బాడీ షేమింగ్… కాదు, అదోరకం ర్యాగింగ్… ఈటీవీలో శృతిమించుతోంది… ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా… ఈటీవీలో క్రియేటివ్ డైరెక్టర్లు ఎవరో గానీ… వాళ్లది మరీ నీచాభిరుచి కనిపిస్తోంది… లేడీ కమెడియన్లు, లేడీ ఆర్టిస్టులు, ఎంత వెకిలి జోకులు వేసినా ఏమీ అనలేరు, సున్నితమైన కెరీర్లు… వేధింపులు… తలొంచుకుని భరించాలి… లేదంటే ఇండస్ట్రీలో తొక్కేస్తారు… వేరే ఎక్కడా చాన్సులు రాకుండా చేస్తారు… దుష్ప్రచారాలు చేస్తారు… తాజాగా మరో ఉదాహరణ…
వర్ష… టీవీల్లో కామెడీ షోలలో కమెడియన్లు అంటేనే కొందరు మగాళ్లకు ఆడవేషాలు వేసి నడిపించడం జబర్దస్త్‌తోనే మొదలైంది… ఆ లేడీ గెటప్పులకు మెరిట్ ఉంది, నెట్టుకొస్తున్నారు, ఈలోపు మెల్లిమెల్లిగా కొందరు లేడీ కమెడియన్లు అడుగుపెట్టారు… రోహిణి, సత్య శ్రీ, వర్ష… తరువాత బిగ్‌బాస్ నుంచి కొందరు వచ్చారు… కొందరు ఉండలేక వెళ్లిపోయారు… వర్ష గురించి చెప్పాలి… టీవీల్లో సీరియళ్లు చేసుకునేది… జీతెలుగు ప్రేమ ఎంత మధురంలో మంచి పాత్రే చేసేది…
ఈ జబర్దస్త్‌ను నమ్ముకుని వాటిని వదిలేసింది… ఈజ్ ఉంది, టైమింగ్ ఉంది… కానీ ఈమధ్య విపరీతంగా బాడీషేమింగ్‌కు గురవుతోంది… ఆదివారం వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీలో హైపర్ ఆది ‘‘సర్జరీ కోసం డబ్బులు అడుగుతుంది…’’ వంటి ఏవో రెండుమూడు పిచ్చి డైలాగులు వేశాడు… పదే పదే ఆమెను లేడీ గెటప్ అంటూ, మగాడిలాగా ఉందని వెక్కిరిస్తూ టార్గెట్ చేస్తున్నారు… అవి ఎడిట్ కూడా కావడం లేదు, యథాతథంగా ప్రసారం అవుతున్నయ్…
Ads
రంగ్‌దే అని హోళీ కోసం ఓ షో చేశారు… 20న ప్రసారం అవుతుందట… సహజంగానే ఎప్పటిలాగే సుడిగాలి సుధీర్‌ను అందులో లేకుండా కట్ చేశారు… ఒకరిద్దరు మాటీవీ ఆర్టిస్టులు కూడా కనిపించారు… కానీ అదికాదు… ఓ సందర్భంలో అదే హైపర్ ఆది ‘‘సాటి మగాడిలా ఆలోచించు’’ అని మరో విసురు… సరే, తను అందరి మీదా పంచులు వేస్తూనే ఉంటాడు… ఆమధ్య ఆమెతో లవ్ ట్రాక్ కూడా నడిపిన ఇమాన్యుయేల్ కూడా ఓ సందర్భంలో ‘‘ఆమె కూడా మగాడిలాగే ఉంటుంది కాబట్టి’’ అని ఓ పంచ్ వేశాడు… వెంటనే పక్కనే ఉన్న భాస్కర్ ‘‘పదే పదే అలా అనకురా, అందరూ నిజం అనుకుంటున్నారు, మా ఆవిడ అడిగింది నిజంగా ఆమె లేడీ గెటప్పాని’’ అన్నాడు…
ఫస్ట్ నుంచీ ఆ రంగ్ దే షోలో ఆమెపై ఇలా పంచులు పడుతూనే ఉన్నయ్… ఇక వర్ష తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి లేచి పక్కకు వచ్చేసింది… ‘‘ఒక్కసారి, రెండుసార్లు… పదే పదే మగోడు, మగోడు అని ఏంటిది..?’’ అంటూ ఏడ్చేసింది… ఇదా పండుగపూట ప్రసారం చేసే సరదా కార్యక్రమం..? ఇదంతా ప్రోమోలో కట్ చేసి ప్రసారం చేసేవాడికి… సెట్లలో మరీ ఆడవాళ్ల మీద బాడీ షేమింగ్ చేసేవాళ్లకు.., ఎంటర్‌టెయిన్ చేసేవాళ్లకు… ఇదే గొప్ప క్రియేటివిటీ అనుకుంటున్న సదరు షోల నిర్మాతలకు… ఒక ప్రశ్న… ఏం పుట్టిందిర భయ్ మీకు..?! ఇదా కామెడీ… థూ…!! (అబ్బే, ఇదంతా స్కిట్‌లో భాగమే అని ఎవరైనా సమర్థించుకున్నా సరే, ఇదంతా చిల్లరగా ఉంది… ఇంకెన్నాళ్లుర భయ్ రోహిణి స్థూలకాయం మీద, విష్ణుప్రియ ముక్కు మీద, ఫైమా కలర్ మీద, వర్ష ఓవరాల్ లుక్కుమీద ఈ సిగ్గుమాలిన బాడీ షేమింగులు…!)
Share this Article