ్చారు, పోయారు… సొంత అల్లుళ్లు, కూతుళ్లు, కొడుకులు, కోడళ్లు సహా ఒక్కరూ ఆయనకు ప్రేమగా రెండు బుక్కల తిండి పెట్టిన పాపాన పోలేదు, పైగా మనోక్షోభతో మరణించేలా చేశారు… తన సొంత కుటుంబమే ఓన్ చేసుకోని ఓ వ్యక్తి జాతికి దేవుడెలా అయ్యాడు..? ఆయన పుట్టినరోజు జాతికి పండుగ ఎలా అయ్యింది..?
Ads
అసలిక్కడ తెలుగు జాతి అంటే ఏమిటి..? ఓ ప్రత్యేకమైన కులమా..? ఓ పరిమిత ప్రాంతమా..? ఆయన ఓ పార్టీ పెట్టి, ఇలాంటి చంద్రబాబులకు ఉపయోగపడ్డాడేమో కానీ తెలుగు జాతికి చేసిన సేవ ఏంటి..? జాతికి ఒరిగిందేమిటి..? అంతటి మహిమాన్వితుడి పుట్టినరోజు కదా, మరి తెలంగాణలో చీమచిటుక్కుమన్నంత హడావుడి, సందడి లేదేం..? ఈ తొక్కలో చానెళ్లలో సాగే దిక్కుమాలిన మహాసంకల్ప భజనలు తప్ప ఇంకెక్కడా కానరాదేం..? ఓహో… తెలుగు జాతి అంటే ఆంధ్రా మాత్రమేనా..? సరే, సరే… ఆ ఆంధ్రాలో కూడా ఒక్క కార్యక్రమమూ కనిపించదేం..? ఓహో, ఆ ఒక్క పార్టీకి మాత్రమే దేవుడా..? మరి వాస్తవం అదయినప్పుడు మొత్తం జాతికి ఎందుకు అట్రిబ్యూట్ చేయడం దేనికి..? పైగా ప్రపంచంలో తెలుగు జాతి ఎక్కడున్నా ఘనంగా జరుపుకునే పండుగ అట… తెలుగు జాతి అనగానే మొదట ఎన్టీయారే గుర్తుకొస్తాడు అట… ఒక హీరో, ఒక నాయకుడి పుట్టినరోజును ఒక ఉజ్వల చరిత్ర ఉన్న తెలుగుజాతికి పండుగ అని కీర్తించడం అంటే… మొత్తంగా జాతినే కించపరచడం కాదా… ఆ సోయి ఉందా ఈ మీడియాకు..? ఈ పార్టీకి..?! ఈ మహానేతను మీరు, వైఎస్ అనే మహానేతను వైసీపీ పూజించండి, తరించండి, కానీ మొత్తం జాతి మీద దేవుళ్లుగా రుద్దకండి…!!
Share this Article