Muchata.com Telugu Latest News

Muchata.com Provided Telugu Latest News, Political News , Political News, Breaking News in Telugu LIVE ముచ్చట

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రొటీన్ వార్తలు ఎవరైనా రాయగలరు..? ఓ రేంజ్‌లో రాయడమంటే ఇదీ…!

January 11, 2021 by M S R

ఛస్.., వార్తలు ఎవరైనా రాయగలరు..? ఎలాగైనా రాయగలరు..? మన గొప్పదనం ఏముంది..? రాస్తే ఓ రేంజ్‌లో ఉండాలి… అదేదో సినిమాలో అన్నట్టు… గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొడితేనే ఒక రేంజ్… ఈ వార్త చూడండి… స్థానిక ఎన్నికలపై జగన్ వర్సెస్ నిమ్మగడ్డ డిష్యూం డిష్యూం నడుస్తూ… ఇష్యూ ఇప్పుడు కోర్టులో ఉంది కదా… అంతటి డప్పు మాస్టర్ ఆంధ్రజ్యోతే జస్ట్, హైటెన్షన్ అనే హెడింగు పెట్టుకుని, తనే బోలెడంత టెన్షన్ పడిపోయింది తప్ప… ఇదుగో ఇలా తీర్పు వచ్చేస్తుంది… ఇక జగన్ సర్కారులో ఒక్కొక్కరి పనీ దబిడిదిబిడే అని రాయడానికి సాహసించలేదు… కానీ..?


vartha


ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందనీ… చీఫ్ సెక్రెటరీని, డీజీపీలను తాత్కాలికంగా తప్పించే అవకాశం ఉందనీ… కొత్త చీఫ్ సెక్రెటరీగా బీహార్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించబోతున్నారనీ… అంతేకాదు.., ఎన్నికల విధులు బహిష్కరిస్తామని ప్రకటించిన ఉద్యోగులపై చర్యలు తీసుకోబోతున్నారనీ రాసేసింది ఈ పత్రిక… ప్రభాతవార్త అంటే బహుశా వార్త దినపత్రిక అయి ఉంటుంది…

ఇదీ పత్రికరచన రేంజ్ అంటే..! హహహ… రేపటిరోజున జరగబోయే విచారణ, వచ్చే తీర్పు గురించి కూడా ముందురోజే స్కూప్ రాయడంకన్నా థ్రిల్ ఏముంటుంది..? పైగా సీఎస్, డీజీపీలను తప్పించడం… ఫలానా బీహార్ సీనియర్ ఐఏఎస్ కొత్త సీఎస్‌గా వచ్చే అవకాశాల్ని గుర్తించడం… వావ్… నిజానికి అక్కడ ఆగిపోయి బతికించింది పత్రిక…

లేకపోతే… తక్షణం రాష్ట్రపతిపాలనకు సిఫారసు చేస్తుందనో… రాజ్యాంగ సంక్షోభం నెలకొన్నందున వెంటనే మోడీ, అమిత్ షా రంగంలోకి దిగి… గవర్నర్‌కు పాలనబాధ్యతలు అప్పగించాలని ఆదేశిస్తుందనో రాయలేదు… అఫ్‌కోర్స్, ఇంత రాసినప్పుడు అది రాసినా తప్పులేదు… నిజానికి అలా జరగకూడదని కూడా ఏమీలేదు… రాసిన పత్రిక అలా జరగాలని ఆశించడంలోనూ తప్పులేకపోవచ్చు… కానీ జడ్జిలు ఇలా తీర్పు చెప్పబోతున్నారు అని ముందస్తుగా రాయడం ఏదయితే ఉందో… అదరగొట్టేశారుపో…

aj1

అవునూ… ఏదో రాశారులే… దాన్నలా వదిలేస్తే… ఈ వార్త చూశారుగా… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెగ ఆందోళన పడిపోతున్నాడు… హైరానా… టెన్షన్… అయ్యో, ఏమయిపోతుందో… అసలు షెడ్యూల్ విడుదలయ్యాక కోర్టులు ఇంతవరకూ జోక్యం చేసుకున్న చరిత్రే లేదు అంటున్నాడు… అంటే, ఖచ్చితంగా మా నిమ్మగడ్డదే విజయం అన్నట్టుగా ప్రకటించేస్తున్నాడు పరోక్షంగా… వాయిదా వేయాలని చెప్పినా సంచలనమేనట… జెర సైసు సారూ… అంటే కాస్త ఆగు ఆగు అని అర్థం… ఏమీకాదు, చాలాచాలా రాజ్యాంగసంక్షోభాల్నిచూసింది చరిత్ర… నువ్వు బెంబేలెత్తిపోవడం దేనికి సార్..? వ్యవస్థల నడుమ ఘర్షణ అనేకసార్లు సహజం… మరీ ఇదేమైనా ట్రంపు వర్సెస్ జోబైడెన్, కేపిటోల్ ఆక్రమణ లెవల్ టెన్షన్ ఏమీకాదులే గానీ… ఆందోళన వలదు… వలదు… మరీ అసాధారణంగా జగన్ ప్రభుత్వం రద్దు దాకా పరిస్థితి ఏమీ దిగజారదు… అన్నింటికన్నా ముఖ్యంగా… ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబును నియమించే అవకాశం అసలే ఉండదు… ప్లీజ్, కూల్… కూల్…!!

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • ‘‘జగనూ, కేబినెట్‌లో చేరిపోవయ్యా… అబ్బే, ఇప్పుడొద్దులెండి సార్…’’
  • ఓ పెగ్గు వేస్తే తప్ప… అవి అంతుపట్టవు… ఇన్నాళ్లకు వాళ్లకు కనిపించినయ్…
  • ఆలీ పిచ్చికూతలు సరే..! షకీలా ధర్మసందేహం మాత్రం అల్టిమేట్..!
  • అనుకుంటాం గానీ… చాలామంది చంద్రబాబులున్నారు దేశంలో…!!
  • పాకిస్థాన్ ఇజ్జత్ జప్తు… ఇమ్రాన్‌కు ఇంటాబయటా అన్నీ వెక్కిరింపులే…
  • పట్టుచీరె కట్టేనా..? నొసటన బొట్టు పెట్టేనా..? వేళ్లకు మెట్టెల మాటేమిటో..?!
  • ఫ్లెక్సీ లీడర్స్..! వింటారా కలాం చెప్పిన ధావన్ కథ..?
  • ఔను సారూ… మతమేనా..? కులాన్ని తేల్చే డీఎన్ఏ టెస్టులు కూడా ఉన్నయా..?
  • ప్రధాని దాకా కీలక పదవులు… దేశరక్షణకు మాత్రం ముందుకు రారు…
  • చింత బరిగెలు, తొడపాశాలు కావు బ్రో… అసలు కథలు వేరే ఉంటయ్…

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now