Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ష్… ఈ వార్తను అంకుల్ శామ్ పిట్రోడాకు ఎవరూ చెప్పకండి ప్లీజ్…

May 20, 2024 by M S R

సరే, ఎవరమూ అంకుల్ శామ్ పిట్రోడాకు చెప్పబోం, అధీర్ రంజన్ చౌదరికి అసలే చెప్పబోం కానీ ఏమిటది అంటారా..? డెయిలీ రికార్డ్, ది మిర్రర్ అనే అమెరికన్ మీడియా సైట్లలో కనిపించింది… ది హోబిట్ అని చరిత్రకారులు (ఆంత్రపాలజిస్టులు) ముద్దుగా పిలిచే హోమో ఫ్లోర్‌సైన్సిస్ అనే ఆదిమ జాతి మనుషులు ఇంకా ఈ భూమ్మీద కనిపించే చాన్సెస్ ఉన్నాయట… వాళ్లు మూడు ఫీట్ల 6 అంగుళాల ఎత్తు ఉండేవాళ్లు…

కోతులు- చింపాంజీలకూ మనుషులకూ నడుమ పరిణామ దశ జాతి (ఏప్ మ్యాన్) కావచ్చు బహుశా… 60 వేల నుంచి 7 లక్షల ఏళ్ల క్రితం నాటి మానవ పూర్వ జాతి… నో, నో, పూర్వ జాతి ఏమీ కాదు, మానవజాతే… అందుకే ఈ వార్త చదవగానే అంకుల్ శామ్ పిట్రోడా ‘అవునవును, సౌత్ ఇండియాలో, పర్టిక్యులర్‌గా దండకారణ్యంలో ఇప్పటికీ ఉన్నారు, మరీ పర్టిక్యులర్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంటారు’ అనే ప్రమాదం కూడా ఉంది…

hobbit

Ads

చూశారా, మా చంద్రబాబు వంటి ప్రచండ మేధావులు పుట్టిన తెలుగుజాతిని కాంగ్రెసోళ్లు ఎలా అవమానిస్తున్నారో అని మళ్లీ మోడీ తిట్టే ప్రమాదమూ ఉంది… ఇంకా పోలింగ్ దశలున్నాయి కదా… ఏదీ వదలడం లేదాయన… అవమానకరం అని ఎందుకు అంటున్నామంటే సదరు హోమో ఫ్లోర్‌సైన్సిస్ జాతి మనుషులకు చిన్న మెదళ్లు, పెద్ద పాదాలు ఉంటాయట… కానీ ఆ సైంటిస్టులే చెబుతున్నారు… ప్రస్తుతం ఫ్లోర్స్ అని పిలవబడే ఇండొనేషియా ప్రాంతంలో నివసించి ఉంటారని…

కానీ అక్కడికి ఎక్కడి నుంచి వచ్చారో మాత్రం ఊహించలేకపోతున్నారట… అదుగో అక్కడ దొరికిపోతాం మనం కాంగ్రెస్ పెద్ద బుర్రలకు..!

The species has been nicknamed 'the hobbit' due to its average height of 3ft 6in

అల్‌బెర్టా యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ బోఫిన్ ఏమంటాడంటే… ‘‘ఫలానా సంవత్సరాల్లో వీళ్ల ఉనికి ఉండేది, ఈ కాలంలో అంతరించింది అని చెప్పేవాళ్లు లేరు, నిజానికి వాళ్లు  ఇంకా ఈ విశ్వంలో ఎక్కడో ఉండే ఉంటారు’’… కావచ్చు, మనుషులు ఉండీ మన నాగరిక (?) సమూహాలు ప్రవేశించని చాలా ద్వీపాలున్నయ్ కదా… ఉదాహరణకు మన అండమాన్, నికోబార్ దీవుల్లోని సెంటినలీస్…

సరే, ఆయన వాదనతో విభేదించేవాళ్లూ బోలెడు మంది… 1984 నుంచి ఇండొనేషియాలోని ఫ్లోర్స్ ద్వీపాల్లో పరిశోధనలు సాగిస్తున్న ఆంత్రపాలజిస్టులు ఏమంటారంటే..? ‘‘చిన్నగా, దట్టమైన వెంట్రుకలతో, దాదాపు జంతువుల్లాగే తిరిగే మనషుల గురించి ఇప్పటికీ బోలెడు కథలున్నయ్ ఆ ప్రాంతాల్లో… వాళ్లను లియోలు అని పిలుస్తారు లోకల్స్…

Evidence of homo floresiensis was first dicovered in the Liang Bua cave on the Indonesian island of Flores in 2003

ఫ్లోర్స్ ద్వీపంలోని పలు గుహల్లో ఈ మానవ జాతికి సంబంధించిన ఆధారాలను కనుగొన్నారు 2003లో… కనీసం తొమ్మిది మంది హోబిట్స్ అస్థిపంజరాలు, పుర్రెలతో సహా సేకరించారు… అవునవును, ఇలాంటి వాళ్లు ఇంకా ఉండే అవకాశాల్ని తోసిపుచ్చలేం అంటోంది ఎలిజబెత్ వియాచ్ అనబడే జూఆర్కియాలజిస్టు… ఆధారాలు బయటపడుతూనే ఉన్నాయని అంటోంది… అవునూ, అంకుల్ శామ్, ఇండొనేషియాకు ఇండియా నుంచే వలస వెళ్లి ఉంటాయా ఈ జీవులు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 
  • అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?
  • ‘రా’ కొత్త చీఫ్‌గా ఆపరేషన్ సిందూర్ మాస్టర్ మైండ్..!!
  • చిరంజీవే హీరో అయినాసరే… మాధవి పాత్రదే అల్టిమేట్ డామినేషన్…
  • ప్రధానిపై క్షుద్ర పూజల ప్రయోగం… విరుగుడుగా ప్రత్యేక పూజలు…
  • బీఆర్ఎస్ పంథాలో ఏమిటీ మార్పు… KCR ఉద్యమ ధోరణికి వ్యతిరేకం…
  • అక్షయ్, శరత్‌కుమార్, మోహన్‌లాల్ ఫెయిల్… విష్ణు, ప్రభాస్ పాస్…
  • సంపూర్ణంగా ఈ కామాఖ్య ఆదిశక్తిపీఠం తరహాయే వేరు… Part-2 …

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions