Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసెంబ్లీకి వోటర్లు వద్దన్నారు… ఏమో, పార్లమెంటుకు పంపిస్తారేమో…

December 25, 2023 by M S R

ఓసోస్… మమ్మల్ని అసెంబ్లీకి వద్దన్నారు… పార్లమెంటుకే వెళ్లమంటారు… గత ఎన్నికల్లో చూడలేదా అంటున్నారుట కొందరు నాయకులు… నిజమే, అంబర్‌పేటలో ఓడిపోతే ఒక కిషనుడు సికింద్రాబాదులో గెలిచి ఏకంగా కేంద్ర మంత్రి అయిపోయాడు… కరీంనగర్‌లో ఓడిపోతేనేం, అక్కడే ఎంపీగా గెలిచాడు బండి సంజయుడు… అంతెందుకు..? మన ముఖ్యమంత్రి కొడంగల్‌లో ఓడిపోతేనేం, మల్కాజిగిరి నాదే అన్నాడు, గెలిచాడు…

సో, అసెంబ్లీ ఎన్నికల్లో వద్దు అన్నారంటే వోటర్లు పార్లమెంటుకు పంపించవచ్చు… ఇప్పుడిక బీజేపీలో నలుగురైదుగురు ఎంపీ సీట్లలో పోటీకి రెడీ అట… ధర్మపురి అర్వింద్, బండి సంజయ్, సోయెం బాపూరావు, కిషన్‌రెడ్డి ఎంపీలుగా పోటీలకు సంసిద్ధమట… ఏమో, రెండు స్థానాల్లోనూ ఓడిపోయిన ఈటల కూడా ఏదో ఒక సీటు నుంచి ఎంపీ పోటీకి సై అంటాడేమో… డీకే అరుణ కూడా పోటీకి వచ్చేసే చాన్సుంది… ఈ ఆరుతోపాటు చేవెళ్ల, మల్కాజగిరి సీట్లపైనా బీజేపీకి ఆశలున్నయ్… హైదరాబాద్ ఎలాగూ పోటీచేస్తారు, గెలిచినా ఓడినా సరే, అక్కడ కమలం గుర్తు ఉండాల్సిందే…

బీఆర్ఎస్‌తో ఆ దోస్తీని కట్టిపెట్టి… జనాన్ని పిచ్చోళ్లను చేసే ఎత్తుగడల్ని అటక మీదకు పారేసి… సిన్సియర్‌గా ట్రై చేస్తే బీజేపీకి మంచి రిజల్ట్ వస్తుంది… గత ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు వచ్చాయి… ఈసారి బీఆర్ఎస్ మీద జనంలో తీవ్ర వ్యతిరేకత ఉంది… అందుకే బీఆర్ఎస్‌తో దోస్తీని జనం తిరస్కరించి, బీజేపీకి కూడా వాతలు పెట్టారు… గెలవాల్సిన ప్రముఖులూ ఓడిపోయారు… ఇకనైనా కళ్లు తెరిస్తే బెటర్, సొంతంగా బలం పెంచుకోవచ్చు…

Ads

పార్టీలోకి రావల్సినవాళ్లు రాక, ఆల్రెడీ వచ్చినవాళ్లు వెళ్లిపోయి బీజేపీ పెరగాల్సినంత పెరగలేదు… కేసీయార్‌కు ఏదో మేలు చేయబోయి తను చేతులెత్తేసింది… ఐనా సరే, జనం కొన్ని ఏరియాల్లో నమ్మారు… ఎనిమిది సీట్లు వచ్చాయి… థర్డ్ లార్జెస్ట్ పార్టీ… గత ఎన్నికల్లో కేవలం ఒకటే… సో, మంచి స్కోప్ ఉంది… బీఆర్ఎస్ కోవర్టులను ఓ కంట కనిపెట్టి, సిన్సియర్‌గా కష్టపడితే బీజేపీకి మంచి రిజల్ట్స్ వస్తాయి… భువనగిరి, వరంగల్ సీట్లపైనా కొన్ని ఆశలున్నయ్ ఈసారి…

అబ్బే, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ హైకమాండ్ ఎప్పుడూ సరైన అడుగులు వేయడం లేదు అంటారా..? ఇప్పుడు కళ్లు తెరుచుకున్నాయి కదా, పాత తప్పులు చేయకపోవచ్చు… జనసేనతో పొత్తు కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాంగ్ స్టెప్… తెలంగాణ వాదులకు అస్సలు నచ్చలేదు… పవన్ కల్యాణ్‌తో దోస్తీని ఏపీ హద్దులు దాటనివ్వొద్దు… అవునూ, చేవెళ్ల, మల్కాజగిరి అభ్యర్థులు ఎవరవుతారబ్బా..?! చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి అనుకుందాం… మల్కాజగిరి నుంచి ఈటల రాజేందరేనా..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ విశ్వసుందరి కిరీటం ధగధగల వెనుక కొన్ని చీకటి నీడలు…!!
  • అసలు తండ్రిని నేనేనా..?! కుటుంబ వ్యవస్థనే కూల్చేసే ‘పితృత్వపరీక్షలు’..!!
  • నచ్చిన వార్త..! ఓ ఉచిత ఇంజక్షన్‌తో రోజూ ఆరు ప్రాణాలు కాపాడారు..!!
  • పవర్ పాలసీ..! కేసీయార్ నష్టకారకాలు Vs రేవంత్ రెడ్డి కొత్త టెక్నాలజీలు..!!
  • సుహాసిని, విజయశాంతి ఓవర్ డోస్ ఎదుట అంతటి కుయిలీ వెలవెల..!!
  • అందరికీ కొత్త ఆధార్ కార్డులు..! అవసరం ఏమిటి..? ఎప్పటి నుంచి..?!
  • స్మృతి మంధానా పెళ్లికి ఈ విఘ్నాల వెనుక అసలు మర్మమేమిటో..!?
  • వందల కోట్లు కాదు… సినిమా పెద్ద తలలు చూడాల్సిన ఓ వండర్ ఇది…
  • అసలు ఏమిటీ చండీగఢ్ లొల్లి..? మోడీ ఏమైనా తప్పుచేశాడా..?
  • అయోధ్య..! గుడి నిర్మాణం సంపూర్ణం..! ధర్మధ్వజం విశేషం ఇదీ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions