ఒడిశా రాజకీయాల్లో మళ్లీ ఓ మార్పు దిశగా పరిణామాలు సంభవిస్తున్నాయి… బీజేపీ, బీజేడీ చేతులు కలిపే సూచనలు, అడుగులు కనిపిస్తున్నాయి… ఒకవైపు బీజేపీ, మరోవైపు బీజేడీ విడివిడిగానే ఈ పొత్తు ఎలా ఉంటే బాగుంటుందో చర్చిస్తున్నాయి… అంతా అనుకున్నట్టు జరిగితే వచ్చే లోకసభ ఎన్నికల్లో ఒడిశాలోని 14 స్థానాల్లో బీజేపీ, 7 స్థానాల్లో బీజేడీ పోటీచేస్తాయి… ఇదే రేషియో రివర్స్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అమలవుతుంది…
అంటే ఉజ్జాయింపుగా 47 సీట్లలో బీజేపీ, 100 స్థానాల్లో బీజేడీ పోటీచేయాలి… అంటే నవీన్ పట్నాయక్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి… ప్రస్తుత అసెంబ్లీలో బీజేడీకి 113 స్థానాలున్నయ్, బీజేపీకి 23 ఉన్నయ్… కాంగ్రెస్ 9 సీట్లతో దాదాపు కౌంట్ లెస్… సో, ప్రస్తుతం చర్చల్లో ఉన్న రేషియో బీజేపీకి కూడా ఉపయోగకరమే… రెండూ కలిస్తే 85 శాతం వోట్లు కూటమికి పడతాయని, క్లీన్ స్వీప్ అని అంచనా…
కానీ ఎందుకీ పొత్తు..? ఎందుకంటే..? బీజేపీకి ఆశలున్న రాష్ట్రాల్లో ఒడిశా ఒకటి… కేంద్ర వ్యవహారాలకు సంబంధించి నవీన్ పట్నాయక్ బీజేపీతో ఘర్షణ పడటం లేదు… కేవలం రాష్ట్రానికే పరిమితమై, కేంద్రానికి అంశాలవారీగా మద్దతు ఇస్తున్నాడు… ఆ రెండు పార్టీలే ఒడిశాలో ప్రత్యర్థులు, ఐనా అక్కడ ఎవరూ పరస్పరం విద్వేషాన్ని ఏమీ గుమ్మరించుకోవడం లేదు… కానీ…?
Ads
నవీన్ పట్నాయక్ వయస్సు 77 ఏళ్లు… తన లెగసీ అందుకోవడానికి రాజకీయ వారసులు ఎవరూ లేరు… తను రాజకీయ వారసుడిగానే ఫీల్డ్‌లోకి వచ్చినా సరే, తనకు వారసత్వ రాజకీయాలపై ఆసక్తి లేదు… అక్క గీతా మెహతా, పాపులర్ రచయిత్రి… ఆమె కూడా గత సెప్టెంబరులో మరణించింది… ఆమె కొడుకు ఆదిత్య సింగ్ మెహతా… తను రాజకీయాల్లో యాక్టివ్‌గా ఏమీ లేడు… అసలు మెయిన్ స్ట్రీమ్‌లో మీడియాకే దొరకడు…
పట్నాయక్ 24 ఏళ్లుగా తనే ముఖ్యమంత్రి అక్కడ… ఈరోజుకూ పవర్ ఫుల్లే… ఆ రాష్ట్రంలో మాస్ లీడర్ తనే, క్లాస్ లీడర్ తనే… కాంగ్రెస్‌కు పెద్దగా ప్రాస్పెక్టస్ ఏమీ లేదక్కడ… రీసెంట్ సర్వేలలో బీజేపీ బలం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది… తన ఆరోగ్యం కూడా అంత మెరుగ్గా లేదనే వార్తలు వస్తున్నాయి అప్పుడప్పుడూ… సో, బీజేపీతో వైరంకన్నా… కేంద్రంలో మీకు మేము, రాష్ట్రంలో మాకు మీరు మద్దతుగా నిలబడదాం అనే సూత్రంతో పొత్తుకు రెడీ అవుతున్నట్టు చెబుతున్నారు…
ఈసారి సొంతంగా 370, కూటమిగా 400 సీట్లు అని టార్గెట్ పెట్టుకున్న బీజేపీకి బీజేడీ కలిస్తే ఆ దిశలో మరో పాజిటివ్ అడుగు..!!
Share this Article