.
మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల ఫలితాలు… అనూహ్యం… కానీ అక్కడి ప్రతిపక్షాల వైఫల్యం, దరిద్రపు సిద్ధాంతాలు, పోకడలు అనుకున్నారు జనం… కానీ ఇంకేదో జరిగింది అనే అభిప్రాయాలు వ్యాప్తి చెందాయి… కానీ అన్నీ సమసిపోయాయి… కానీ ప్రస్తుతం ఓ కీలక ప్రశ్న…
బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ ఆ తరహా ఫలితాలు రాబోతున్నాయా..? మమత, స్టాలిన్, విజయన్ ముగ్గురూ మరో ఠాక్రే, మరో శరద్ పవార్, మరో తేజస్వి యాదవ్ కాబోతున్నారా..? ఆశ్చర్యం అనిపిస్తోంది కదా… పదండి వివరాల్లోకి వెళ్దాం… నిజానిజాల్లోకి కూడా…
Ads
ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ వ్యవహారశైలి మీద కూడా బోలెడు ఆరోపణలు వచ్చాయి… బీజేపీయేతర పక్షాలు ఏకంగా అభిశంసనకు, తొలగింపుకీ పార్లమెంటులోనే తీర్మానం ప్రతిపాదించాయి… ఈ దేశంలో ఇది మొదటిసారి… ఐతే ఇప్పుడు మరో వివాదం రగులుకుంది… ఇది ఇంకాస్త తీవ్రం…
కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల ఎన్నికల ముఖ్యాధికారులకు ఓ సర్క్యులర్ పంపించింది… విడ్డూరం ఏమిటంటే… దానిపై బీజేపీ స్టాంప్ ఉంది… నమ్మడం లేదా..? ఇదుగో…

వెంటనే కేరళ సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, ఇతర కూటమి పార్టీలు స్పందించాయి… మలయాళం మీడియా అందుకుంది… ఓ కొత్త రచ్చ… బీజేపీ, ఎన్నికల సంఘం ఒకే ఆఫీసు నుంచి పనిచేస్తున్నాయా..? బీజేపీ ఆఫీసు నుంచి ఎన్నికల సంఘమా..? ఎన్నికల సంఘం ఆఫీసు నుంచి బీజేపీ పనిచేస్తున్నదా అని ప్రశ్నించాయి… దానికి కేరళ ప్రధాన ఎన్నికల అధికారి ఓ వివరణ జారీ చేశాడు… ఏమిటీ అంటే..?

‘‘అప్పుడెప్పుడో 2019లో జారీ చేసిన మార్గదర్శకాల క్లారిటీ కోరుతూ బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ లేఖ రాసింది, దానికి కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రతిని (2019) జతచేసి, ఆ లేఖకు సంబంధించిన ప్రతి కాగితం మీద కేరళ బీజేపీ స్టాంప్ వేసింది… అది రొటీన్ వ్యవహారమే… ఇందులో ఎన్నికల సంఘానికి ఏ సంబంధమూ లేదు, అనవసర ప్రచారాలు సరికాదు…’’ ఇదీ కేరళ ఎన్నికల ప్రధానాధికారి వివరణ…
నిజమే… పైన క్లిప్పింగులో స్పష్టంగానే ఉంది… 2019 తేదీ… ఒకవేళ నిజంగానే ఎన్నికల సంఘం, కేరళ బీజేపీ కుమ్మక్కయిన పక్షంలో… మరి అప్పుడు సీపీఎం కూటమే కదా గెలిచింది… మరిక సంయుక్త కుట్ర ఏముంది..? ఏమీ లేనట్టే కదా…! తాజాగా ఓ రాద్ధాంతం మీడియా సృష్టే అన్నట్టు కనిపిస్తోంది…
కానీ మలయాళ మీడియా ఊరుకోదు కదా… కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ ఒకే ఆఫీసు నుంచి ఆపరేట్ చేస్తున్నాయి… ఎన్నికల సంఘం వివరణ కూడా సరిగ్గా లేదు… క్లరికల్ ఎర్రర్ అని రాసింది… అదీ తప్పు… అది కేంద్ర ఎన్నికల సంఘంలో జరిగిన ఎర్రర్ కాదు కదా… బీజేపీ ప్రజెంట్ చేసిన మెమోరాండం మీద, ఆ ప్రతుల మీద బీజేపీ స్టాంప్ ఉంటే, ఎన్నికల సంఘం క్లరికల్ ఎర్రర్ అని వివరణ ఇవ్వడం ఏమిటి..? చెత్తా పనితీరు..!!
Share this Article