అసలు శివాజీ ఆడేదే కన్నింగ్ గేమ్… దానికితోడు రెండు తోకలు… వాళ్లు అదుపు తప్పిపోయిన తీరు చూసి చివరకు శివాజీకి నోటమాట రాలేదు… నిశ్శబ్దంగా కూర్చుండిపోయాడు… ఆ ఇద్దరినీ వెంటేసుకుని ఏదో చేయాలనుకుంటే ఇంకేదో అయిపోయింది… ఐనా పర్లేదు, నాగార్జున కిమ్మనడు… మా శివాజీ కదా అనుకుని నెత్తిన మోస్తాడు…
ఓ వినోదం లేదు, ఓ మంచి టాస్క్ లేదు, థ్రిల్లింగ్ గేమ్ లేదు… అసలు కంటెస్టెంట్ల ఎంపికే శుద్ధ తప్పు అన్నట్టుగా ఈ సీజన్ నిరాసక్తంగా సాగుతోంది… వోట్ అప్పీల్ టాస్క్ నడుస్తోంది… శోభాశెట్టి తెలివిగా వేసిన ట్రాపులో పడ్డాడు యావర్… కొన్ని వారాలుగా తన ఆట లేదు, హౌజులో పనిలేదు, ఎందుకున్నాడో తనకే తెలియనట్టుగా సాగుతోంది… శివాజీ ఏది చెబితే అది చేయడం తప్ప మరే పనీ లేదు…
శోభాశెట్టి వేసిన ట్రాపులో పడి, చివరకు ఏదేదో అరిచాడు… ఛీథూ అంటూ సంస్కారహీనంగా, చిల్లరగా బిహేవ్ చేశాడు… వెకిలి బాడీ లాంగ్వేజీతో వెక్కిరింపులు సరేసరి,.. చివరకు ఆ కోపంలో బిగ్‌బాస్ మీదకూ అరిచేశాడు… బాల్స్ తన్నాడు, డ్రెస్ విప్పి విసిరేశాడు… ఇప్పుడు అర్థమైందేమో బిగ్‌బాస్‌కు తన ఎంపిక ఎంత దారుణమో… శోభాశెట్టి వోట్ అప్పీల్ అయిపోయింది కాబట్టి వ్యూహాత్మకంగా శివాజీ గ్యాంగ్‌లో యావర్‌ను టార్గెట్ చేసింది తెలివిగా… ఈ స్థితిలో ఎంత జాగ్రత్తగా, సంయమనంతో ఉండాలో దానికి పూర్తి భిన్నంగా చిరాకెత్తించాడు యావర్…
Ads
అమర్ కెప్టెన్ … నామినేషన్ల నుంచి ఇమ్యూనిటీ ఉండదు తప్ప మిగతా పవర్స్ అన్నీ ఉంటయ్… కానీ శివాజీ గ్యాంగ్ దాన్ని గుర్తించలేదు, పురుగుకన్నా హీనంగా తీసిపడేశారు అమర్‌ను…! దీనికితోడు పల్లవి ప్రశాంత్ మొదటి నుంచీ ‘అపరిచితుడు’ టైప్ ఆట… ప్రేక్షకుల్లో సానుభూతి కోసం వేషాలు… నన్ను తన్నాడు, నన్ను కొరికాడు, నన్నుకొట్టాడు అంటూ కెమెరా ముందు ప్రయత్నాలు… మెడికల్ టీం ఎదుటకు పోదాంపద, వీడియోలో చూద్దాం అంటూ హడావుడి… దీనికితోడు రైతుబిడ్డ అనే సెంటిమెంట్ సరేసరి… పైగా కామన్ మ్యాన్ అనే ముద్ర… ఈరోజు తనూ అదుపు తప్పాడు… చివరకు శివాజీకి ఏమనాలో అర్థం గాక మూసుకుని ఓ పక్కన కూర్చుండిపోయాడు…
అవునూ, బిగ్‌బాసూ…. ఈరోజు వోట్ అప్పీల్ టాస్క్ మొత్తం ఒకే ప్రస్తావన… ఎవరికి తక్కువ వోట్లు వచ్చాయి, ఎవరు బాటమ్‌లో ఉన్నారు అనే వివరాలతో మాట్లాడుకున్నారు… దాన్ని బట్టే టాస్క్ నడిచింది… అసలు కంటెస్టెంట్లకు వోట్ల వివరాలు ఎందుకు చెప్పాలి..? చెబితే ఆటలో నేచురాలిటీ పోయి, ఆర్టిఫిషియాలిటీ వచ్చేయదా..? అసలు బిగ్‌బాస్ అఫీషియల్ వోట్లే పెద్ద ఫార్స్, పైగా దాన్ని రివీల్ చేస్తూ ఆట తీరును మార్చేయడం దేనికి..?
నిజానికి తక్కువ వోట్లు పడుతున్నా సరే, అర్జున్ హుందాగా ఆడుతున్నాడు… బ్యాలెన్స్ కోల్పోవడం లేదు… ప్రియాంక కూడా కాస్త బెటరే… ఆచితూచి మాట్లాడుతుంది… ఐతే తనేమో గ్రూపుగా ఆడవద్దట… నాగార్జున నీతులు చెబుతాడు… శివాజీ గ్యాంగ్ మాత్రం గ్రూపుగా ఆడవచ్చునట… వాళ్లు అనుకున్నట్టే హౌజ్ నడవాలట… అందుకే ఓ దశలో శోభాశెట్టి అనేసింది… ‘‘ఏదో వయసు ఎక్కువ కాబట్టి గౌరవిస్తున్నా, లేకపోతే అనాల్సినవన్నీ అనేసి బయటికి వెళ్లిపోతా’’ అని… అదీ శివాజీ సాధించుకున్న గౌరవం… మొత్తానికి ఈ సీజన్‌కు శివాజీని ఎంపిక చేసి బిగ్‌బాస్ తలపట్టుకున్నట్టు కనిపిస్తోంది…!!
Share this Article